యనమల రామకృష్ణుడు

రాజకీయ నాయకుడు

యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. చంద్రబాబు నేతృత్వంలో 2014 లో ఏర్పడిన మంత్రి మండలిలో ఇతను స్థానం సంపాదించాడు. శాసనమండలి సభ్యునిగానే ఇతను మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. సమైక్యాంధ్రప్రదేశ్ శాసనమండలిలో విభజన జరిగే వరకు ప్రధాన ప్రతిపక్ష (టీడీపీ) నాయకుడిగా కొనసాగారు. ఇతను టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2009లో ఓటమి చెందిన ఇతను 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్‌గా, అధికారంలో లేనప్పుడు పీఏసీ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు. 1983లో తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలో న్యాయ, పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించాడు. 1985-89 మధ్య మంత్రిగా, 1989-94లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా, 1995-99లో శాసనసభ స్పీకర్‌గా కొనసాగాడు. ఎన్టీఆర్‌ను దించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈయనే స్పీకర్. 1999-2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2004-08 మధ్య కాలంలో తిరిగి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు.

యనమల రామకృష్ణుడు
యనమల రామకృష్ణుడు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్యపన్నుల, శాసనవ్యవహారాల మంత్రి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం జూబ్లీ హిల్స్ హైదరాబాదు, భారతదేశం

వ్యక్తిగత వివరాలు మార్చు

యనమల రామకృష్ణుడు తూర్పు గోదావరి జిల్లా, తొండంగి మండలం, ఎ. వి. నగరం గ్రామ వాసి. తండ్రి అప్పారావు. 1950 లో జన్మించాడు. ఇతను ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. భార్య పేరు విజయలక్ష్మి.[1]

మూలాలు మార్చు

  1. "యనమల రామకృష్ణుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన పత్రం" (PDF). ceotelangana.nic.in.{{cite web}}: CS1 maint: url-status (link)