ఉదయకిరణ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు.. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు.
తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు.
==ఆత్మహత్య==
ఉదయ్ కిరణ్ శ్రీనగర్‌కాలనీ లో భార్య విషితతో కలిసి మూడు గదుల ఇంటిలో అద్దెకుంటున్నారు. మూడు పడక గదులు కలిగిన ఈ ఇంటిలోని ఓ గదిని వ్యాయామశాల గా మార్చుకున్నారు. 2014 నూతన సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఉదయ్ కిరణ్, విషిత 2014 జనవరి 2 న నగరానికి చేరుకున్నారు. [[ఫేస్‌బుక్]] సంస్థలో పనిచేస్తున్న విషిత.. తన సహోద్యోగి, స్నేహితుడు రోహిత్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు జనవరి 5 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మణికొండ వెళ్లారు. కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉంటున్న ఉదయ్ కిరణ్ పరిస్థితి గమనించిన ఆమె తనతో పాటు రమ్మనగా... ఉదయ్ నిరాకరించాడు. దీంతో తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి విషిత పార్టీకి వెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్త మేఘల, మామ గోవిందరాజన్‌లను మణికొండలోని వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పారు. తాను రాత్రి 11 గంటలకు వచ్చి విషితను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల, గోవిందరాజన్ వెళ్లిపోయారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విషిత 11 గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉదయ్ రాక కోసం వేచి చూశారు. పావు గంట గడచినా రాకపోయే సరికి ఫోన్ చేశారు. ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో మూడుసార్లు ప్రయత్నించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత... తన మేనమామ, తండ్రితో కలిసి మణికొండ నుంచి బయల్దేరారు.
ఒంటి గంట ప్రాంతంలో శ్రీనగర్‌కాలనీలోని ప్లాట్‌కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం, ఉదయ్ అంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు. లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకూ తెరుచుకోకపోవడంతో వాచ్‌మన్లు మరికొందరితో కలసి బలవంతంగా తెరిచారు. అక్కడ ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు. కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ఉదయకిరణ్_(నటుడు)" నుండి వెలికితీశారు