ప్రహ్లాద్ జోషి

భారత రాజకీయ నాయకుడు
02:56, 18 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

ప్రహ్లాద్ వెంకటేష్ జోషి( జననం 1962 నవంబర్ 27) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుత కేంద్ర బొగ్గు, గనులు ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 2004 నుండి ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. 2019 మే 30 వ తారీఖున కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

తొలినాళ్ళ జీవితం

జోషి 1962 నవంబర్ 27న అప్పటి బీజాపూర్ జిల్లాలో జన్మించాడు, ప్రస్తుతం బీజాపూర్ కర్ణాటక రాష్ట్రంలో భాగంగా ఉంది. 

రాజకీయ జీవితం

ప్రహ్లాద్ జోషి 1992  నుండి 1994 రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడిగా ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బొబ్బిలి పట్టణంలో జరిగిన సమావేశంలో ప్రజల దృష్టికి వచ్చాడు.  ధార్వాడ్  లోక్సభ నియోజకవర్గం నుండి  2004, 2009, 2014 అలాగే 2019 ఎన్నికల్లో విజయం సాధించాడు.

2014 నుండి 2016 వరకు కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.