ప్రభావతి మహాభారతంలోని పురాణ పాత్ర. వజ్రనాభుడు అనే రాక్షసుని కూమార్తె. శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుని భార్య.[1]

ప్రభావతి
మహాభారతం పాత్ర
సమాచారం
కుటుంబంవజ్రనాభుడు (తండ్రి)
దాంపత్యభాగస్వామిప్రద్యుమ్నుడు
పిల్లలుప్రభావంతుడు

కథ మార్చు

మేరుపర్వతం దగ్గర వజ్రపురి అనే అద్భుతమైన నగరాన్ని వజ్రనాభుడు అనే రాక్షసుడు పాలిస్తుండేవాడు. వజ్రనాభుడి అనుమతి లేకుండా ఎవరూ కూడా ఆ నగరంలోకి ప్రవేశించటానికి వీల్లేదు. వజ్రనాభుడి కుమార్తె ప్రభావతి. ఒకనాడు కలలో ప్రభావతికి పార్వతి కనిపించి ఒక చిత్రపటం గీసి ఇస్తూ, ఇతనే నీ భర్త. ప్రద్యుమ్నుడనే రాకుమారుడు. మీ ఇద్దరికీ పుట్టే బిడ్డ ఈ రాజ్యానికి రాజౌతాడు అని చెప్పింది.

చిలుక, శుచిముఖి అనే హంస[2] సహాయంతో ప్రద్యుమ్నుడు భద్రుడు అనే నటుడిగా, గదుడు పారిపార్శ్వకుడిగా, సాంబుడు విదూషకుడిగా వజ్రపురి నగరానికి వస్తారు. అక్కడ శుచిముఖి పెళ్ళిమంత్రాలు చదవగా ప్రద్యుమ్నుడు, ప్రభావతికి గాంధర్వ వివాహం జరిగింది. తొమ్మిదినెలల తర్వాత ప్రభావతికి ప్రభావంతుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ విషయం తెలుసుకొని వచ్చిన వజ్రనాభుడితో ప్రద్యుమ్నుడు యుద్ధంచేసి వజ్రనాభుడిని అంతం చేస్తాడు.[3]

ఇతర వివరాలు మార్చు

సూర్యుని భార్య అగు సంజ్ఞాదేవికి నామం. ఈమె ఇంద్రుని పతిగా కోరి తపము ఆచరించుచు ఉండగా అతడు వసిష్ఠుని ఆకృతి తాల్చి కొన్ని బదరీఫలములను ఇచ్చి పక్వముచేయుము అనెను. అందులకు ఒప్పుకొని పక్వము చేయ ఆరంభింపగా అవి ఎంతసేపటికిని పక్వముకాక సేకరించిన కాష్ఠములు అన్ని సమసిపోయెను. అప్పుడు ఈమె, తాను కాష్ఠములను తేబోయిన అగ్ని ఆరి దుష్పాకము అగును అని ఎంచి, తన కాలు ఇంధనముగా ఇడి పాకము చేయ పూనెను. అంత ఇంద్రుడు మెచ్చుకొని ఆమె కోరిన వరమును ఇచ్చెను. ఈమె తపము ఆచరించిన తీర్థము బదరీపాచనము అనబడును.

మూలాలు మార్చు

  1. ప్రభావతి, పురాణనామ చంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య),1879
  2. పుస్తకం.నెట్, పుస్తకభాష (26 May 2010). "నవపారిజాతాలు". www.pustakam.net. జ్యోతి. Retrieved 16 July 2020.
  3. PRANJALI PRABHA News, ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞానకవితల పత్రిక (6 July 2018). "ప్రభావతీ ప్రద్యుమ్నం". www.mallapragadas.blogspot.com. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ. Retrieved 16 July 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రభావతి&oldid=4059897" నుండి వెలికితీశారు