దేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు
ఐక్య రాజ్య సమితిలో సభ్యులు (List of countries in the United Nations) ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. 2017 నాటికి ఐక్య రాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్య దేశమూ ఐ.రా.స. సాధారణ సభలో సభ్యత్వం కలిగి ఉంటుంది. ఐ.రా.స. చార్టర్ 2వ ఛాప్టర్ 4వ ఆర్టికిల్ ప్రకారం ఏదైనా దేశానికి ఐ.రా.స. సభ్యత్వం రావాలంటే ఐ.రా.స. భద్రతా సభ ఆమోదంపై, ఐ.రా.స. సాధారణ సభ తీర్మానం జరగాలి. [1]. నియమాల ప్రకారం సంపూర్ణ స్వాధిపత్యం ఉన్న దేశాలు మాత్రమే సభ్యత్వానికి అర్హత కలిగి ఉంటాయి. కాని ఐ.రా.స. ఏర్పాటు సమయంలో చేరిన నాలుగు ఆరంభ సభ్య దేశాలకు (బెలారస్, భారతదేశం, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్) అప్పటికి సంపూర్ణ స్వాతంత్ర్యం లేదు. అంతే కాకుండా భద్రతా సభ ఆమోదం ఉండాలన్న నిబంధన కారణంగా మాంటివిడియో కన్వెన్షన్ ప్రకారం స్వాధిపత్యం కలిగిన కొన్న దేశాలు కూడా, మరి కొన్ని ఐ.రా.స. సభ్య దేశాలు వ్యతిరేకించిన కారణంగా ఐ.రా.స. సభ్యత్వం కలిగి లేవు.
కొన్ని అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సంపూర్ణ స్వాధిపత్యం స్పష్టంగా లేని దేశాలు ఐ.రా.స. సాధారణ సభలో "పరిశీలకులు" (అబ్సర్వర్) హోదాను మాత్రం పొందగలవు. వారి ప్రతినిధులు సమావేశాలలో పాల్గొనగలరు గాని వారి ఓటు హక్కు ఉండదు.
ప్రస్తుత సభ్యులు
మార్చువివిధ సభ్యుల పేర్లు క్రింది జాబితాలో ఇవ్వబడ్డాయి. 1945లో ఐ.రా.స. ఏర్పడినప్పుడు 51మంది సభ్య దేశాలున్నాయి. వాటిలో 49 దేశాలు ఇప్పటికీ సభ్యులుగా ఉన్నాయి. లేదా వారి సభ్యత్వం వేరే దేశాలకు సంక్రమించింది. (ఉదాహరణకు - సోవియట్ యూనియన్ సభ్యత్వం రష్యాకు సంక్రమించింది.) చెకొస్లవాకియా, యుగొస్లావియా దేశాలు విచ్ఛిన్నమైనాక వాటి సభ్యత్వం వేరేదేశాలకు సంక్రమించలేదు. చైనా రిపబ్లిక్ (తైవాన్) సభ్యత్వం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు 25 అక్టోబరు 1971న సంక్రమించింది. - చైనా (తైవాన్), కమ్యూనిస్టు చైనా అనే రెండు దేశాలూ అంతకు ముందు, తరువాత కూడా ఉన్నాయి.
Indicates original member
పాత సభ్యులు
మార్చుచెకొస్లవేకియా
మార్చుచెకొస్లవాకియా 24 అక్టోబరు 1945లో ఐ.రా.స.లో చేరింది. 10 డిసెంబరు 1992న చెకొస్లవేకియా ఐ.రా.స. సెక్రటరీ జనరల్కు తమ దేశం 31 డిసెంబరు 1992నుండి విడిపోతున్నదని, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా దేశాలు విడివిడిగా సభ్యత్వం కోసం దరఖాస్తు పెట్టుకుంటాయని తెలిపింది. 19 జనవరి 1993లో అవి ఐ.రా.స.లో చేరాయి.
తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ
మార్చుజర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ (తూర్పు జర్మనీ), Federal Republic of Germany (పశ్చిమ జర్మనీ)లు 18 సెప్టెంబరు 1973లో ఐ.రా.స.లో చేరాయి. 3 అక్టోబరు 1990న ఇవి రెండూ ఐక్యమయ్యాయి. అప్పటినుండి ఆ దేశం పేరు జర్మనీ.
టాంగన్యీకా, జాంజిబార్
మార్చుమూస:Country data Tanganyika టాంగన్యీకా 14 డిసెంబరు 1961న ఐ.రా.స.లో చేరింది. మూస:Country data Zanzibar జాంజిబార్ 16 డిసెంబరు 1963న ఐ.రా.స.లో చేరింది. ఈ రెండు దేశాలూ United Republic of Tanganyika and Zanzibar గా 26 ఏప్రిల్ 1964న ఐక్యమయ్యాయి. తరువాత ఈ ఐక్యదేశంటాంజానియా (United Republic of Tanzania)గా 1 నవంబరు 1964న పేరు మార్చుకొంది.
యునైటెడ్ అరబ్ రిపబ్లిక్
మార్చు24 అక్టోబరు 1945న ఈజిప్ట్, సిరియాలు ఐ.రా.స.లో ఆరంభ సభ్యులుగా చేరాయి. ఈ రెండు దేశాలూ సంయుక్త అరబ్ రిపబ్లిక్ (United Arab Republic) అన్న పేరుతో 21 పిబ్రవరి 1958న ఐక్యమై ఒకే సభ్యదేశంగా 13 అక్టోబరు 1961వరకు కొనసాగాయి. తరువాత సిరియా మళ్ళీ స్వతంత్ర దేశంగా తన ప్రత్యేక స్థానాన్ని తిరిగి తీసుకొంది. ఈజిప్ట్ మాత్రం United Arab Republic గా 2 సెప్టెంబరు 1971వరకు కొనసాగింది. తరువాత "ఈజిప్ట్" అన్న పాతపేరును పునరుద్ధరించుకొంది.
సోవియట్ యూనియ్
మార్చుసోవియట్ యూనియన్ (USSR), 1945లో ఐ.రా.స.ని ప్రారంభించిన ఐదు దేశాలలో ఒకటి. 24 అక్టోబరు 1945నుండి ఆరంభ సభ్యదేశంగా ఉంది. 24 డిసెంబరు 1991న సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం నిశ్చయమని తెలిశాక, సోవియట్ యూనియన్ సీటు రష్యాకు సంక్రమిస్తున్నదని రష్యా ప్రెసిడెంట్ బోరిస్ యెల్త్సిన్, ఐ.రా.స. సెక్రటరీ జనరల్కు తెలియజేశాడు. Commonwealth of Independent States లోని 11 సభ్య దేశాల ఆమోదంతో భద్రతా సభలోని సోవియట్ యీనియన్ సీటు కూడా రష్యాకు వచ్చింది .
మిగిలిన సోవియట్ యూనియన్ వారసత్వ దేశాలు:
- బెలారస్ and ఉక్రెయిన్ - మొదట్లో 24 అక్టోబరు 1945 నుండి సభ్యులు.
- ఎస్టోనియా, లాత్వియా, and లిథువేనియా - 17 సెప్టెంబరు 1991నుండి.
- అర్మీనియా, అజర్బైజాన్, కజకస్తాన్, కిర్గిజిస్తాన్, మాల్డోవా, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, and ఉజ్బెకిస్తాన్ - 2 మార్చి 1992 నుండి.
- జార్జియా (దేశం) 31 జూలై 1992 నుండి.
ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్
మార్చుమూస:Country data North Yemen యెమెన్ (ఉత్తర యెమెన్)30 సెప్టెంబరు 1947 నుండి "ముతవాక్కిలిత్ యెమెన్ రాజ్యం" (Mutawakkilite Kingdom of Yemen) అన్న పేరుతో సభ్యత్వం కలిగి ఉంది. తరువాత "యెమెన్ అరబ్ రిపబ్లిక్" (Yemen Arab Republic)గా పేరు మార్చారు. . మూస:Country data South Yemen ప్రజాస్వామ్య యెమెన్ (దక్షిణ యెమెన్) "Southern Yemen" లేదా "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ యెమెన్"గా 14 డిసెంబరు 1967న చేరింది. 22 మే 1990న ఈ రెండు దేశాలు యెమెన్ లేదా "యెమెన్ రిపబ్లిక్"గా విలీనం అయ్యాయి.
యుగొస్లావియా
మార్చుయుగొస్లావియా 24 అక్టోబరు 1945న ఆరంభ సభ్య దేశంగా ఐ.రా.స.లో చేరింది. అప్పుడు దాని పేరు "డెమొక్రాటిక్ ఫెడరల్ యుగొస్లావియా". తరువాత "సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగొస్లావియా"గా పేరు మార్చుకుంది. 1992లో ఈ దేశం విచ్చిన్నం అయ్యింది. అందులో భాగాలైన "సెర్బియా", "మాంటినిగ్రో" రిపబ్లిక్‌లు "ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగొస్లావియా"గా 28 ఏప్రిల్ 1992న అవతరించాయి. సాధారణ సభ తీర్మానం A/RES/47/1 ప్రకారం 22 సెప్టెంబరు 1992న ఈ క్రొత్త దేశం పాత యుగొస్లావియా సభ్యత్వాన్ని వారసత్వంగా తీసుకోవడం ఆమోదయోగ్యం కాదు. కనుక Federal Republic of Yugoslavia (Serbia and Montenegro) వేరే సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది.
యుగొస్లావియా విచ్ఛిన్నం అయినందువలన ఏర్పడిన దేశాలన్నీ ప్రస్తుతం ఐ.రా.స. సభ్యులు:
- బోస్నియా & హెర్జ్‌గొవీనియా, క్రొయేషియా, స్లొవేనియా - 22 మే 1992న చేరాయి.
- మేసిడోనియా - 8 ఏప్రిల్ 1993న దీనికి "గత యుగొస్లావియాలోని మేసిడోనియా రిపబ్లిక్" (The former Yugoslav Republic of Macedonia)గా సభ్యత్వం ఇవ్వబడింది. ఈ "మేసిడోనియా రిపబ్లిక్" అనే పేరు విషయమై గ్రీస్తో కొంత వివాదం ఉంది.
- 1 నవంబరు 2000న "ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగొస్లావియా" (The Federal Republic of Yugoslavia) క్రొత్త దేశంగా సభ్యత్వం తీసుకొంది. (అంటే పాత యుగొస్లావియా సీటు దీనికి సంక్రమించలేదు). "ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగొస్లావియా" తన పేరును సెర్బియా & మాంటినిగ్రో గా 4 పిబ్రవరి 2003న మార్చుకొంది. 3 జూన్ 2006న "మాంటినిగ్రో" స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత "సెర్బియా-మాంటినిగ్రో" సీటు మాత్రం సెర్బియా దేశానికి మిగిలింది. (Article 60 of the Constitutional Charter of Serbia and Montenegro).
- మాంటినిగ్రో - 28 జూన్ 2006న సభ్యత్వం పొందింది.
చైనా, తైవాన్‌ల సీటు
మార్చుచైనా - చైనా రిపబ్లిక్ (తైవాన్) (ROC) - 24 అక్టోబరు 1945 నుండి ఐ.రా.స. ప్రారంభించిన సభ్యదేశాలలో ఒకటి. అయితే చైనా అంతర్యుద్ధం కారణంగా "కూమింటాంగ్" అధీనంలో ఉన్న ప్రభుత్వం 1949లో తైవాన్‌కు వలసపోయింది. "కమ్యూనిస్టు" పాలన చైనా ప్రధాన భూభాగంలో నెలకొన్నది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC), 1 అక్టోబరు 1949న తమదే సంపూర్ణ చైనా అని ప్రకటించారు. కూమింటాంగ్ చైనా చాలా చిన్న దీవులలో పాలన సాగిస్తున్నా గాని, మొత్తం చైనాకు ప్రతినిధిగా ఐ.రా.స.లో 1971 వరరకు కొనసాగింది. చైనా ప్రధాన భూభాగం పై అధిపత్యం కలిగిన కమ్యూనిస్టు ప్రభుత్వానికి మాత్రం ఐ.రా.స.లో ప్రాతినిధ్యం లేదు. 25 అక్టోబరు 1971న జరిగిన తీర్మానం (UN General Assembly Resolution 2758) "రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)కు ఉన్న ప్రాతినిధ్యాన్ని తొలగించి "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా"కు చైనా ఏకైక ప్రతినిధిగా గుర్తింపు లభించింది. దీనితో "తైవాన్"కు ఐ.రా.స.లో స్థానం తొలగిపోయినట్లే.
1990 తరువాత తమకు సభ్యత్వం (లేదా కనీసం పరిశీలక హోదా) కావాలని తైవాన్ ఎంతో ప్రయత్నించింది కాని వీటో హోదా ఉన్న చైనా అందుకు వ్యతిరేకంగా ఉన్నందున ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కనీసం పాలస్తీనా, వేటికన్‌లకు ఉన్న పరిశీలక హోదా కూడా తైవాన్‌కు లభించలేదు.
పరిశీలకులు
మార్చుఈ క్రింది వాటికి అబ్సర్వర్ (పరిశీలకులు) హోదా ఉన్నది.
- హోలీ సీ (Holy See) లేదా వాటికన్ నగరం (Vatican City)) - 6 ఏప్రిల్ 1964నుండి శాశ్వత పరిశీలక హోదా. పరిశీలక దేశాలకు దాదాపు స్వాధిపత్య దేశాలకున్న హక్కులుంటాయి. కావాలంటే సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఉదాహరణకు 1948 నుండి 2002 వరకు స్విట్జర్లాండ్ ఒక పరిశీలక సభ్యదేశం. ( 10 సెప్టెంబరు 2002న పూర్తి సభ్యదేశంగా చేరింది).
- పాలస్తీనా విమోచన సంస్థ(Palestine Liberation Organization - PLO)- సాధారణ సభ రిజల్యూషన్ 3237 ప్రకారం 22 నవంబరు 1974న పరిశీలక సభ్యునిగా చేరింది. After the proclaimed declaration of the State of Palestine by the PLO, its designation in the UN was changed to Palestine by General Assembly resolution A/RES/43/177 on 15 డిసెంబరు 1988. Palestine's status in the UN is "a non-member entity".
The sovereignty status of పశ్చిమ సహారా is in dispute between మొరాకో and the Polisario Front. Most of the territory is administered by Morocco, the remainder (the Free Zone) by the Sahrawi Arab Democratic Republic (SADR), proclaimed by the Polisario Front. The SADR is a full member of the African Union, but is neither a member nor observer of the UN.
The associated states of న్యూజిలాండ్, the కుక్ దీవులు and నియూ, while self-governing in their domestic affairs, have their foreign affairs represented by New Zealand, and are not UN members.
Many international organizations, non-governmental organizations, and entities whose statehood or sovereignty are not precisely defined, such as the యూరోపియన్ యూనియన్, the International Committee of the Red Cross, and the Sovereign Military Order of Malta, are invited to become observers at the General Assembly.
వివిధ పేర్లు, గమనికలు
మార్చు- ↑ బెలారస్ అనేది మొదట "బైలో రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్"గా ఐ.రా.స.లో చేరింది. ఐతే 1991లో ఈ దేశం సోవియట్ యూనియన్ నుండి స్వతంత్రం ప్రకటించుకున్నది. తరువాత ఆ దేశం పేరు "బైలోరష్యా" నుండి "బెలారస్"గా 19 సెప్టెంబరు 1991 నుండి మార్చుకున్నది.
- ↑ బెనిన్ ముందు పేరు "డాహొమీ". 1975లో పేరు మార్చుకున్నది.
- ↑ బ్రూనే ప్రస్తుత నామం "బ్రూనే దారుస్సలామ్".
- ↑ బుర్కీనా ఫాసో క్రితం పేరు "ఎగువ వోల్టా", 1984లో పేరు మార్చుకొన్నది.
- ↑ Cameroon పాత పేరు "Cameroun". ఐతే 1961లో Southern Cameroonsతో విలీనం అయినాక Cameroon నామం స్థిరపడింది.
- ↑ The కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ పూర్వనామం "కాంగో (లెపోల్డ్విల్లి)". తరువాత 1964లో "కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్" గా పేరు మార్చుకొంది. 1971లో "జైర్"గా పేరు మార్చుకుంది. మళ్ళీ 17 మే 1997లో ఇప్పటి "కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్"గా పేరు మార్చికుంది.
- ↑ The కాంగో రిపబ్లిక్ సభ్య నామం "కాంగో". ముందుగా చేరినప్పుడు దీనిపేరు "కాంగో (బ్రజ్జావిల్లి)".
- ↑ Côte d'Ivoire అని పేరు మార్పు 1985లో జరిగింది. అంతకు మందు సభ్యత్వం తీసుకొన్నప్పటి పేరు "Ivory Coast".
- ↑ ఇండొనీషియా 20 జనవరి 1965న మలేషియతో విభేదాల కారణంగా, మలేషియాని భద్రతా సభలో అశాశ్వత సభ్య దేశంగా ఎన్నకొన్నందకు నిరసనగా, తాత్కాలికంగా ఈ.రా.స. నుండి నిష్క్రమించింది. మరలా ఐ.రా.స.లో పాల్గొనడానికి 19 సెప్టెంబరు 1966లో తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. (to resume full cooperation with the United Nations and to resume participation in its activities) - మరలా సభ్యునిగా చేరమని ఐ.రా.స. ఆహ్వానించగా 28 సెప్టెంబరు 1966న సభ్యునిగా చేరింది.
- ↑ ఇరాన్ ప్రస్తుత సభ్యనామం "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్".
- ↑ ఉత్తర కొరియా: జనవరి 1, 2007 నుండి సస్పెండ్ చేయబడింది.
- ↑ లావోస్ సభ్యనామం "లావోస్ పీపుల్స్ డెమొక్రాటిక్ రిపబ్లిక్".
- ↑ లిబ్యా సభ్యనామం "లిబ్యన్ అరబ్ జమాహ్రియా".
- ↑ The రిపబ్లిక్ ఆఫ్ మేసిడోనియా సభ్యనామం "గత యుగొస్లావియా మేసిడోనియా రిపబ్లిక్" (The former Yugoslav Republic of Macedonia) - గ్రీస్తో ఈ విషయమై వివాదం ఉన్నది.
- ↑ మలేషియా చేరినప్పటి పేరు "ఫెడరేషన్ ఆఫ్ మలేషియా". తరువాత 16 సెప్టెంబరు 1963న, సింగపూర్, సబాహ్, సరావాక్లు మలేషియా ఫెడరేషన్లో చేరిన తరువాత, దేశం పేరు "మలేషియా" అని మార్చబడింది. 9 ఆగస్టు 1965న సింగపూర్ స్వతంత్ర దేశం అయ్యింది.
- ↑ మైక్రొనీషియా సభ్యనామం "ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రొనీషియా" (Micronesia, Federated States of).
- ↑ మయన్మార్ పూర్వనామం "బర్మా". 1989లో పేరు మార్పిడి జరిగింది.
- ↑ ఫిలిప్పిన్స్ ఐ.రా.స.లో చేరినప్పటి పేరు "కామన్వెల్త్ ఆఫ్ ఫిలిప్పీన్స్" (Commonwealth of the Philippines)". 1946లో పూర్తి స్వాతంత్ర్యం పొందింది.
- ↑ రష్యా సభ్యనామం "రష్యన్ ఫెడరేషన్" (Russian Federation).
- ↑ సమోవా పాతపేరు "పశ్చిమ సమోవా" (Western Samoa). 1997లో పేరు మార్పిడి జరిగింది.
- ↑ దక్షిణ ఆఫ్రికా పాత పేరు "యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా" 1961లో పేరు మార్పిడి జరిగింది.
- ↑ శ్రీలంక పాతపేరు "సిలన్" (Ceylon). 1972లో పేరు మార్పిడి జరిగింది.
- ↑ సిరియా సభ్యనామం "సిరియన్ అరబ్ రిపబ్లిక్" (Syrian Arab Republic).
- ↑ టాంజానియా సభ్యనామం "టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్" (United Republic of Tanzania).
- ↑ థాయిలాండ్ మొదటిపేరు "సయామ్". 1949లో పేరు మార్పిడి జరిగింది.
- ↑ ఉక్రెయిన్ మొదటిపేరు "ఉక్రెయినియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్". 1991లో పేరు మార్పిడి జరిగింది.
- ↑ యునైటెడ్ కింగ్డమ్ సభ్యనామం "యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్" (United Kingdom of Great Britain and Northern Ireland).
- ↑ సభ్యనామం "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా" (United States of America).
- ↑ వెనిజ్వెలా సభ్యనామం "బొలీవియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజ్వెలా" (Venezuela, Bolivarian Republic of).
- ↑ వియత్నాం సభ్యనామం "వియత్ నామ్" (Viet Nam).
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- Official list of member states Archived 2009-04-17 at the Wayback Machine
- Growth in United Nations membership, 1945-present