అవని లేఖరా
అవని లేఖరా(జననం 2001 నవంబర్ 8) భారతదేశానికి చెందిన పారాలింపియన్, రైఫిల్ షూటింగ్ క్రీడాకారిణి. 2020 టోక్యో పారాలింపిక్స్ 10 మీటర్ల షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. లేఖరా 2020 నాటికి షూటింగ్ క్రీడలో ప్రపంచంలోనే మొదటి అయిదు స్థానాల్లో గల ఉత్తమ క్రీడాకారిణి. 2018 పారాలింపిక్స్ లో కూడా పాల్గొన్నది.