వెల్చేరు నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 6:
== సాహిత్య విమర్శ, పరిశోధన ==
వేల్చేరు నారాయణరావు విశిష్టమైన అవగాహనతో, లోతైన పరిశోధనతో, విస్తృతమైన అధ్యయనంతో తెలుగు విమర్శారంగంలో తనదైన స్థానాన్ని పొందారు. ఆయన తొలి విమర్శా గ్రంథమైన "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం"లో కవిత్వంలోని విప్లవాల గురించి వివరించారు. విప్లవాత్మక కవితల రూపం, విషయం, వ్యక్తీకరణ – ఈ పార్శ్వాలన్నీ ఆ కవిత పుట్టిన సందర్భాన్ని ప్రతిబింబిస్తాయని ఈ సిద్ధాంతసారం. దీన్నుంచి కొన్ని విప్లవాత్మకమైన ఉపలక్ష్యాలు కూడా వస్తాయి. (అ) కవులు విప్లవాలను తీసుకురారు, (ఆ) తామున్న సమాజ సందర్భాన్ని అర్థం చేసుకున్న కవులు ఆ సందర్భానికి అనుగుణంగా కవిత్వం రాస్తారు, (ఇ) అలాటి వారిలో సమర్థులైన వారు ఆ కవితావిప్లవానికి నాయకులుగా గుర్తింపబడతారు, (ఈ) సమర్థులైనా సందర్భాన్ని అర్థం చేసుకోలేని వారూ, లేదా ఆ సందర్భాన్ని తాము మార్చగలమనుకునే వారూ రాసే కవిత్వం నిలబడటానికి, వారి సమర్థత పాలు సందర్భానికి అనుగుణంగా రాసే వారి కన్నా ఉన్నతమైనదై వుండాలి అనేవి ఈ గ్రంథంలోని అంశాలకు స్థూలమైన సారాంశం.
ఈ గ్రంథంలోని విషయ విస్తరణ 20వ శతాబ్దిలోని కవిత్వ విప్లవాలపై ఎక్కువ ఆధారపడిందన్న ప్రముఖ విమర్శకులు కె.వి.ఎస్.రామారావు తదనంతర పరిశోధనల్లో ఆ లోపం పూరిస్తూ పూర్వసాహిత్యాన్ని నారాయణరావు కొత్త కోణంలో పరామర్శించారు అన్నారు. ఈ కోణంలో నారాయణరావు గ్రంథాలను విశ్లేషిస్తూ కె.వి.ఎస్.రామారావు ''శ్రీనాథుడి గురించిన పరిశోధన, పురాణ దశ నుంచి ప్రబంధ దశకి జరిగిన పరిణామక్రమంలో, ఒక ముఖ్యమైన మజిలీగా గుర్తించటం. చాటుపద్యాల గురించిన పరిశీలనలు, ప్రబంధ దశకి పట్టుగొమ్మలైన పండితబృందాలు కవిత్వాస్వాదనని ఒక అద్భుతమైన వ్యవస్థగా ఎలా తీర్చిదిద్దాయో, ప్రబంధ కవితా విప్లవాన్ని ఎలా నిలబెట్టాయో చూపిస్తాయి.
 
== రచనలు==