బలివాడ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు నవలా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:balivada_kanta_rao.jpg|thumb|right|శ్రీ బలివాడ కాంతారావు చిత్రం]]
'''బలివాడ కాంతారావు''' ( [[1927]], [[జూలై 3]] - [[2000]], [[మే 6]] ) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన [[ఆంధ్రప్రదేశ్]] లోని [[శ్రీకాకుళం]] జిల్లాలోని [[మడపాం]] అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పని చేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు<ref>[http://www.indiaclub.com/shop/AuthorSelect.asp?Author=Balivada+Kantha+Rao Balivada Kantha Rao]</ref>. ఈయన రచనలపై కొద్దిమంది పరిశోధనలు కూడా చేశారు. అదే విధంగా ఈయన రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదించబడ్డాయి. 1998లో [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]ను అందుకున్నారు.<ref>[http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa10321.htm Sahitya Akademi.Award Winners]</ref> ఇంకా చాలా అవార్డులు ఈయన్ని వరించాయి. వీటిలో [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు]], తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, [[గోపీచంద్ సాహిత్య పురస్కారం]], [[రావిశాస్త్రి స్మారక పురస్కారం]], కళాసాగర్ విశిష్ట పురస్కారం ముఖ్యమైనవి. ఐదు దశాబ్దాలపాటు ఏకధాటిగా రచనలు చేసినా, ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
 
==ఇతర విశేషాలు==
* ఈయన రచన [[దగాపడిన తమ్ముడు]] నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషలలోకీ విడుదల చేసారు.1972లో ''పుణ్యభూమీ'' నవలకు అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది
* 1986లో ''వంశధార'' నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు లభించాయి.
* సాహిత్యంలో కాంతారావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు
* 1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పిరస్కారం ,రావి శాస్త్రి స్మారక పురస్కారం,
* 1998లో విశాలంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన ''బలివాడ కాంతారావు కథలు '' కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
 
అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాలలో వీరిని సత్కరించాయి.బలివాడ కాంతారావు గారి రచనలపై ముగ్గురు సింద్ధాంత వ్యాసాలను రాసి పి.హెచ్.డి. డిగ్రీలు,కొందరు ఎం.పి.ఎల్ డిగ్రీలు సంపాదించారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/బలివాడ_కాంతారావు" నుండి వెలికితీశారు