సాంబుడు శ్రీకృష్ణునికి జాంబవతి వలన కలిగిన మొదటి పుత్రుడు.

దస్త్రం:Prince Samba battling with Kshemadarsi.jpg
యువరాజు సాంబ క్షేమదర్శితో పోరాడుతున్నాడు


సాంబుని గురించి మహాభాగవతంలో రెండు ముఖ్య కథలు ఉన్నాయి. ఒకటి దుర్యోధనుడు సాంబుని బంధించడం, బలరాముడు వచ్చి దుర్యోధనునితో మాట్లాడడం, దుర్యోధనుడు దానికి అంగీకరించకపోవడం. అప్పుడు బలరాముడు హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగరం మధ్య వరకు నిలిపి నగరాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే, భూకంపం వచ్చింది. కురువృద్ధులతో దుర్యోధనుడు వచ్చి బలరాముని వేడుకొనగా, బలరాముడు శాంతించి నాగలిని ప్రక్కకు తీసేస్తాడు. ఆ తరువాత దుర్యోధనుడు తన కూతురు లక్ష్మణను సాంబునికిచ్చి వివాహం జరిపిస్తాడు.


ఇంకోసారి దుర్వాసుడు బృందావనానికి వస్తాడు. యాదవులు పరిహాసానికి సాంబునికి ఆడ వేషం వేసి, దుర్వాసుని వద్దకు వెళ్ళారు. సాంబుడుకి అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా అని దుర్వాసుని అడిగారు. కోపించిన ఆ మహర్షి సాంబుడి ఉదరంలో ముసలం పుట్టుతుంది, సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్క్రమిస్తారు. ఇది యాదవవంశం అంతరించడానికి కారణం అయ్యింది.

"https://te.wikipedia.org/w/index.php?title=సాంబుడు&oldid=3597744" నుండి వెలికితీశారు