ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (ఆంగ్లం: World Environment Day)ను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు.[1] పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా నడపబడుతుంది.[2] ఈ రోజున మానవ పర్యావరణం పై ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభించింది. 1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన వేర్వేరు నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ వైభవంగా జరుపుకుంటున్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
అధికారిక పేరుఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవం
యితర పేర్లుఏకో డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం (WED)
రకంఅంతర్జాతీయ
ప్రాముఖ్యతపర్యావరణ పరిరక్షణ అవగాహన
జరుపుకొనే రోజుజూన్ 5
వేడుకలుపర్యావరణ పరిరక్షణ

గోల్డెన్ వార్షికోత్సవం మార్చు

2022 జూన్ 5తో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంబరాలకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. తొలిసారిగా స్వీడన్‌ లో 1972వ సంవత్సరం ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సు లో వాతావరణ మార్పులను గమనిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. 1973 నుంచి జూన్‌ 5న ప్రతియేటా ప్రపంచ పర్యావరణ దినం విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూవస్తోంది. ఈసారి ‘ఓన్లీ వన్‌ ఎర్త్‌’ థీమ్‌తో పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. గ్రీన్‌ లైఫ్‌ స్టైల్‌ను అలవర్చుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని స్వీడన్ నిర్వహిస్తోంది.[3]

మునుపటి సంఘటనలు మార్చు

ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు ఆతిధ్యమిచ్చిన నగరాలు:

ఇవి కూడా చూడండి మార్చు

ధరిత్రి దినోత్సవం

మూలాలు మార్చు

  1. "ఐక్యరాజ్య సమితి". యూ యెన్ అధికారిక.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Environment, U. N. (2019-04-12). "World Environment Day". World Environment Day (in ఇంగ్లీష్). Retrieved 2021-06-05.
  3. SY, Team (2022-06-04). "World Environment Day 2022 - Check Theme, Slogan, Host". Studiously Yours (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-04.