ప్రపంచ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం

ప్రపంచ నత్తి నివారణ అవగాహనా దినోత్సవంను ప్రతి సంవత్సరం అక్టోబరు 22న జరుపుకుంటారు. 1998, అక్టోబరు 22న 'ఇంటర్నేషనల్‌ ఫ్లూయెన్సీ అసోసియేషన్‌', 'ఇంటర్నేషనల్‌ స్టట్టెరింగ్‌ అసోసియేషన్‌', యూరోపియన్‌ లీగ్‌ ఆఫ్‌ స్టట్టెరింగ్‌ అసోసియేషన్‌' సంస్థలు సమావేశమై నత్తిపై ప్రజలకు అవగాహన కలిగించటం ద్వారా దానిని నివారించవచ్చని ఒక నిర్ధరణకు వచ్చాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం అక్టోబరు 22న అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పలు దేశాలు, సంస్థలు "నత్తి" నివారణ పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ప్రపంచ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం చిహ్నం

నత్తి

మార్చు

నత్తి అనగా అసంకల్పిత పునరుక్తుల ద్వారా ప్రసంగ ప్రవహమునకు విఘాతం కలిగించే ప్రసంగ లోపం, దీనిలో శబ్దాలు, పదాంశాలు, పదాలు లేదా పదబంధాల యొక్క పొడిగింపు అలాగే అసంకల్పిత నిశ్శబ్ద అంతరాయాలు లేదా నిరోధాలు ఉంటాయి, అందువలన నత్తి ఉన్న వ్యక్తి ధ్వనులను స్పష్టంగా పలకడం సాధ్యం కాదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు మాటలు తడబడటం లేదా ముద్ద ముద్దగా మాట్లాడటం, కొన్ని అక్షరాలు సరిగా పలక లేకపోవడం జరుగుతుంటుంది, ఈ విధంగా తరచుగా జరుగుతున్నట్లయితే వారికి నత్తి ఉందని అర్థం.

మూలాలు

మార్చు
  • సాక్షి దినపత్రిక - 22-10-2014 (సందర్భం: నేడు ప్రపంచ నత్తి అవగాహన దినోత్సవం - నత్తి ఎందుకు వస్తుంది?)