ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు.[1] మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా, 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. 2012లో, మలేరియా వలన 6,27,000 మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువగా ఆఫ్రికన్ పిల్లలు ఉన్నారు.

ప్రపంచ మలేరియా దినోత్సవం
ప్రపంచ మలేరియా దినోత్సవం
జరుపుకొనేవారుప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులు
జరుపుకొనే రోజుఏప్రిల్ 25
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

చరిత్రసవరించు

2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలన్ని కలిసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటుచేశాయి. ఈ దినాన్ని ప్రతిసంవత్సరం ఏప్రిల్ 25 జరుపుకుంటారు.

ఇతర వివరాలుసవరించు

ప్రపంచ దేశాలన్నింటిలో నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, బుర్కినా ఫాసో, సియర్రా లియోన్ వంటి ఐదు దేశాలు ఎక్కువగా మలేరియా వ్యాధి బారినపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. తాజాగా 2015లో ప్రపంచవ్యాప్తంగా 429,000 మలేరియా మరణాలు, 212 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి. 2010, 2015 మధ్యకాలంలో కొత్త మలేరియా కేసుల రేటు ప్రపంచవ్యాప్తంగా 21 శాతం పడిపోవడమేకాకుండా మలేరియా మరణాల రేటు 29 శాతానికి తగ్గింది.

కేంద్ర పురస్కారంసవరించు

మలేరియా నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మెచ్చి కేద్రం పురస్కారం ప్రకటించింది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా 2022 ఏప్రిల్ 25న ఢిల్లీలో ఈ పురష్కార ప్రధానోత్సవం జరగనుంది.[2]

మూలాలుసవరించు

  1. జాగరణ్ జోష్. "ఏప్రిల్ 25; ప్రపంచ మలేరియా దినోత్సవం". www.jagranjosh.com. Archived from the original on 25 April 2018. Retrieved 25 April 2018.
  2. "World Malaria Day: మలేరియా నివారణ చర్యల్లో ఏపీ భేష్... కేంద్రం నుంచి పురస్కారం..." Zee News Telugu. 2022-04-25. Retrieved 2022-04-25.