ప్రపంచ హోమియోపతి దినోత్సవం

ప్రపంచ హోమియోపతి దినోత్సవం (ఆంగ్లం: World Homeopathy Day) ప్రతి ఏట ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.[1][2][3]

ప్రపంచ హోమియోపతి దినోత్సవం
ప్రపంచ హోమియోపతి దినోత్సవం
హోమియోపతి పితామహుడు డా. శామ్యూల్ హానిమెన్
జరుపుకొనేవారుప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులు
జరుపుకొనే రోజుఏప్రిల్ 10
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

చరిత్ర మార్చు

హోమియోపతీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్యవిధానం. జర్మన్‌ దేశానికి చెందిన డా. క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ అనే ఫిజిషియన్‌ 1796లో ఈ వైద్యవిధానాన్ని, ఈ మాటని కనిపెట్టాడు.[4]

మలేరియా వ్యాధి నివారణకు సంకోనబెరడుతో చేసిన మందువాడుతారని తెలుసుకున్న హనెమన్‌ ఆ బెరడు మలేరియాను ఏ విధంగా నివారిస్తుందో తెల్సుకోవాలనుకున్నాడు. అందుకోసం సింకోనా బెరడుతో కషాయం తయారు చేసుకొని తనమీద తన స్నేహితులమీద ప్రయోగాలు జరిపి, ఏ ఔషదమైతే ఆరోగ్యవంతునిలో ఒక వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందో ఆ లక్షణాలున్న వ్యాధికి ఆ ఔషదం ఇచ్చినప్పుడు వ్యాధి నయమవుతుందని తెలుసుకున్నాడు. తన ప్రయోగ ఫలితాలను గురించి 1976లో లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించడంతోపాటు, ఈ నూతన వైద్య విధానికి హోమియోపతి గా నామకరణం చేశాడు.[2]

ఇతర వివరాలు మార్చు

 1. ప్రస్తుతం వైద్య విధానాల్లో హోమియోపతి వైద్యం రెండవ స్థానంలో ఉంది.[3]
 2. 1813 సంవత్సరంలో జర్మనీలో టైఫాడ్‌ జ్వరం వచ్చినప్నుడు హోమియోపతి వైద్యంద్వారా ఆ వ్యాధి అరికట్టబడింది.
 3. 66 దేశాల్లో ఈ హోమియోపతి వైద్యం ప్రాచుర్యంలో వుండగా, భారతదేశ జనాభాలో 38 శాతం ప్రజలు ఈ వైద్యాన్ని పొందుతున్నారు.

కార్యక్రమాలు మార్చు

 1. హోమియోపతి వైద్యం గురించి వస్తున్న నకిలీ వార్తలను అడ్డుకోవడానికి, హోమియోపతి విశిష్టతకు ప్రచారము కల్పించేందుకు అమెరికాలో 2005లో వరల్డ్ హోమియోపతి ఎవేర్నెస్ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూ.హెచ్.ఏ.ఓ.) అనే సంస్థ ఏర్పాటుచేయబడింది. హాలెండ్ లో 2008, నవంబర్ 21న పూర్తిస్థాయి సంస్థగా రూపుదిద్దుకుంది.
 2. హోమియోపతికి విశేష ప్రచారము కల్పించడంకోసం ఈ దినోత్సవం రోజున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 3. వైద్య కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, హోమియోపతి వైద్య విశిష్టతను తెలియజేసే కరపత్రాలను పంచిపెడుతారు.
 4. సదస్సులు, సమావేశాలు నిర్వహించి హోమియోపతికి సంబంధించి కొత్త ఆలోచనలు ఆహ్వానిస్తారు. పరిశోధనలు జరుపుతారు.

మూలాలు మార్చు

 1. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (10 April 2017). "నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం". Archived from the original on 10 April 2019. Retrieved 10 April 2019.
 2. 2.0 2.1 ప్రజాశక్తి, కర్నూలు (9 April 2017). "హోమియో వైద్య పితామహుడు డాక్టర్‌ సి.ఎప్‌.ఎస్‌ హౌనెమన్‌". Archived from the original on 11 April 2019. Retrieved 11 April 2019.
 3. 3.0 3.1 ఆంధ్రభూమి, ఇతర వార్తలు (9 April 2018). "హోమియో వైద్య విధానానికి ఆద్యుడు". జనార్దన నుగ్గు. Archived from the original on 11 April 2019. Retrieved 11 April 2019.
 4. Hahnemann, Samuel (1833). The homœopathic medical doctrine, or "Organon of the healing art". Dublin: W. F. Wakeman. pp. iii, 48–49. Observation, reflection, and experience have unfolded to me that the best and true method of cure is founded on the principle, similia similibus curentur. To cure in a mild, prompt, safe, and durable manner, it is necessary to choose in each case a medicine that will excite an affection similar (ὅμοιος πάθος) to that against which it is employed. Translator: Charles H. Devrient, Esq.