ప్రపంచ తాబేలు దినోత్సవం
ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.
ప్రపంచ తాబేలు దినోత్సవం (ఆంగ్లం: World Turtle Day) ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తాబేళ్ళ మనుగడపై మానవ దృష్టి సారించడానికి, వాటిని సంరక్షించేలా ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1][2][3]
ప్రపంచ తాబేలు దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | అమెరికన్ తాబేలు రెస్క్యూ |
ప్రారంభం | 2000 |
జరుపుకొనే రోజు | మే 23 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
చరిత్ర
మార్చు1990లో అమెరికా లోని అమెరికన్ తాబేలు రెస్క్యూ అనే సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2000లో మిస్ ఇ. రస్సెల్ ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రారంభించాడు.[4]
కాలిఫోర్నియాలోని మాలిబుకు చెందిన సుసాన్ టెల్లెం వరల్డ్ టర్త్లి డే (ప్రపంచ తాబేలు దినోత్సవం) అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేశాడు.[5]
జంతువుల వేడుకలకు సంబంధించిన చేజ్ అనే పుస్తకంలో ఈ దినోత్సవం గురించి ప్రస్తావించబడింది.[6]
కార్యక్రమాలు
మార్చుఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు.
- తాబేళ్ళు, తాబేళ్ళ బొమ్మలను చాలామంది ఒకరికొకరు ఇచ్చుకుంటారు.
- తాబేళ్ళ వంటి దుస్తులు లేదా ఆకుపచ్చ వేసవి దుస్తులు ధరించి వీధులలో ప్రచారం చేయడం.
- రహదారులపై చిక్కుకున్న తాబేళ్ళను కాపాడడం.
- తాబేళ్ళకు సంబంధించిన పరిశోధనలు జరపడం.
- పాఠశాలల్లో విద్యార్థులకు తాబేళ్ళ గురించి బోధించడం.[7]
- 2013లో 5,500 మంది విద్యార్థులకు భోదించడానికి తాబేలు దినోత్సవ బోధన సామగ్రిని పంపించారు.
మూలాలు
మార్చు- ↑ "Be Kind to Turtles, World Turtle Day is May 23". WorldTurtleDay.org. Archived from the original on 29 ఆగస్టు 2016. Retrieved 23 May 2020.
- ↑ "Celebrate World Turtle Day". Archived from the original on 15 ఫిబ్రవరి 2009. Retrieved 23 May 2020.
- ↑ Wendy Heller (13 May 2008). "American Tortoise Rescue Celebrates World Turtle Day May 23rd". Archived from the original on 4 జూలై 2008. Retrieved 23 May 2020.
- ↑ "American Tortoise Rescue Celebrates World Turtle Day May 23rd". Health News Digest. 13 May 2008. Archived from the original on 27 మే 2009. Retrieved 23 మే 2020.
- ↑ "USPTO trademark #4635425".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-08. Retrieved 2020-05-23.
- ↑ "How to Celebrate World Turtle Day?". Bee Bulletin.