భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం


పౌర అణు ఒప్పందం భారతదేశం, అమెరికా దేశాల మధ్య అణు సహకారానికై కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సంయుక్త ప్రకటన ప్రకారం భారతదేశం తన అణు కార్యకలాపాలను, సైన్య సంబంధమైనవి, పౌర సంబంధమైనవి అని రెండుగా విభజించి రెండవ విభాగాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సమాఖ్య (ఇంటర్నేషనల్ అటామిక్ ఎనెర్జీ ఏజెన్సీ) పరిధిలోకి తీసుకువస్తుంది. దీనికి ప్రతిఫలంగా భారతదేశానికి పౌర అణు వ్యవహారాల్లో అమెరికా తన సహకారాన్ని అందిస్తుంది.[1]

భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో కరచాలనం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్

కారణాలు మార్చు

అణ్వాయుధాల వ్యాప్తి నిరోధం మార్చు

ఈ ఒప్పందానికి అంగీకరించడం ద్వారా భారత్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ (NPT) మీద సంతకం చేయకపోయినా అణ్వాయుధాల వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్నట్లే భావించబడుతుంది. భారత్ తో ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి భారత్ చేస్తున్న కృషిని అమెరికా ప్రపంచ దేశాలకు చాటి చెబుతుంది.

ఆర్థిక కారణాలు మార్చు

దీని ద్వారా భారత్ లో ఆర్థికంగా వృద్ధి చెందగలదని అమెరికా భావిస్తోంది.

వ్యుహాత్మక కారణాలు మార్చు

భారత్-పాకిస్తాన్ దేశాలతో సంబంధాలలో ఒకే విధానం పాటించకుండా రెండు ప్రత్యేక విధానాలు పాటించడం వల్ల అమెరికా ప్రయోజనం పొందాలని భావిస్తోంది. భారత్ కు దీటుగా ఎదుగుతున్న చైనాను కట్టడి చేయాలంటే ఇలా భారతో సంబంధాలు నెలకొల్పుకోవడం అమెరికాకు అవసరం.

భారతదేశంలో రాజకీయ వ్యతిరేకత మార్చు

భారత్ అమెరికా పౌర అణు ఒప్పందాన్ని భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు గట్టిగా వ్యతిరేకించాయి. ప్రధాన పార్టీలైన భారత జాతీయ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, రాష్ట్రీయ జనతా దళ్ మొదలైన పార్టీలు దీన్ని సమర్థించినా కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లాంటి కొన్ని వ్యతిరేకత తెలుపడంతో దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వానికి కష్టాలు తప్పలేదు. నవంబరు 2007 న కొందరు మాజీ సైన్య ప్రధానాధికారులు, ప్రభుత్వాధికారులు, శాస్త్రజ్ఞులు పార్లమెంటు సభ్యులకు అణు ఒప్పందానికి మద్దతు పలుకుతూ ఒక లేఖ రాశారు.[2]

మూలాలు మార్చు

  1. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, భారత ప్రధాని సంయుక్త ప్రకటన, వైట్‌హౌస్ వార్త 2005
  2. "IndianExpress.com :: 'The question is can we get a better n-deal? No&#x2019". Retrieved 2008-07-11.