తెలుగు పదాలు

(పదాలు నుండి దారిమార్పు చెందింది)

పదము అనగా అక్షర కూర్పు

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ తెలుగు అక్షరమాల వృక్షం (అమృత కల్పవృక్షం)

పదాలలో రకాలుసవరించు

వ్యుత్పత్తి పరంగా తెలుగు భాషలో పదాలు నాలుగు రకాలు. అవి:

 1. తత్సమము : ప్రాకృత (సంస్కృత) పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అనికూడా అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము
 2. తద్భవము : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అనికూడా అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
 3. దేశ్యము : తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు
 4. అన్యదేశ్యము : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.

భాషాభాగాలుసవరించు

తెలుగు భాషలోని పదములను ఐదు భాగములుగా విభజించవచ్చును. అవి -

సర్వులకు (అందరికీ) వర్తించే నామము సర్వనామము. ఉదా: నీవు, ఆమె, అతడు.

 • విశేషణములు: నామవాచకము, సర్వనామముల యొక్క గుణములను తెలియజేయునది. ఉదా: పొడవైన, ఎరుపు, తీపి.
 • అవ్యయములు: లింగ, వచన, విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఉదా: ఆహా! ఓహో! ఔరా! అకటా!
 • క్రియలు: పనులను తెలిపే వానిని క్రియలు అంటారు. ఉదా: చదువుట, తినుట, ఆడుట.
  • సకర్మక క్రియలు: కర్మను ఆధారముగా చేసికొనియున్న క్రియలను సకర్మక క్రియలు అంటారు. ఉదా: మధు బడికి వెళ్ళెను.
  • అకర్మక క్రియలు: కర్మ లేకపోయినను వాక్యము అర్థవంతమైనచో అవి అకర్మక క్రియలు. ఉదా: సోముడు పరుగెత్తెను.
  • సమాపక క్రియలు: పూర్తి అయిన పనిని తెలియజేయు క్రియలు సమాపక క్రియలు. ఉదా: తినెను, నడచెను.
  • అసమాపక క్రియలు: పూర్తికాని పనిని తెలియజేయు క్రియలు అసమపక క్రియలు. ఉదా: వ్రాసి, తిని.

వర్ణముసవరించు

ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయ పదాలంటారు. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.

 • తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు
 • తరువు = చెట్టు, వృక్షము, మహీరుహము
 • జలధి = కడలి, అర్ణవము
 • పర్వం = పబ్బం, పండుగ, వేడుక
 • శత్రువు = వైరి, రిపు, విరోధి
 • ఆంజనేయుడు = పవనసుతుడు, మారుతి, హనుమంతుడు
 • నిజము = సత్యము, నిక్కము
 • తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
 • స్త్రీ = వనిత, మహిళ, పడతి
 • జైలు = బందీఖాన, కారాగారము

నానార్థాలు charanamuluసవరించు

పదం ఒకటే ఉండి అనేక అర్థాలు ఉండేదాన్ని నానార్థాలు అని అంటారు. పదం ఒకటే - అర్థాలు మాత్రం విడివిడిగా అనేకం ఉంటాయి.

 • క్రియ : పని, చేష్ట, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తము, చికిత్స
 • లావు : బలము, సమర్థత, గొప్పతనము
 • పృథ్వి : భూమి, విరియునది, ఇంగువచెట్టు, సముద్రతీరము
 • బంధం : ముడి, కలయిక, కట్టివేత

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

ఉపయుక్త గ్రంథాలుసవరించు

 • తెలుగు వ్యాకరణము : వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.