రామ్‌నాథ్ కోవింద్

భారతీయ రాజకీయవేత్త, భారతదేశం యొక్క 14 వ అధ్యక్షుడు
(రాం నాథ్ కోవీంద్ నుండి దారిమార్పు చెందింది)

రామ్‌నాథ్ కోవింద్ (జ.1945, అక్టోబరు 1) భారతదేశపు 14వ రాష్ట్రపతి.[1] అతను 2017 జూలై 25 నుండి భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. [2] అంతకు పూర్వం అతను 2015 నుండి 2017 వరకు భీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నాడు.[3][4] అతను 1994 నుండి 2006 వరకు భారత పార్లమెంటు సభ్యునిగా (రాజ్యసభ) ఉన్నాడు. అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రం లోని ఎన్.డి.ఎ ప్రభుత్వం ఎంపిక చేసింది. 2017 రాష్ట్రపతి ఎన్నికలలో అతను భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. భారత రాష్ట్రపతి పదవినలంకరించిన దళిత వ్యక్తులలో ఇతను రెండవవాడు. [5] రాజకీయాలలోనికి ప్రవేశించక పూర్వం అతను 1993 వరకు,16 సంవత్సరాలపాటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులలో న్యాయవాదిగా ఉన్నాడు. [6]

రామ్‌నాథ్ కోవింద్
రామ్‌నాథ్ కోవింద్


పదవీ కాలం
25 జూలై 2017 – 25 జూలై 2022
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ
ముప్పవరపు వెంకయ్యనాయుడు
ముందు ప్రణబ్ ముఖర్జీ
తరువాత ద్రౌపది ముర్ము

పదవీ కాలం
16 ఆగస్టు 2015 – 20 జూన్ 2017
ముందు కేశరి నాథ్ త్రిపాఠి
తరువాత కేశరి నాథ్ త్రిపాఠి

వ్యక్తిగత వివరాలు

జననం (1945-10-01) 1945 అక్టోబరు 1 (వయసు 78)
పరౌంక్త్, యునైటెడ్ ప్రొవెన్సీస్, బ్రిటిష్ ఇండియా.
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్
జీవిత భాగస్వామి
నివాసం రాష్ట్రపతి భవన్
పూర్వ విద్యార్థి కాన్పూర్ విశ్వవిద్యాలయం

ప్రారంభ జీవితం, విద్య మార్చు

కోవింద్ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ దేహాత్ జిల్లాకు చెందిన పరౌఖ్ గ్రామంలో 1945 అక్టోబరు 1 న జన్మించాడు.[7][8] అతని తండ్రి మైకులాల్ భూమిలేని కోరి (దళితులలో చేనేత కులం) కులానికి చెందినవాడు. అతని తండ్రి తన కుటుంబ పోషణార్థం ఒక దుకాణాన్ని నడిపేవాడు. కోవింద్ తన ఐదుగురు సహోదరులలో చిన్నవాడు. అతను మట్టి గుడిసెలో జన్మించాడు. కానీ చివరికి అది కూలిపోయింది. తన గుడిసె అగ్నిప్రమాదానికి గురైనప్పుడు తన ఐదేళ్ల వయస్సులో తన తల్లిని కోల్పోయాడు. తరువాత కోవింద్ ఆ భూమిని తన వర్గానికి చెందివవారికి విరాళంగా యిచ్చాడు.[9] ప్రాథమిక విద్య పూర్తిచేసిన తరువాత అతను తన గ్రామానికి 8 కి.మీ దూరంలో గల కాన్పూర్ గ్రామానికి కళాశాల విద్యకోసం రోజూ నడిచి వెళ్ళేవాడు. అతని గ్రామంలో ఎవరికీ కనీసం సైకిలు కూడా ఉండేది కాదు.[10] తరువాత అతను కామర్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీని, డి.ఎ.వి కళాశాల నుండి ఎల్.ఎల్.బిని పూర్తిచేసాడు. [11][12][7]

జీవితం మార్చు

న్యాయవాదిగా మార్చు

కోవింద్ కాన్పూర్ లోని డి.ఎ.వి కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధం కావడాని ఢిల్లీ వెళ్ళాడు. అతను ఈ పరీక్షను మూడవ ప్రయత్నంలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఐ.ఎ.ఎస్ కు బదులుగా అనుబంధ సేవా కార్యక్రమాలలో తగినంత పని ఉన్నందున అందులో జాయిన్ కాలేదు. తరువాత న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.[13] కోవింద్ 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా చేరాడు. అతను 1977 నుండి 1979 వరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్రప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగాడు. 1977 & 1978 మధ్య భారతదేశ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయికి వ్యక్తిగత సహాయకునిగా ఉన్నాడు. [14] 1978లో భారత సుప్రీం కోర్టు లో అడ్వొకేట్-ఆన్-రికార్డుగా ఉన్నాడు. 1980 నుండి 1993 వరకు కేంద్రప్రభుత్వ స్టాండింగ్ కమిటీకి తన సేవలనందించాడు. అతను ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులలో న్యాయవాదిగా 1993 వరకు కొనసాగాడు. ఒక న్యాయవాదిగా అతను సమాజంలో బలహీన వర్గాలకు, న్యూఢిల్లీ ఉచిత న్యాయ సేవా సమితి అధ్వర్యంలో పేదలు, మహిలళలకు "ప్రొ-బొనొ" సహాయాన్ని అందించాడు. [11]

భారతీయ జనతా పార్టీ సభ్యునిగా మార్చు

అతను 1991 లో భారతీయ జనతా పార్టీ లోనికి చేరాడు.[15] అతను 1998 నుండి 2002 వరకు బి.జె.పి.దళిత మోర్చాకు అధ్యక్షునిగా ఉన్నాడు. అతను ఆల్ ఇండియా కోళీ సమాజ్ కు కూడా అధ్యక్షునిగా ఉన్నాడు. అతను బి.జె.పి పార్టీ జాతీయ ప్రతినిధిగా పనిచేశాడు. [16] అతను డేరాపూర్ లోని తన పూర్వీకుల ఇంటిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కి విరాళంగా ఇచ్చాడు. [15] బి.జె.పిలో చేరిన తరువాత అతను గ్రాతంపూర్ శాసనసభ నియోజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసాడు కానీ ఓడిపోయాడు. తరువాత 2007లో భోగ్నిపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బి.జె.పి తరపున పోటీ చేసి మరలా ఓడిపోయాడు.[17]

1997లో కోవింద్ షెడ్యూల్డ్ తరగతులు, తెగల వర్గాలకు ప్రతికూల ప్రభావం చూపే కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని ఆదేశాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేసాడు. తరువాత అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం, రాజ్యాంగంలో మూడు సవరణలు చేసి తమ ఆదేశాలను ఉపసంహరించుకుంది.[18]

రాజ్య సభ మార్చు

అతను 1994 ఏప్రిల్ లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి పార్లమెంటు సభ్యునిగా రాజ్యసభ నుండి ఎంపికయ్యాడు. అతను వరుసగా రెండుసార్లు మొత్తం 10 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉన్నాడు. అతను షెడ్యూల్ కులాలు/తరగతుల సంక్షేమం, హోమ్‌అఫైర్స్, పెట్రోలియం, సహజ వాయువు, సామాజిక న్యాయం, సాధికారత, చట్టం, న్యాయం రంగాలలో పార్లమెంటరీ కమిటీలలో సభ్యునిగా తన సేవలనందించాడు. అతను రాజ్యసభ్య హౌస్ కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించాడు. పార్లమెంటు సభ్యునిగా పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంతాలను అభివృద్ధి చేసే పథకంలో భాగంగా అతను గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికోసం దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో పాఠశాల భవనాలను నిర్మించేందుకు కృషి చేసాడు. ఒక పార్లమెంటు సభ్యునిగా అతను ధాయ్‌లాండ్, నేపాల్, పాకిస్థాన్, సింగపూర్, జర్మనీ, స్విడ్జర్లాండ్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యయనం కోసం పర్యటనలు చేసాడు.

ఇతర నియామకాలు మార్చు

అతను లక్నో లోని బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బోర్డు ఆఫ్ మేనేజిమెంటుగా బాధ్యతలు నిర్వర్తించాడు. అక్టోబరు 2002లో అమెరికా లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ శాసనసభలో భారతీయ ప్రతినిధిగా హాజరయ్యాడు.[19]

గవర్నర్ మార్చు

2015 ఆగస్టు 8 న అప్పటి భారత రాష్ట్రపతి కోవింద్ ను బీహార్ గవర్నరుగా నియమించారు. [20] 2015 ఆగస్టు 16న పాట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇక్బాల్ అహ్మద్ అన్సారీ, కోవింద్‌ను బీహార్ 35వ గవర్నరుగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈ సమావేశం పాట్నా లోని రాజభవన్ లో జరిగింది.[21] బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలలు ముందుగా జరిగినందున అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్, కోవింద్ నియామకాన్ని విమర్శించాడు. ఈ నియామకం సర్కారియా కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా సంప్రదించకుండా జరిగిందని అతను పేర్కొన్నాడు. [22] అయినప్పటికీ కోవింద్ ఒక రాష్ట్ర గవర్నరుగా, అర్హత లేని ఉపాద్యాయుల పదోన్నతులలో జరిగే అక్రమాలు, వివిధ నిధుల నిర్వహణలోఅవకతవకలు, విశ్వవిద్యాలయాలలో అనర్హులైన అభ్యర్థుల నియామకం వంటి విషయాలను విచారించేందుకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేయడంపై అందరి ప్రశంసలను పొందాడు. జూన్ 2017 న కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు. కోవింద్ కు నితిష్ కుమార్ మద్దతునిచ్చాడు. నిష్పాక్షికంగా నిలబడి అతని ప్రభుత్వానికి గవర్నర్ గా పనిచేసాడని కొనియాడాడు.[23]

 
బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ కు స్వాగతం చెబుతున్న ప్రణబ్ ముఖర్జీ - పాట్నా - 2017 ఏప్రిల్ 17

భాజపాలో కీలక నేతగా ఎదిగి యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 1998 నుంచి 2002 వరకూ భాజపా దళిత మోర్చా అధ్యక్షుడిగా రామ్‌నాథ్‌ పనిచేశారు. అఖిలభారత్‌ కోలి సమాజ్‌ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015 ఆగస్టు 16 నుంచి ఆయన బీహార్‌ గవర్నర్‌గా కూడా ఉన్నారు.

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా మార్చు

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప‌ద‌వీకాలం గత ఏడాది 2017 జూలై 24న ముగియడంతో కొత్త‌ రాష్ట్ర‌ప‌తి కోసం బీజేపీ కూట‌మి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి దళిత నేత, బీహారు గవర్నర్ రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్.డి.ఎ.ప్రతిపాదించింది. కోవింద్ బీహార్ గవర్నరు బాధ్యతలకు రాజీనామా చేసాడు. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ రాజీనామాను 2017 జూన్ 20న ఆమోదించాడు. [24] అతను 2017 జూలై 20 న ఎన్నికలలో రాష్ట్రపతిగా గెలిచాడు.[25]

ఈ ఎన్నికలో కోవిందుకు 65.65% చెల్లుబాటు అయ్యే ఓట్లు వచ్చాయి. అతనికి వ్యతిరేకంగా పోటీచేసిన అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్కు 34.35% ఓట్లు వచ్చాయి. కోవిందుకు 2930 ఓట్లు (పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యుల నుండి) వచ్చాయి. వీటి విలువ ఎలక్టోరల్ కాలేజీలో 702,044 (65.65%) . మీరా కుమార్ కు 367,314 (34.35%) విలువ గల 1,844 ఓట్లు వచ్చి కోవింద్ కంటే 367,314 విలువ గల ఓట్లు వెనుకబడి ఉంది. 77 ఓట్లు చెల్లుబాటు కాలేదు. [26] కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి భవన్ లోకి రెండో దళిత నేతగా అడుగు పెట్టారు. అతను రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. [27] మీరా కుమార్ కు వచ్చిన ఓట్లు (367,314) రాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన రెండవ అత్యధిక స్కోరు. అంతకు ముందు 1969 లో నీలం సంజీవరెడ్డికి రాష్ట్రపతి ఎన్నికలలో 405,427 ఓట్లు సాధించాడు. అప్పటి ఎన్నికలలో విజేత అభ్యర్థి వి.వి.గిరికి 420,077 ఓట్లు వచ్చాయి.

 
2017[permanent dead link] ఆగస్టు 28 న భారత ప్రధాన న్యాయమూర్తిచే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దీపాక్ మిశ్రాతొ కోవింద్

14వ భారత రాష్ట్రపతి మార్చు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప‌ద‌వీకాలం 2017 జూలై 24న ముగియడంతో 2017 జూలై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.స్ ఖేహర్ అతనితో ప్రమాణస్వీకారం చేయించాడు. [28] [29]

దేశ అధ్యక్షునిగా అంతర్జాతీయ పర్యటనలు మార్చు

దేశం పర్యటించిన ప్రాంతం తేదీలు కారణం మూలాలు
2017
  Djibouti జిబోటి నగరం 3 - 4 అక్టోబరు దేశీయ పర్యటన [30][31]
  Ethiopia అడ్డిస్ అబాబ 5 - 6 అక్టోబరు [32][33][34]
2018
  Mauritius పోర్టు లోయీస్ 11 - 14 మార్చి దేశీయ పర్యటన [35][36]
  Madagascar అంటనానారివో 14 - 15 మార్చి [35]
  Equatorial Guinea మలాబో 7 - 9 ఏప్రిల్ [37]
  Swaziland బబానే 9 - 10 ఏప్రిల్ [38]
  Zambia లుసకా 10 - 12 ఏప్రిల్ [39][40]

వ్యక్తిగత జీవితం మార్చు

అతను 1974 మే 30 న సవిత కోవింద్ ను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు ప్రశాంత్ కుమార్ ఒక కుమార్తె స్వాతి కలిగారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. http://www.thehindu.com/news/national/live-updates-president-swearing-in-ceremony/article19357489.ece
  2. "Ram Nath Kovind takes oath: In inaugural speech, president outlines vision for India as world leader". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 25 జూలై 2017. Archived from the original on 2 ఆగస్టు 2017. Retrieved 2 ఆగస్టు 2017.
  3. "Press Releases Detail – The President of India". presidentofindia.nic.in. Archived from the original on 27 ఆగస్టు 2017.
  4. Ram Nath Kovind resigns as Bihar Governor (20 జూన్ 2017). "Ram Nath Kovind resigns as Bihar Governor". The Hindu. Archived from the original on 8 అక్టోబరు 2017. Retrieved 20 జూన్ 2017.
  5. Wu, Huizhong (20 జూలై 2017). "Man from India's lowest caste elected president". CNN. Archived from the original on 21 జూలై 2017.
  6. "Bihar Governor Ram Nath Kovind is NDA nominee for President". The Hindu. The Hindu. 19 జూన్ 2017. Archived from the original on 24 జూన్ 2017. Retrieved 23 జూలై 2017.
  7. 7.0 7.1 "Governor of Bihar". governor.bih.nic.in. Archived from the original on 3 జూలై 2017. Retrieved 20 జూన్ 2017.
  8. "Ram Nath Kovind, Paraukh and the road to Raisina Hill". Archived from the original on 27 ఆగస్టు 2017. Retrieved 24 ఆగస్టు 2017.
  9. "कानपुर से ग्राउंड रिपोर्ट : रामनाथ कोविंद के गांव में जश्न, लोग गा रहे हैं- मेरे बाबा की भई सरकार". Archived from the original on 21 జూలై 2017. Retrieved 13 మే 2018.
  10. Tiwari, Vaibhav (20 జూన్ 2017). "NDA Presidential nominee Ram Nath Kovind would walk 8 km daily for school". India.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 జూలై 2017. Retrieved 25 జూలై 2017.
  11. 11.0 11.1 PTI (19 జూన్ 2017). "Ram Nath Kovind: A crusader for the rights of weaker sections". The Economic Times. Archived from the original on 27 ఆగస్టు 2017. Retrieved 19 జూన్ 2017.
  12. "Bihar governor Ram Nath Kovind: 10 facts about NDA's Presidential nominee – Times of India". The Times of India. Archived from the original on 27 ఆగస్టు 2017. Retrieved 19 జూన్ 2017.
  13. PTI (19 జూన్ 2017). "What you should know about BJP's presidential candidate Ram Nath Kovind". Archived from the original on 18 జూలై 2017. Retrieved 13 మే 2018 – via The Economic Times.
  14. "Ram Nath Kovind, a lawyer who cracked civils but lost 2 elections – Times of India". The Times of India. Archived from the original on 18 జూలై 2017. Retrieved 20 జూన్ 2017.
  15. 15.0 15.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :32 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  16. "Enact tougher laws to prevent crimes against dalits". The Hindu. Archived from the original on 4 అక్టోబరు 2011. Retrieved 13 మే 2018.
  17. "Ram Nath Kovind, a lawyer who cracked civils but lost 2 elections". Times of India. 20 జూన్ 2017. Archived from the original on 18 జూలై 2017. Retrieved 24 జూలై 2017.
  18. "Ram Nath Kovind is BJP's choice for president: All you need to know about the Dalit leader from UP". Firstpost. 20 జూలై 2017. Archived from the original on 24 జూలై 2017. Retrieved 13 మే 2018.
  19. "Ramnath Kovind Profile". Outlook (in Indian English). 19 జూన్ 2017. Archived from the original on 27 ఆగస్టు 2017. Retrieved 20 జూన్ 2017.
  20. PTI (8 ఆగస్టు 2015). "Ram Nath Kovind, Acharya Dev Vrat appointed as Bihar and Himachal Pradesh governors". Archived from the original on 27 ఆగస్టు 2017 – via The Economic Times.
  21. "36th Governor of Bihar". indiatoday (in Indian English). 16 ఆగస్టు 2015. Archived from the original on 17 ఆగస్టు 2015. Retrieved 16 ఆగస్టు 2015.
  22. PTI (19 ఆగస్టు 2015). "PM Modi praises new Bihar Governor Ram Nath Kovind". Archived from the original on 27 ఆగస్టు 2017. Retrieved 13 మే 2018 – via India TV News.
  23. IANS (19 జూన్ 2017). "Presidential Election 2017: Nitish Kumar praises Ram Nath Kovind, remains mum on party support". Archived from the original on 29 జూలై 2017. Retrieved 13 మే 2018 – via First Post.
  24. "Resignation as Governor of Bihar". firstpost (in Indian English). 20 ఆగస్టు 2015. Archived from the original on 27 ఆగస్టు 2017. Retrieved 20 ఆగస్టు 2015.
  25. "Ram Nath Kovind is the 14th President of India". The Hindu (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2017. Retrieved 20 జూలై 2017.
  26. "With 65 percent votes, Kovind sweeps elections". Times of India. 21 జూలై 2017. Archived from the original on 21 జూలై 2017.
  27. "Kovind first President from Sangh, cross-voting boosts margin". Times of India. 21 జూలై 2017. Archived from the original on 23 జూలై 2017. Retrieved 23 జూలై 2017.
  28. http://www.thehindu.com/news/national/live-updates-president-swearing-in-ceremony/article19357489.ece?homepage=true
  29. "Ram Nath Kovind takes oath as India's 14th President". indtoday.com. 25 జూలై 2017. Archived from the original on 28 జూలై 2017.
  30. "Press Information Bureau". Archived from the original on 5 అక్టోబరు 2017. Retrieved 4 అక్టోబరు 2017.
  31. "Press Information Bureau". Archived from the original on 5 అక్టోబరు 2017. Retrieved 4 అక్టోబరు 2017.
  32. "Press Information Bureau". Archived from the original on 6 అక్టోబరు 2017. Retrieved 5 అక్టోబరు 2017.
  33. "Press Information Bureau". Archived from the original on 6 అక్టోబరు 2017. Retrieved 5 అక్టోబరు 2017.
  34. "Press Information Bureau". Archived from the original on 6 అక్టోబరు 2017. Retrieved 5 అక్టోబరు 2017.
  35. 35.0 35.1 "President Kovind meets Mauritius counterpart in Port Louis | DD News". www.ddinews.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2018-03-12.
  36. "President of India reached Mauritius; Addresses students at Mahatma Gandhi Institute; says India's aspiration is for Mauritius to rise as a leading Economy and a voice for peace and stability in the entire Indian Ocean Region". pib.nic.in. Retrieved 2018-03-12.
  37. Roche, Elizabeth (2018-04-05). "President Ram Nath Kovind to visit Africa in bid to bolster ties". livemint.com/. Retrieved 2018-04-13.
  38. "President Ram Nath Kovind to reach Swaziland today". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-04-09. Retrieved 2018-04-13.
  39. Chaudhury, Dipanjan Roy (2018-04-05). "President Ram Nath Kovind embarks on third official foreign trip". The Economic Times. Retrieved 2018-04-13.
  40. "President Kovind arrives in Lusaka, accorded ceremonial reception". www.aninews.in (in ఇంగ్లీష్). Retrieved 2018-04-13.

బయటి లంకెలు మార్చు

రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
కేసరీనాథ్ త్రిపాఠీ
బీహార్ గవర్నర్
2015–2017
తరువాత వారు
కేసరీనాథ్ త్రిపాఠీ
అంతకు ముందువారు
ప్రణబ్ ముఖర్జీ
భారత రాష్ట్రపతి
2017–2022 | style="width: 30%; text-align: center;" rowspan="1"|తరువాత వారు
ద్రౌపది ముర్ము