అర్మేనియా మారియట్ హోటల్, యెరెవాన్

ఆర్మేనియా మారియట్ హోటల్ (అర్మేనియన్:Արմենիա Մարիոթ Հյուրանոց Երևան), ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని ఒక 5-స్టార్ లగ్జరీ హోటల్. ఇది కెంట్రాన్ జిల్లాలో ఉన్నది. ఇది సోవియట్ కాలంలోని 1958 వ సంవత్సరంలో  ప్రభుత్వ ఆధీనంలో ఆర్మేనియా హోటల్ గా ప్రారంభించబడింది. యు.ఎస్.ఎస్.ఆర్ కుప్పకూలిన తరువాత, 1998 లో ఈ హోటల్ ను ప్రైవేటీకరించి పునర్నిర్మించారు. దీనిని 1999 లో అర్మేనియా మారియట్ హోటల్ యెరెవాన్ గా నామకరణం చేసి ప్రారంభించారు.[1]

అర్మేనియా మారియట్ హోటల్ యెరెవాన్
సాధారణ సమాచారం
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
భౌగోళికాంశాలు40°10′40″N 44°30′41″E / 40.17778°N 44.51139°E / 40.17778; 44.51139
ప్రారంభం1958
యజమానిఎ.కె. డవలెప్మెంట్
యాజమాన్యంమారియాట్ హోటల్స్ & రిసార్ట్స్
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య9
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిమార్క్ గ్రిగోరీన్
ఎడ్వర్డ్ సరాపియన్
ఇతర విషయములు
గదుల సంఖ్య259
సూట్ల సంఖ్య14
రెస్టారెంట్ల సంఖ్య7
జాలగూడు
అధికారిక సైటు

ఈ హోటల్ 1 అమిర్యాన్ వీధి పై, రిపబ్లిక్ స్క్వేర్ వైపు తిరిగి ఉంటుంది. నేషనల్ గేలరీ, ఒక ప్రభుత్వ భవనం హోటల్ ముందు ఉన్నాయి.

2016 వ సంవత్సరంలో 259 అతిథిగృహాలతో, [2] ఆర్మేనియా మారియట్ హోటల్ అర్మేనియాలోనే రెండవ అతిపెద్ద హోటల్.

చరిత్ర మార్చు

హోటల్ నిర్మాణాన్ని 1950 లో ప్రారంభించగా, 1958 లో పూర్తయింది. హోటల్ ను 1958 లో ప్రారంభించి అర్మేనియా అనే పేరు పెట్టారు.[3] ఇది రాష్ట్ర పాలిత ఇంటూరిస్ట్ సంస్థచే నిర్వహించబడుతుంది; సోవియట్ యూనియన్ లో హోటళ్ళు, పర్యటనల నియంత్రణ విభాగం ఈ హోటల్ ను నిర్వహిస్తుంది. ప్రారంభ సమయంలో, ఆర్మేనియా '''అర్మేనియన్ ఎస్.ఎస్.ఆర్'''లో అతిపెద్ద హోటల్. అలెగ్జాండర్ టమానియన్ డిజైన్ చేసిన యరెవెన్ యొక్క అసలు ప్రణాళిక ఆధారంగా ఆర్కిటెక్ట్స్ మార్క్ గ్రిగోరీన్, ఎడ్వర్డ్ సరాపియన్ ఈ హోటల్ ను రూపొందించారు.[4] ఈ ప్రాజెక్ట్ డైరెక్టరుగా కోస్తంటిన్ అల్లునీయన్ వహించారు. హోటల్ యొక్క పునాదిరాయి బసాల్ట్ రాయి అవ్వగా, హోటల్ ను పింక్ అర్మేనియన్ టఫ్ఫాతో నిర్మించారు.

1990 వ దశాబ్దంలో అర్మేనియాలో ఆర్థిక సంక్షోభం సంభవించిన తరువాత, 1998 లో "ఎకె డెవలప్మెంట్" సంస్థ ఈ హోటల్ ను కొనుగోలు చేసింది. పెద్ద ఎత్తున పునర్నిర్మాణం పనులు యు.ఎస్. $ 40 మిలియన్ల పెట్టుబడితో చేసిన తరువాత, హోటల్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిగా పునరాభివృద్ధి చెందింది. 1999వ సంవత్సరంలో తిరిగి ప్రారంభించినప్పటి నుండి దీనిని మారియట్ ఇంటర్నేషనల్ కు చెందిన మారియాట్ హోటల్స్ & రిసార్ట్స్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం, ఈ హోటల్లో 3 వేర్వేరు భవనాలు (అర్రాట్, ఆర్మేనియా, న్యూ భవనం) ఉన్నవి, అన్నీ పక్కపక్కనే ఉన్నాయి.[5]

ప్రత్యేకతలు మార్చు

హోటల్ లో అనేక రెస్టారెంటులు ఉన్నవి, హోటల్ "క్రిస్టల్" బార్, లాంజ్, "అర్మేనియా బ్రస్సేరీ" రెస్టారెంట్, "కుసినా" ఇటాలియన్ రెస్టారెంట్, "స్కూప్!" ఐస్క్రీం పార్లర్, "మీటింగ్ పాయింట్" అవుట్ డోర్ కేఫ్ వంటివి ఉన్నాయి.[6][7] ఈ హోటల్ లో 10 కాన్ఫరెంట్ హాల్స్, ఫిట్నెస్, ఆరోగ్య కేంద్రం, బహిరంగ స్విమ్మింగ్ పూల్ వంటివి కూడా ఉన్నాయి.

ఈ హోటల్ ను సమీపంలోని రిపబ్లిక్ స్క్వేర్ భూగర్భ మెట్రో స్టేషన్ ద్వారా చేరుకోవచ్చు.

సూచనలు మార్చు

  1. "Yerevan Hotels: Armenia Marriott". Archived from the original on 2017-01-21. Retrieved 2018-07-04.
  2. "Armenia Marriott Hotel Yerevan at yerevanresto.am". Archived from the original on 2016-12-20. Retrieved 2018-07-04.
  3. "History of the Armenia hotel". Archived from the original on 2016-12-12. Retrieved 2018-07-04.
  4. "Armenia Marriott Hotel at YSU website". Archived from the original on 2018-07-19. Retrieved 2018-07-04.
  5. Արմենիա Մարիոթ հյուրանոց, Հյուրանոցի նկարագիր
  6. Marriott Armenia restaurants
  7. New bar and restaurant to be opened at "Armenia Marriott