స్టాన్ స్వామి

14:28, 3 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

స్టాన్సిస్ లౌర్దుస్వామి (1937 ఏప్రిల్ 26- 2021 జులై 5) స్టాన్ స్వామిగా జనాదరణ పొందిన ఇతను భారతదేశానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త, రోమన్ కాథలిక్ పూజారి.

తొలినాళ్ళ జీవితం

స్వామి తమిళనాడు లోని తిరుచి జిల్లాలో 1937 ఏప్రిల్ 26న జన్మించాడు. 1970 లో ఫిలిపైన్స్ లో సమాజశాస్త్రం(sociology) చదివే సమయంలో ఇతను వేదాంత శాస్త్రం (theology) పై పట్టు సాధించాడు. తాను ఫిలిపైన్స్ లో చదువుకునే రోజుల్లో అక్కడ పరిపాలన పై జరిగే విప్లవాలను అవగాహన చేసుకున్నాడు.