అతినీలలోహిత వికిరణాలు

అతినీలలోహిత వికిరణాలు (ఆంగ్లం: Ultraviolet) అనేవి ఒకరకమైన విద్యుదయస్కాంత వికిరణాలు. వీటి తరంగ దైర్ఘ్యం (Wavelength) 10 నా.మీ నుంచి 400 నా.మీ వరకు ఉంటుంది. ఇది దృశ్యకాంతి కంటే తక్కువ,, ఎక్స్ కిరణాల కంటే ఎక్కువ. సూర్యుని నుండి వెలువడే మొత్తం కాంతిలో ఇది 10% వరకు ఉంటుంది. ఈ కిరణాలు శరీరాన్ని ఎక్కువగా తాకితే చర్మం కందిపోవడం, మాడినట్టు అవడం జరుగుతుంది. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. భూమిపై ఉన్న వాతావరణం సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను చాలా వరకు నిరోధిస్తుంది. అలా జరగకపోతే భూమిపైన జీవజాలానికి తీరని ముప్పు ఎదురవుతుంది. భూమిపై నివసించే సకశేరుకాలలో ఎముకలు గట్టిపడటానికి కారణమయ్యే విటమిన్ డి తయారవడానికి కూడా ఈ కిరణాలు కొంతవరకు కారణమవుతాయి. కాబట్టి ఈ కిరణాలు ఒక రకంగా మంచివి మరో రకంహా హానికరమైనవి. చాలావరకు మానవుల కంటికి ఈ కిరణాలు కనిపించవు కానీ కొన్ని కీటకాలు, పక్షులు, క్షీరదాలు వాటికున్న ప్రత్యేక దృష్టి వల్ల వీటిని చూడగలవు.

ఓజోన్ పొరలో అతినీలలోహిత కిరణాల గ్రాఫ్ లో రకాలు.

తరంగ దైర్ఘ్యాల లేదా పౌనఃపున్యాల సముదాయాన్ని వర్ణపటమంటారు. థర్మోపైల్ అనే ఒక సూక్ష్మగ్రాహ్య ఉష్ణమాపకాన్ని వర్ణపటంలో ఉన్న ఎరుపు రంగుకు కుడివైపుకి జరిపినపుడు ఉష్ణోగ్రతలో పెరుగుదలని సూచిస్తుంది. దీని మూలంగా, ఈ వికిరణాలను ఉష్ణవికిరణాలనీ, వీటినే పరారుణ వికిరణాలు అని అంటారు. ఇలాంటి వికిరణాలను ఉష్ణజన కాలయిన ఎలక్ట్రిక్ హీటర్, వేడిగా ఉన్న సోల్డరింగ్ ఐరన్, వేడిగా ఉన్న ఇస్త్రీ పెట్టెల నుండి ఉత్పత్తి అవుతాయి. పరారుణ వికిరణాలు (IR - Infrared Radiations) కంటికి కనిపించవు. సాధారణ సోడా గాజు, పరారుణ వికిరణాలని శోషణము చేస్తుంది. రాక్‍సాల్ట్ పరారుణ కిరణాలను శోషణం చేసుకొనదు. దీనివలన రాక్‍సాల్ట్తో తయారైన పట్టాకాలనుపయోగించి, ఈ (పరారుణ) వికిరణాలను గమనిస్తారు.

ప్రత్యేక ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను ఉదా రంగుకు అవతల తరంగదైర్ఘ్యాలు తగ్గే దిశలో ఉంచినచో ఆ ప్లేటును వికిరణాలు ప్రభావితం చేస్తాయి. కంటికి కనిపించని ఈ వికరణాల్ని అతినీలలోహిత వికిరణాలు (UV - Ultra Violet Radiations) అంటారు.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు