ప్రశాంత్ కుమార్ మిశ్రా

(ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నుండి దారిమార్పు చెందింది)

ప్రశాంత్ కుమార్ మిశ్రా భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడై, 2021 అక్టోబరు 13న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[1]

ప్రశాంత్ కుమార్ మిశ్రా

సుప్రీం కోర్టు న్యాయమూర్తి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 మే 2023
సూచించిన వారు డి.వై. చంద్రచూడ్
నియమించిన వారు ద్రౌపది ముర్ము

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
13 అక్టోబర్ 2021 – 18 మే 2023
నియమించిన వారు రాం నాథ్ కోవీంద్

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
1 జూన్ 2021 – 12 అక్టోబర్ 2021
నియమించిన వారు రాం నాథ్ కోవీంద్

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
10 డిసెంబర్ 2009 - 12 అక్టోబర్ 2021
సూచించిన వారు కేజీ. బాలకృష్ణన్
నియమించిన వారు ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం 29 ఆగష్టు 1964
రాయ్‌గడ్‌, ఛత్తీస్‌గఢ్
పూర్వ విద్యార్థి గురు ఘసీదాస్‌ విశ్వవిద్యాలయం

జననం, విద్యాభాస్యం మార్చు

ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం, రాయ్‌గడ్‌లో జన్మించాడు. ఆయన బిలాస్‌పుర్‌లోని గురు ఘసీదాస్‌ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందాడు.

వృత్తి జీవితం మార్చు

ప్రశాంత్ కుమార్ మిశ్రా 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని . రాయగడ్ జిల్లా కోర్టు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు. మిశ్రా 2005 జనవరిలో ఛత్తీస్‌గడ్‌ హైకోర్టులో సీనియర్ న్యాయవాది హోదాను అందుకొని, ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా, హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యునిగా పనిచేశాడు. ఆయన 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఛత్తీస్‌గడ్‌ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్‌గా, ఆ తర్వాత అడ్వకేట్‌ జనరల్‌గా పదోన్నతి అందుకున్నాడు.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 2009 డిసెంబరు 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి[2] హోదాలో ఉన్న ఆయన 2021 అక్టోబరు 9న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[3]

మూలాలు మార్చు

  1. Sakshi Education (14 October 2021). "రాష్ట్ర హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన న్యాయమూర్తి?". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  2. The New Indian Express (24 May 2021). "Justice Prashant Kumar Mishra appointed acting chief justice of Chhattisgarh High Court". Archived from the original on 11 అక్టోబరు 2021. Retrieved 11 October 2021.
  3. Deccan Chronicle (9 October 2021). "Prashant Kumar Mishra is new Chief Justice of AP High Court" (in ఇంగ్లీష్). Archived from the original on 11 అక్టోబరు 2021. Retrieved 11 October 2021.