ప్రపంచ నవ్వుల దినోత్సవం
ప్రపంచ నవ్వుల దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం నిర్వహించబడుతుంది.[1] నవ్వు ద్వారా సోదరత్వం, స్నేహం విషయంలో ప్రపంచ చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవం ఉద్దేశించబడింది.[2]
ప్రపంచ నవ్వుల దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | మే నెల మొదటి ఆదివారం |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదేరోజు |
చరిత్ర
మార్చుప్రపంచ నవ్వుల దినోత్సవం మొదటిసారిగా 1998, జనవరి 10న భారతదేశంలోని ముంబైలో జరిగింది.[3] ప్రపంచవ్యాప్తంగా నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించిన డాక్టర్ మదన్ కటారియా ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేశాడు. మొదట జనవరి రెండవ ఆదివారం జరుపుకునే వారు. జనవరిలో చలి ఎక్కువగా ఉంటుందన్న హాస్య ప్రియులు కోరిక మేరకు లాఫ్టర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దీన్ని మే మొదటి ఆదివారం జరుపుతూ వచ్చింది. అలా మే నెల మొదటి ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు.[3][2]
వ్యక్తులు తమను తాము మార్చుకోవటానికీ, ప్రపంచాన్ని శాంతియుతంగా, సానుకూలంగా మార్చడానికి అవసరమైన శక్తివంతమైన భావోద్వేగం నవ్వు ఒక్కటే. నవ్వు అనేది ఒక వ్యక్తి యొక్క ముఖ కవళికలపై, వారి భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయన్న ఉద్దేశ్యంతో మదన్ కటారియా నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించాడు.[3][4]
కార్యక్రమాలు
మార్చుబహిరంగ ప్రదేశాల్లో ప్రజల సమావేశాలు ఏర్పాటుచేసుకొని నవ్వడమే ఏకైక లక్ష్యంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.[3] నవ్వుల యోగా ఉద్యమం వల్ల 105కి పైగా దేశాలలో వేలాది లాఫ్టర్ క్లబ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు అంతర్జాతీయ నవ్వుల పద్ధతులను నేర్చుకోవడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కమ్యూనిటీ సమూహాలలో చేరమని ప్రోత్సహిస్తున్నారు.[5]
ఇతర వివరాలు
మార్చు- 1998, జనవరి 11న ముంబాయిలో నిర్వహించిన మొదటి నవ్వుల దినోత్సవానికి 15వేలమంది హాజరయ్యారు.
- విదేశాల్లో 2000, జనవరి 9న మొదటిసారిగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హగన్‌లో నిర్వహించబడింది. సుమారు 25వేలమంది పాల్గొన్న ఈ ఉత్సవం గిన్నీస్ ప్రపంచ రికార్డులులో నమోదయింది.
- 2004, మే 2న స్విట్జర్లాండ్ రాజధాని నగరంలో ఈ ఉత్సవంలో ఆ దేశ పార్లమెంటు చుట్టూ నవ్వుతూ ప్రదక్షిణ చేశారు.[6]
మూలాలు
మార్చు- ↑ "Harborview to mark World Laughter Day". Seattle Post-Intelligencer. 1 May 2009. Archived from the original on 12 జూలై 2012. Retrieved 3 May 2020.
- ↑ 2.0 2.1 Ritman, Alex (6 May 2012). "It's World Laughter Day". The National. Retrieved 3 May 2020.
- ↑ 3.0 3.1 3.2 3.3 Nerenberg, Albert. "World Laughter Day: How a Laughing Fit Sparked an International Movement". Huffingtonpost.com. Retrieved 3 May 2020.
- ↑ Grinnell, Renee. "Facial Feedback Hypothesis". psychcentral.com. Archived from the original on 11 జనవరి 2016. Retrieved 3 May 2020.
- ↑ Atul (3 May 2020). "World Laughter Day Celebrated by World with Covid-19 | Latest News". News - Breaking News, Latest News & Top Video News| Letmethink.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 3 May 2020.
- ↑ నవ తెలంగాణ, స్టోరీ (6 May 2017). "-నవ్వుదాం... నవ్విద్దాం..." m.navatelangana.com. కె. సతీష్‌రెడ్డి. Archived from the original on 3 May 2020. Retrieved 3 May 2020.
ఇతర లంకెలు
మార్చు- ప్రపంచ నవ్వుల దినోత్సవం అధికారిక వెబ్సైట్ Archived 2020-08-10 at the Wayback Machine
- LaughterYoga.org page Archived 2020-05-12 at the Wayback Machine