ఇక్బాల్ పాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 1:
{{ మొలక}}
'''ఇక్బాల్ పాషపాషా''' అను ఈ కవి, రచయిత [[మహబూబ్ నగర్ జిల్లా]] , [[కొల్లాపూర్]] కు చెందినవారు. 1981లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, కొల్లాపూర్ లోని నవోదయ పాఠశాలలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం [[గద్వాల]] మండలం అనంతాపురంలోని ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, గద్వాలలో స్థిరపడ్డారు.
==సాహితీ రంగం==
కళాశాలలో చదివే రోజుల నుంచే కథలు, కవితలు రాయడం ప్రారంభించారు.. 1977 లో తొలిసారి 'దేవుడికో లేఖ' పేరుతో కథ రాశారు. 1984 లో గద్వాలలో జరిగిన విరసం సభలలో [[ స్పందన ]] పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. 1985 నుంచి వరుసగా రాస్తూ వచ్చిన కథలతో 2011 లో [[ కఫన్ ]] అను పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. విరసం వారి 'కథల పంట' లో, అరుణతార పత్రికలో వీరి కథలు ముద్రించబడ్డాయి. వీరి కథలన్నీ సామాజిక సమస్యల నేపథ్యంగా రాసినవే. గట్టు మండలంలో నెట్టెంపాడు రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలపై రాసిన ' కాల్వ మింగిన ఊరు ', పోలేపల్లి సెజ్ సమస్యపై రాసిన ' కఫన్ ' కథలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. [[పాలమూరు అధ్యయన వేదిక]] కు జిల్లా భాధ్యులుగా పని చేస్తూ వివిధ సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఈ వేదికలో పని చేస్తున్న ఇతర కవులు [[పరిమళ్]] , [[ ఉదయమిత్ర ]] లతో కలిసి [[ దుఃఖాగ్నుల తెలంగాణ ]] అను కవితా సంకలనాన్ని వెలువరించారు. వీరు ఉదయమిత్రతో కలిసి పాలమూరు జిల్లాలోని పోలేపల్లి సెజ్ ( ప్రత్యేక ఆర్థిక మండలి) సమస్యలపై రాసిన కొన్ని కథలు,కవితలతో కలిపి [[ ఓడిపోలే...పల్లె ]] అను పుస్తకాన్ని వెలువరించారు. 1978 నుండి 2010 వరకు తాను రాసిన వాటిలో ఓ 88 కవితలతో [[ సేద్యం (కవితా సంపుటి)|సేద్యం]] కవితా సంపుటిని 2011 లో వెలువరించారు. ఇంకా రాస్తూనే ఉన్నారు.
 
[[ వర్గం : మహబూబ్ నగర్ జిల్లా కవులు]]
"https://te.wikipedia.org/wiki/ఇక్బాల్_పాష" నుండి వెలికితీశారు