యూ థాంట్: కూర్పుల మధ్య తేడాలు

1,195 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 57 interwiki links, now provided by Wikidata on d:q1264 (translate me))
దిద్దుబాటు సారాంశం లేదు
{{Infobox Secretary-General
| name = యూ థాంట్
| nationality = [[Bamar|Burmese]]
| image = U-Thant-10617.jpg
| caption = Thant pictured in 1968.
| order = [[Secretary-General of the United Nations]]
| term_start = నవంబరు 30, 1961
| term_end = డిసెంబరు 31, 1971
| predecessor = [[Dag Hammarskjöld]]
| successor = [[Kurt Waldheim]]
| birth_date = {{birth date|1909|1|22}}
| birth_place = [[Pantanaw]], [[British Burma]], [[British Raj|British India]]
| death_date = {{nowrap|{{death date and age|1974|11|25|1909|1|22}}}}
| death_place = [[New York City]], [[United States]]
| death_cause = Lung cancer
| resting_place = Tomb south of [[Shwedagon Pagoda]], [[Yangon]], [[Burma|Burma {{small|(Myanmar)}}]]
| parents = {{unbulleted list |Po Hnit |Nan Thaung}}
| spouse = [[Burmese name|Daw]] Thein Tin
| children = {{unbulleted list |Maung Bo |Tin Maung Thant |Aye Aye Thant}}
| relations = {{unbulleted list |Po Hnit {{small|(father)}} |Nan Thaung {{small|(mother)}} |Khant {{small|(brother)}} |Thaung {{small|(brother)}} |Tin Maung {{small|(brother)}}}}
| religion = [[Theravada Buddhism]]
}}
 
యూ థాంట్ (U Thant ) [[ఐక్యరాజ్య సమితి]] యొక్క మూడవ ప్రధాన కార్యదర్శ్. ఇతడు [[1909]], [[జనవరి 22]]న దిగువ [[బర్మా]] (ప్రస్తుత [[మయాన్మార్]])లోని పాంటనావ్‌లో జన్మించాడు. [[డాగ్ హమ్మర్స్ జోల్డ్]] [[సెప్తెంబర్]] [[1961]]లో [[విమానము|విమాన]] ప్రమాదంలో మరణించిన పిదప యూ థాంట్ [[1971]] వరకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి [[ఆసియా]] ఖండం నుంచి ఈ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా నిల్చినారు.
 
యూ థాంట్ రంగూన్ విశ్వవిద్యాలయం (ప్రస్తుత యాంగాంగ్ విశ్వవిద్యాలయం)లో ఉన్నత విద్య అభ్యసించాడు. [[1928]]-[[1931|31]] కాలంలో ఉపాధ్యాయుడిగా, [[1931]]-[[1947|47]] కాలంలో పాంటనావ్ జాతీయ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసినాడు. [[1948]]లో బర్మా [[గ్రేట్ బ్రిటన్]] నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ప్రధానమంత్రి [[యు ను]] (U Nu) అభ్యర్థనపై [[1949]]లో యూ థాంట్ సమాచార శాఖ సంచాలకులుగా పనిచేసినాడు. [[1949]]-[[1953|53]] కాలంలో సమాచార శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. 1953-[[1957|57]] వరకు ప్రధానమంత్రి కార్యదర్శిగా వ్యవహరించి యు ను ఉపన్యాసాలను, విదేశీ పర్యటనలను సిద్ధం చేయడం, వీదేశీ ప్రముఖుల సమావేశాలను సిద్ధం చేయుటలో సహకరించినాడు. [[1955]]లో [[ఇండోనేషియా]]లోని [[బాండుంగ్]] లో జరిగిన ఆఫ్రో-ఏషియన్ సదస్సుకు కార్యదర్శిగా వ్యవహరించినాడు. ఈ సదస్సే [[అలీన రాజ్యాల ఉద్యమం]]కు ఊపిరిపోసింది. [[1957]]లో ఐక్యరాజ్య సమితిలో బర్మా శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డాడు. 1961లో డాగ్ హమ్మర్స్ జోల్డ్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత తదుపరి కాలానికి యూ థాంట్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. [[1966]]లో మళ్ళీ రెండవ పర్యాయము ఆ పదవికి ఎన్నికైనాడు. [[1971]]లో ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించినాడు. [[1974]] [[నవంబర్ 25]]న [[న్యూయార్క్]] లో మరణించాడు.
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
== బయటి లింకులు ==
* [http://www.un.org/av/photo/subjects/sg3.htm UN Photos of U Thant]
1,31,234

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/999730" నుండి వెలికితీశారు