ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ప్రతి సంవత్సరం అక్టోబరు 16న నిర్వహించబడుతుంది

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 16న నిర్వహించబడుతుంది. తొలిసారిగా అనస్థీషియా (మత్తుమందు) ఇచ్చి శస్త్రచికిత్స చేసిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం
జరుపుకొనే రోజు16 అక్టోబరు
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

చరిత్ర మార్చు

పూర్వకాలంలో శస్త్ర చికిత్స చేయించుకునే రోగికి చాలా నొప్పి ఉండేది. వైద్యులు, నర్సులు కాకుండా వేరే పదిమంది మనుషులు గట్టిగా పట్టుకుంటే శస్త్రచికిత్స చేసేవారు. 1846, అక్టోబరు 16న అమెరికాలోని మసాచుసెట్స్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో విలియమ్స్‌ థామస్‌ గ్రీన్‌ మార్టన్‌ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్‌కొలిన్స్‌తో కలిసి గిల్బర్ట్‌ అంబార్టు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు తొలిసారిగా ఈథర్‌ మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.[1]

ప్రయోజనం మార్చు

 
అనస్థీషియాతో ఉన్న వ్యక్తి

అనస్థీషియా వ్యక్తులకు జరిపే వివిధ శస్త్రచికిత్సల సమయంలో బాధ, నొప్పిని రోగ బాధితులకు ఎలాంటి నొప్పి లేకుండా  ఉండటానికి మత్తుమందులు  వాడకాన్ని సూచిస్తుంది. మత్తుమందులు ప్రక్రియ (శస్త్రచికిత్స) జరిగిన ప్రదేశంలో రోగుల  నరాల నుండి మెదడులోని కేంద్రాలకు ఇంద్రియ సంకేతాలను తాత్కాలికంగా నిరోధిస్తాయి. రోగులకు శస్త్రచికిత్స జరిగే సమయంలో మత్తు మందులు శరీరంలోని కొన్ని భాగాలను తిమ్మిరి గా ప్రభావం చేస్తాయి, ఇతర మత్తుమందులు మెదడును తిమ్మిరి చేస్తాయి. కొన్ని మందులు అనస్థీషియాతో సంకర్షణ చెందుతాయి లేదా సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. శస్త్ర చికిత్స జరిగే వ్యక్తులకు  ఆసుపత్రికి వెళ్ళే ముందు ఎనిమిది గంటలు ఆహారం, పానీయాల ఇవ్వ కూడదు. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక రోజు  ధూమపానం మానివేయాలి, కొందరికి  రెండు వారాల ముందు ధూమపానం మానేయమని వైద్యులు సూచిస్తారు. వైద్యుల అవసరం అనుకుంటే  రక్తపోటు మందులను కొంత సమయం వరకు (కొన్ని  మందులను) ఆపమని చెపుతారు[2].

లక్ష్యం మార్చు

సదస్సులు, సమావేశాలు, కార్యశాలలు నిర్వహించి ప్రజలు, విద్యార్థులు, వైద్యరంగంలో ఉన్నవారికి అనస్థీషియా గురించి అవగాహన కలిగించడం.

కార్యక్రమాలు మార్చు

  1. 2015, అక్టోబరు 16న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరంలోని ఫోర్ట్ సిటీ పారశాలలో అనస్థీషియాపై అవగాహన కార్యక్రమం జరిగింది.[3]
  2. 2019, అక్టోబరు 16న కర్నూలు సర్వజన వైద్యశాలలోని పాత సీఎల్జీలో వైద్య విజ్ఞన సదస్సు నిర్వహించబడింది.[4]

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి, జిల్లా (16 October 2019). "ఆయువు పోసే అనస్థీషియా". చంద్రమౌళి. Archived from the original on 16 October 2019. Retrieved 16 October 2019.
  2. "Anesthesia: Types & What You Should Know". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-11-17.
  3. వైద్యరంగంలో కీలకపాత్ర వహిస్తున్న అనస్థీషియా, విశాలాంధ్ర, ఉత్తరాంధ్ర, 17 అక్టోబరు 2015, పుట. 8
  4. ఈనాడు, కర్నూలు (16 October 2019). "ఏటా 30 వేల శస్త్రచికిత్సలు". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 16 October 2019. Retrieved 16 October 2019.