ప్రపంచ సముద్ర దినోత్సవం ప్రతి ఏట జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.[1]

ప్రపంచ సముద్ర దినోత్సవం
ప్రపంచ సముద్ర దినోత్సవం
సముద్రంలో సూర్యాస్తమయం
జరుపుకొనేవారుఐక్య రాజ్య సమితి సభ్యులు
జరుపుకొనే రోజుజూన్ 8
ఆవృత్తివార్షికం

ప్రారంభంసవరించు

1992లో బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని కెనడా ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని ఐరోపా దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.[2]

కార్యక్రమాలుసవరించు

  1. సముద్రంలో దొరికే వివిధ రకాల వస్తువుల సేకరణ, బీచ్‌ మరియు ఒడ్డును కాపాడుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌ను శుభ్రం చేయడం
  2. ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్కరూ సాగరశాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకోవడం
  3. సముద్రాలను కాపాడుకునే దిశగా ప్రపంచ దేశాలు తమ విధానాలు నిర్ణయించుకోవడం

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి, ప్రకాశం జిల్లా (8 June 2019). "సముద్ర కాలుష్యాన్ని నివారిద్దాం". మూలం నుండి 8 జూన్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 8 June 2019. Cite news requires |newspaper= (help)
  2. ప్రజాశక్తి, ఎడిటోరియల్ (7 June 2017). "మన సముద్రాలు : భవిష్యత్తు". మూలం నుండి 8 జూన్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 8 June 2019. Cite news requires |newspaper= (help)