సి.కేశవన్
భారతీయ రాజకీయవేత్త
సి.కేశవన్(ఆంగ్లం:C. Kesavan :- 1891 మే 23- 1969 జులై 7) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త. 1950 నుండి 1952 వరకు ట్రావెంకోరే-కొచ్చిన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించాడు.
తొలినాళ్ళలో
కేశవన్ 1891లో ట్రావెన్కోర్ రాష్ట్రంలోని మయ్యనాడ్ గ్రామంలో జన్మించాడు. తిరువనంతపురంలోని ఒక కళాశాలలో న్యాయవిద్యను పూర్తి చేసి లాయరుగా వృత్తిని ప్రారంభించాడు. పద్మనాభన్ పాల్పు అనే సంఘ సంస్కర్త వ్యక్తిత్వంచే ప్రేరణ పొందిన కేశవన్ ఆటను స్థాపించిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే దళంలో చేరాడు. ఎజ్హ్వా అనే వెనుకబడిన సామాజిక వర్గం అభివృద్ధికై వివిధ కార్యక్రమాలు చేపట్టాడు. కేశవన్ ఒక నాస్తికుడు, 1930లో హిందూ మతాన్ని పరిత్యజించాలని పిలుపునిచ్చాడు.