ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం
ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు రెండవ శనివారం రోజున నిర్వహించబడుతుంది. ప్రథమ చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.[1][2]
ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం | |
---|---|
తేదీ(లు) | సెప్టెంబరు నెల రెండవ శనివారం |
ఫ్రీక్వెన్సీ | వార్షికం |
ప్రదేశం | ప్రపంచవ్యాప్తంగా |
చరిత్ర
మార్చు2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్సి) ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 రెడ్‌క్రాస్ సొసైటీల ద్వారా ప్రథమ చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.[3]
కార్యక్రమాలు
మార్చు- ప్రమాదాలు సంభవించినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి విద్యార్థులకు తెలియజేయడంతోపాటు పాము కాటు, నీట మునగడం, అగ్నిప్రమాదం, మూర్చ, వడదెబ్బ లకు ప్రథమ చికిత్స ఎలా చేయాలో దృశ్యంగా చూపించడం.
- ప్రథమ చికిత్స ప్రాముఖ్యతను తెలుపుతూ విద్యార్థులతో ప్రథమ చికిత్స ప్రతిజ్ఞ చేయించడం[4]
మూలాలు
మార్చు- ↑ ప్రజాశక్తి, గుడివాడ (8 September 2017). "ప్రతి ఒక్కరికి ప్రధమ చికిత్స అవసరం". www.prajasakti.com. Archived from the original on 17 సెప్టెంబరు 2019. Retrieved 17 September 2019.
- ↑ https://globaldimension.org.uk/event/world-first-aid-day/2018-09-08/ World First Aid Day
- ↑ ప్రజాశక్తి, ఏలూరు అర్బన్ (8 September 2017). "ప్రాణాపాయం.. ప్రథమ చికిత్సే తరుణోపాయం". www.prajasakti.com. Archived from the original on 17 సెప్టెంబరు 2019. Retrieved 17 September 2019.
- ↑ ప్రజాశక్తి, రాజంపేట టౌన్ (13 September 2015). "ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం". www.prajasakti.com. Archived from the original on 14 సెప్టెంబరు 2019. Retrieved 14 September 2019.