భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములను ప్రస్థానత్రయం అంటారు.

ఇందులో భాగాలు

మార్చు
  1. భగవద్గీత - 18 అధ్యాయములు (అర్జున విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన, కర్మ సన్యాస, ధ్యాన, ఆత్మ సంయమ, అక్షర పరబ్రహ్మ, రాజవిద్యా రాజగుహ్య, విభూతి, విశ్వరూప సందర్శన, భక్తి, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దైవసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ, మోక్ష సన్యాస యోగములు)
  2. దశోపనిషత్తులు (ఈశ, కఠ, కేన, మున్డక, ఐతరేయ, ప్రశ్న, ఛాందోగ్య, బృహదారణ్యక, మాండూక్య, తైత్తరీయ)
  3. బ్రహ్మ సూత్రములు (వేదవ్యాసులు పైన పేర్కొనిన ఉపనిషత్తులు, గీతల యొక్క సారాంశమును 555 సూత్రములుగ వ్రాసినారు)

శంకరభగవత్పాదులు పైన తెలిపిన ప్రస్థానత్రయానికి సంస్కృతములో భాష్యము (వ్యాఖ్యానములు) వ్రాసినారు. ఆ తర్వాత ఆయన శిష్యులకు, విమర్శకులకు ఈ భాష్యమే మూలగ్రంధంగా విరాజిల్లుతోంది.

వివరణ

మార్చు

ఎవరైతే తన జీవితకాలంలో శాస్త్రములో తెలిపిన విధముగా బ్రాహ్మణిష్ఠ (అనగా బ్రహ్మము కాక ఈ జగత్తులో మరియొకటి లేదని నిశ్చయముతో వున్న), శ్రోత్రియుడు (అనగా శ్రుతి తాత్పర్యము నెరిగినవాడు) అయిన ఒక గురువును ఆశ్రయించి, ఆ గురువు వద్ద ' ప్రస్థానత్రయం 'ను అభ్యసించునో ఆతడు సద్యోముక్తి పొందునని శాస్త్ర ప్రమాణం. అనగా చతుర్విధ పురుషార్ధాలు అయిన ధర్మ, అర్థ, కామ, మోక్ష అను నాలుగు పురుషార్థాల లోని చివరదయిన మోక్షం (సద్యో మోక్షం) అను పరమ పురుషార్ధమును పొందుదురని శాస్త్ర ప్రమాణం. సద్యో మోక్షం అనగా జీవించి ఉన్నపుడే బంధ విముక్తి. కాని యెప్పుడో పొందేది కాదు. మున్డకోపనిషత్తు లోని రెండవ ఖండము - 12 వ మంత్రము ( పరీక్షలోకాన్ కర్మచితాన్...) దీనికి ప్రమాణము.

వ్యాఖ్య

మార్చు

గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానం దర్శనమయ్యింది.అజ్ఞానంతో అంధకారంలో పడి కొట్టు మిట్టాడే వారికి. అహంకారం అనే చక్రంలో పడి గిర గిరా తిరిగే వారికి. "అతితీర్శతామ్ తమోంధమ్" గాఢమైన చీకటిలో ఆత్మేమిటో పరమాత్మేమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడి కొట్టుకునే వారిని కూడా తరింపజేయటానికి వచ్చినటువంటి గురువు. ఉపదేశం గ్రంథం ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి, జ్ఞానులని ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసే ఉపదేశం తప్పకుండా తరింపజేస్తుంది. అందులో సందేహం లేదు అజ్ఞానులని కూడా జ్ఞానులుగా, భగవంతుని పరికరాలుగా తీర్చి దిద్దే మహోపదేశాన్ని గురువు. మనకి ఉపదేశించారు. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, ... ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని చేసిన ఉపదేశం ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది కానీ ఆకాన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కన్పింపజేసేట్టుగా మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురునిచ్చే దీపం కావాలి. అనాదిగా అంటి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్క లేనన్ని పేరుకొని ఉన్నాయి. మనలో జ్ఞానం సహజంగానే ఉంది కానీ, ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని తోడుగా ఇచ్చి పైకి తెస్తారు. ఇదివరకు మనల్ని అడ్డే పొరలని దాటి వచ్చే శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేమి కర్మ వాసనలు తొలగుతాయి. "అధ్యాత్మ దీపమ్", దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు, వేదముల సారాంశం. అది ఎంత గొప్పదైనా వేదాన్ని అనుసరించేదే కావాలి, అప్పుడే ప్రమాణయోగ్యం. అట్లాంటి దాన్నే ఉపదేశం చేసాడు. వేదం రెండు భాగాలు. పూర్వ భాగం మనం చేసే కర్మలని ప్రతిపాదిస్తుంటుంది. రెండవది మనకి ఆనందాన్ని కలిగించే బ్రహ్మ తత్వాన్ని తెలుపుతుంది. ఇవి రెండు ఒకటే శాస్త్రం. బ్రహ్మ అనేది తెలియాల్సిన తత్వం, అది తెలిసిన తర్వాత ఆ తత్వన్ని ఎట్లా పొందాలో తెలుపుతుంది రెండూ ఒకటే. కనుక ఆరాధన స్వరూపాన్ని ఒకటి ఆరాధ్య స్వరూపాన్ని ఒకటి తెలుపుతుంది. రెండు కలిపి అది వేదం.

ప్రస్థాన త్రయం అంటే "భగవద్గీత ,ఉపనిషత్తులు ,బ్రహ్మ సూత్రాలు " . అంతే కాదు " భగవద్గీత ,బైబిల్ ,ఖురాను కూడా"

—వివేకానందుడు

ఇవి కూడా చూడండి

మార్చు

సూచికలు

మార్చు

యితర లింకులు

మార్చు