ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, ప్రతి సంవత్సరం అక్టోబరు 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.[1][2] మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. 150కిపైగా దేశాలకు చెందిన సభ్యులున్న ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో దీనిని మొదటిసారిగా 1992లో జరుపుకున్నారు.[3] మానసిక అనారోగ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై చూపించే ప్రభావాలను దృష్టికి తీసుకురావడానికి వేలాదిమంది స్వచ్ఛంద కార్యకర్తలు ఈ వార్షిక అవగాహన కార్యక్రమాన్ని జరుపుకుంటారు.[4]

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
2014లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని సాలెంలో జరిగిన ర్యాలీ
జరుపుకొనేవారుప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య సభ్య దేశాలు
జరుపుకొనే రోజుఅక్టోబరు 10
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు
జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (2015)

చరిత్ర

మార్చు

1992, అక్టోబరు 10న డిప్యూటీ సెక్రటరీ జనరల్ రిచర్డ్ హంటర్ సహకారంతో తొలిసారిగా ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపబడింది. 1994వ సంవత్సరం వరకు మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడం మినహా ఈ రోజుకు ప్రత్యేకత ఏమిలేదు.

అప్పటి మానసిక కార్యదర్శి యూజీన్ బ్రాడీ సూచన మేరకు 1994లో తొలిసారిగా "ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం"[5] అనే నేపథ్యంతో ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ప్రపంచ దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, పౌర సమాజ సంస్థలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ నిర్వాహణకు సహకారం లభిస్తోంది. సాంకేతిక, ప్రచార సామగ్రిని అభివృద్ధి చేయడానికి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు ఇస్తోంది.[6]

నేపథ్యాలు

మార్చు
సంవత్సరం నేపథ్యాలు [7][8]
2023 మానసిక ఆరోగ్యం అనేది సార్వత్రిక మానవ హక్కు [9]
2022 అందరి మానసిక ఆరోగ్యం, స్వస్థతకు ప్రపంచ ప్రాధాన్యత కల్పించడం[10]
2021 అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం
2020 మానసిక ఆరోగ్యం కోసం తరలించండి: మానసిక ఆరోగ్యంలో పెరిగిన పెట్టుబడి[11]
2019 మానసిక ఆరోగ్య ప్రచారం - ఆత్మహత్యల నివారణ
2018 మారుతున్న ప్రపంచంలో యువకులు, మానసిక ఆరోగ్యం
2017 పనిస్థానాల్లో మానసిక ఆరోగ్యం
2016 మానసిక ప్రథమ చికిత్స
2015 మానసిక ఆరోగ్యంలో గౌరవం
2014 స్కిజోఫ్రెనియాతో నివసిస్తున్నవారు
2013 మానసిక ఆరోగ్యం - పెద్దలు
2012 డిప్రెషన్: ఎ గ్లోబల్ క్రైసిస్
2011 గ్రేట్ పుష్: మానసిక ఆరోగ్యంలో పెట్టుబడి
2010 మానసిక ఆరోగ్యం - దీర్ఘకాలిక శారీరక అనారోగ్యాలు
2009 ప్రాథమిక సంరక్షణలో మానసిక ఆరోగ్యం: చికిత్సను మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం
2008 మానసిక ఆరోగ్యాన్ని ప్రపంచ ప్రాధాన్యతగా మార్చడం: చర్యల ద్వారా పౌరులకు సేవలను పెంచడం
2007 మారుతున్న ప్రపంచంలో మానసిక ఆరోగ్యం: సంస్కృతి, వైవిధ్యం యొక్క ప్రభావం
2006 అవగాహన పెంచడం - ప్రమాదాన్ని తగ్గించడం: మానసిక అనారోగ్యం & ఆత్మహత్య
2005 జీవిత కాలం అంతటా మానసిక, శారీరక ఆరోగ్యం
2004 శారీరక, మానసిక ఆరోగ్యం మధ్య సంబంధం: సహ-సంభవించే రుగ్మతలు
2003 పిల్లలు & కౌమారదశల భావోద్వేగ, ప్రవర్తనా లోపాలు
2002 పిల్లలు, కౌమారదశలో గాయం, హింస ప్రభావాలు
2000-01 మానసిక ఆరోగ్యం - పని
1999 మానసిక ఆరోగ్యం - వృద్ధాప్యం
1998 మానసిక ఆరోగ్యం - మానవ హక్కులు
1997 పిల్లలు - మానసిక ఆరోగ్యం
1996 మహిళలు - మానసిక ఆరోగ్యం

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (10 October 2020). "మానసిక ఆరోగ్య ప్రాపిరస్తు..!". Sakshi. Archived from the original on 10 October 2020. Retrieved 10 October 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (10 October 2019). "మానసిక ఆరోగ్యమే.. మహాభాగ్యం". www.andhrajyothy.com. Archived from the original on 10 October 2020. Retrieved 10 October 2020.
  3. Watson, Robert W. (2006). White House Studies Compendium, Volume 5. Nova Science Publishers. p. 69. ISBN 978-1-60021-542-1.
  4. "World Mental Health Day". Mental Health in Family Medicine. 7 (1): 59–60. 2010.
  5. "World Mental Health Day History". World Federation for Mental Health (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2020-10-10.
  6. "WHO | World Mental Health Day". WHO. Retrieved 2019-08-21.
  7. "WHO | Previous World Mental Health Days".
  8. "World Mental Health Day History - World Federation for Mental Health". World Federation for Mental Health (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2018-10-04.
  9. "World Mental Health Day 2023". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2023-10-10.
  10. "World Mental Health Day 2022". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2022-10-10.
  11. Lancet, The (2020-10-10). "Mental health: time to invest in quality". The Lancet (in English). 396 (10257): 1045. doi:10.1016/S0140-6736(20)32110-3. ISSN 0140-6736.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)

ఇతర లంకెలు

మార్చు