ప్రధానకార్యాలయం

పరిపాలనసాగించే ప్రాంతం

పరిపాలనా సాగించే కార్యాలయం ప్రధాన కార్యాలయం అని అంటారు. దీనిని ప్రధాన కేంద్రం అని కూడా వ్యవహరిస్తారు. ప్రాంతీయ పరిపాలన లేదా స్థానిక ప్రభుత్వం, జిల్లా పరిపాలన, రాష్ట పరిపాలన, దేశపరిపాలన, లేదా ఇతర సంస్థల నిర్వహణ ఎక్కడనుండైతే నిర్వహిస్తారో, లేదా సాగిస్తారో ఆ ప్రదేశాన్ని పరిపాలనా కేంద్రం లేదా ప్రధాన కార్యాలయం అని అంటారు.[1]ఇది ఒక్క ప్రభుత్వాల విషయంలోనే కాదు, అన్ని రకాల ప్రభుత్వరంగ, ప్రవేటురంగ సంస్థల అన్నిటికి వర్తిస్తుంది. సహజంగా ప్రభుత్వాల విషయంలో స్థానిక ప్రభుత్వ పరిపాలనకు అనగా గ్రామ పంచాయితీ, మండల పరిషత్తులకు గ్రామాలు, లేదా ఒకరకమైన పట్టణాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి.జిల్లా పరిపాలన నిర్వహించే జిల్లా కలెక్టరు, ఇతర జిల్లా కార్యాలయాలు పట్టణాలు, నగరాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి. రాష్టాలకు నగరపాలక సంస్థ, మహా నగరపాలక సంస్థ హోదాతోఉన్న పెద్ద నగరాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి. క్లుప్తంగా దీనికి నిర్వచనం చెప్పాలంటే, పరిపాలనకు సంబందించిన అన్ని శాఖల కార్యాలయాలు ఉన్న ప్రదేశాన్నిపరిపాలనా కేంద్రం అని నిర్వచిస్తారు. ఇంకో సందర్బంలో వీటిని ప్రధాన కార్యాలయం లేదా హెడ్‌క్వార్టర్ అని వ్యవహరిస్తారు.రాష్ట్ర, దేశపరిపాలన సాగించే ప్రాంతాన్ని రాజధాని అని అంటారు. వీటికి చట్టంలో వెసులుబాటు ఉంటుంది.

టిక్కురిల పట్టణపు పరిపాలనా కేంద్రం

నిర్వచనంసవరించు

పరిపాలనా కేంద్రం: ప్రాంతీయ పరిపాలన లేదా స్థానిక ప్రభుత్వం, లేదా కౌంటీ పట్టణం లేదా కమ్యూన్ కేంద్ర పరిపాలనలో ఉన్న ప్రదేశం. రష్యాలో, ఈ పదం వివిధ స్థాయిల ప్రభుత్వ సంస్థల స్థానంగా పనిచేసే జనావాస ప్రాంతాలకు వర్తించబడుతుంది. ఈ నియమానికి మినహాయింపు రిపబ్లిక్లు. దీని కోసం "మూలధనం" అనే పదాన్ని ప్రభుత్వ స్థానాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. రష్యా రాజధాని "పరిపాలనా కేంద్రం" అనే పదం వర్తించని ఒక సంస్థ. ఇదే విధమైన అమరిక ఉక్రెయిన్‌లో ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇది ఒక స్థానిక అధికారక కేంద్రం.ఇది చారిత్రాత్మక కౌంటీ నుండి కౌంటీ పట్టణంతో విభిన్నంగా ఉంటుంది.[2]

మూలాలుసవరించు

  1. "చరిత్ర | పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం | India". Retrieved 2021-02-26.
  2. "What does administrative centre mean?". www.definitions.net. Retrieved 2021-02-24.

వెలుపలి లంకెలుసవరించు