వికీపీడియా:శైలి

(వికీపీడియా:Manual of Style నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:STYLE
వికీపీడియా శైలి సహాయం

శైలి
వ్యాస పరిచయం
భాష
మార్గదర్శక, విధాన నిర్ణయాలు
సినిమా వ్యాసం

దిద్దుబాటు మార్గదర్శకాలు

వర్గీకరణ
వ్యక్తుల వర్గీకరణ
మూలాలను పేర్కొనడం
బయటి లింకులు
నామకరణ పద్ధతులు
జాబితాలు
మొలకలు

ఇతర మార్గదర్శకాలు

పదకోశం
దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి
నామకరణ పద్ధతులు
బొమ్మల పాఠం
విభాగం

రచనలను ఒక క్రమపద్ధతిలో, చదవడానికి వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ శైలి మాన్యువల్‌. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పద్ధతి ఇతర పద్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తే, వికీపీడియా చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం:

ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి.

వ్యాసం పేరు మార్చు

ప్రధాన వ్యాసం: నామకరణ విధానం

వీలయినంత వరకు వ్యాసం పేరు ఆ వ్యాసం మొదటి వాక్యం లోనే వచ్చేలా ఉండాలి. పేరు మొదటిసారి వ్యాసంలో కనిపించేటపుడు, దానిని బొద్దుగా చెయ్యండి. ఉదాహరణ చూడండి: '''వ్యాసం పేరు''' ఇది ఇలా కనిపిస్తుంది వ్యాసం పేరు. పేరులో లింకులు పెట్టరాదు.

పేరును ఇటాలిక్స్‌ లో పెట్టదలిస్తే, పేరు మొత్తాన్ని పెట్టాలా లేక కొంత భాగాన్ని మాత్రమే పెట్టాలా అనే విషయమై ఇటాలిక్స్‌ నియమాలను పాటించండి.

ప్రవేశిక మార్చు

వికీపీడియా వ్యాసంలో ప్రవేశిక (పరిచయం లేదా ఉపోద్ఘాతం) విషయసూచికకు, పేజీ శీర్షికకు ముందు వస్తుంది. ఇది వ్యాసానికి పరిచయంగానూ, వ్యాసంలోని అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారాంశం గానూ ఉపయోగపడుతుంది. ఇది వార్తా కథనాల శైలిలోని లీడ్ పేరాగ్రాఫ్ కాదు. ప్రవేశిక, వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో తటస్థ దృక్కోణంతో రాయాలి.

మందార మకరంద మాధుర్యమును బోలు అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో చక్కటి తెలుగు పదాలతో వ్యాసం రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంబించండి. తెలుగు వికీపీడియాలోని వ్యాసాలు తెలుగు భాషలోనే రాయాలి,కానీ ఆంగ్లంలో, లేదా ఏ ఇతర భాషలలో రాయటం సమంజసం కాదు. మా, మన అనే పదాలు లేదా అక్షరాలు ఉపయోగించరాదు.ఉదా:మా ఊరు, మా జిల్లా, మన ప్రాంతవాసులు మొదలగునవి.

వ్యావహారిక భాషలో రాయండి.
సరళ గ్రాంథికంలో రాయవద్దు. ఉదాహరణకు.. "వెళ్ళుచుండెను" "వెళ్ళుచున్నాడు" "వెళ్తున్నాడు" వంటి క్రియాప్రయోగాలు భాషలో ఉన్నాయి. మొదటి రెండు ప్రయోగాలు గతకాలపు రచనల్లో కనిపిస్తాయిగానీ, ఇప్పటి రచనల్లో వాడుకలో లేదు. వికీపీడియా వ్యాసాల్లో కూడా అలాంటి ప్రయోగాలు ఉండకూడదు.
ము, అనుస్వారాల (సున్నా) వాడుకలో వికీపీడియా విధానం
ము తో అంతమయ్యే పదాల విషయంలో ము స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ప్రపంచము, అంధకారము, అనికాక ప్రపంచం, అంధకారం అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం లుప్తమైపోయి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో లు చేరుతుంది. విధానం అనే పదానికి బహువచన రూపం విధానాలు అవుతుంది. (వికీపీడియా:శైలి/అనుస్వారం సమస్య పేజీలు)
అతిశయోక్తులు, పొగడ్తలు వాడవద్దు
అద్భుతం, అపురూపం, అనిర్వచనీయం వంటి అలంకారిక శైలిలో కాకుండా వాస్తవాలపై ఆధారపడి రాయండి. మీరు ఎంచుకున్న అంశం గురించి అటువంటి భాష ఎవరైనా పరిశోధకుడు వాడివుంటే, ఫలానా పరిశోధకుడు "అతనిది ఫలానా రంగంలో అద్వితీయమైన కృషి" అని పేర్కొన్నాడు అని మూలాల మీద ఆధారపడి రాయండి.

వ్యక్తుల పేర్లు మార్చు

వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు కింది పద్ధతులను పాటించాలి.

 • బాగా ఎక్కువగా వాడుకలోనున్న పేరును వాడాలి. ఉదాహరణకు విజయవాడను బెజవాడ అని కూడా అంటారు. కానీ, విజయవాడ అనే పేరే ఎక్కువగా వాడుకలో ఉంది కనుక అదే వాడాలి.
 • ఒక్కోసారి రెండు పేర్లు కూడా బాగా వ్యాప్తిలో ఉండవచ్చు; ఆ సందర్భాల్లో ఏది వాడాలనే విషయమై సందిగ్ధత రావచ్చు. ఉదాహరణకు, నందమూరి తారక రామారావు విషయంలో, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు అనే రెండు పేర్లూ ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అప్పుడు ఒక పేరుతో పేజీ సృష్టించి, దానిని లక్ష్యంగా చేసుకుని రెండవ పేరుతో ఒక దారిమార్పు పేజీని సృష్టించాలి.
 • పేర్ల చివర ఉండే సాంప్రదాయక/కుల సూచికలు: పేర్లకు చివర ఉండే రావు, రెడ్డి, శాస్త్రి, మాదిగ, నాయుడు, చౌదరి పేర్లను వ్యక్తి పేరుతో కలిపి రాయాలా లేక విడిగా రాయాలా అనే విషయమై కింది విధానం పాటించాలి.
  • వ్యక్తి పేరు, కులసూచికను కలిపి రాయాలి, ఉదాహరణకు: రామారావు, సీతారామరాజు, చంద్రశేఖరశాస్త్రి, కృష్ణమాదిగ, రాజశేఖరరెడ్డి.
  • ఇంటి పేర్లను ఎల్లప్పుడూ విడిగానే రాయాలి.

గమనిక: ఏ పేరు వాడాలనే విషయంలో సందిగ్ధత ఉంటే ఒకపేరుతో పేజీ సృష్టించి, రెండో దానితో దారిమార్పు పేజీని సృష్టించండి.

 • పొడి అక్షరాలు రాసేటపుడు ఇలా రాయాలి:
ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)

గౌరవ వాచకాలు మార్చు

వ్యక్తుల గురించి రాసేటపుడు, శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. వచ్చారు, అన్నారు, చెప్పారు వంటి పదాలను కాక వచ్చాడు, అన్నాడు, చెప్పాడు అని రాయాలి.

తేదీలు, సమయం, కాలం మార్చు

తేదీ ఆకృతి మార్చు

తేదీ ఆకృతి తెలుగు భాషకు సహజమైన yyyy month dd రూపంలో రాయాలి. ఉదాహరణకు, 1980 మే 12న అని రాయాలి. ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడండి.

శకం మార్చు

సా.శ. (సామాన్య శకంకి పొడి అక్షరాల రూపం), సా.శ.పూ. (సామాన్య శక పూర్వంకి పొడి అక్షరాల రూపం) అన్నవి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వానికి బదులుగా వినియోగించడం అలవాటు చేసుకోవాలి. అయితే క్రీ.శ., క్రీ.పూ. అన్నది పూర్తిగా శైలి విరుద్ధం కాదు. క్రీ.శ., క్రీ.పూ. అన్న పద్ధతి నుంచి ఏదైనా వ్యాసంలో సా.శ., సా.శ.పూ. పద్ధతిలోకి మార్చదలుచుకుంటే వ్యాసం మొత్తంలో ఈ మార్పులు చేయండి. వ్యాసంలో కొంత ఒక పద్ధతిలో, కొంత మరో పద్ధతిలో ఉండడం ఆమోదయోగ్యం కాదు. ఆంగ్ల అక్షరాల్లో కానీ, తెలుగు లిపిలో కానీ బీసీ, ఏడీ, సీఈ, బీసీఈ వంటివి నేరుగా రాయడం శైలీ విరుద్ధం.

నెలల పేర్లు మార్చు

ఇంగ్లీషు నెలల పేర్లను తెలుగు సహజమైన అజంత రూపంలో రాయాలి. ఏప్రిల్ జూన్ నెలలు దీనికి మినహాయింపు. నెలల పేర్లు ఇలా ఉండాలి: జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడండి.

కొలమానాల పొట్టి పదాలు మార్చు

కిలోమీటర్లు వంటి కొలమానాల పొట్టి పదాలను కింది విధంగా రాయాలి కిలోమీటర్లు: కి.మీ. మీటర్లు: మీ. లీటర్లు: లీ. మిల్లీ లీటర్లు:మి.లీ. మిల్లీ మీటర్లు: మి.మీ.

గమనిక: పొట్టిపదాల్లో చుక్కలున్నాయి. చుక్క ముందు, తరవాతా కూడా స్పేసు ఇవ్వలేదు. ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడండి.

అతడు, అతను, ఆయన, ఆమె, ఈమె మార్చు

వ్యాసాల్లో నిష్పాక్షికత కోసం ఏకవచనాన్ని వాడాలని నియమం ఉంది. చేశారు, వచ్చారు అన్న రూపాలు కాక చేశాడు, వచ్చాడు అన్న రూపాలు వాడాలి. వ్యక్తిని ఉద్దేశించే సర్వనామాల విషయంలో వికీ విధానం కింది విధంగా ఉండాలని సముదాయం చర్చించి నిర్ణయించింది.

 • పురుషుడిని ఉద్దేశించినపుడు "అతను", "ఇతను" లను వాడాలి. "అతడు", "ఇతడు", "ఆయన", "ఈయన", "వారు", "వీరు" అని వాడరాదు.
 • స్త్రీని ఉద్దేశించినపుడు "ఆమె", "ఈమె" లను వాడాలి.

విభాగాలు, శీర్షికలు మార్చు

ప్రధాన వ్యాసం: శైలి మాన్యువల్‌

విభాగాల శీర్షికల కొరకు == వాడండి, ''' (బొద్దు) వాడవద్దు. ఉదాహరణ:

==ఇది విభాగం శీర్షిక==

ఈ వాక్యం ఇలా కనపడుతుంది..

ఇది విభాగం శీర్షిక

శీర్షికలను ఇలా పెడితే, విషయ సూచిక ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. అభిరుచులలో నిశ్చయించుకోవడం ద్వారా విభాగాలకు సంఖ్యలు వచ్చే విధంగా చేసుకోవచ్చు. శీర్షికల వలన వ్యాసాన్ని చదవడం తేలికగా ఉంటుంది.

 • ఓ పేజీలో ఉండే విభాగాల శీర్షికల పేర్లన్నీ దేనికదే ప్రత్యేకంగా ఉండేలా పెట్టండి. తద్వారా విభాగం లింకును నొక్కినపుడు సరైన విభాగానికి వెళ్ళే వీలుంటుంది.
 • శీర్షికలలో లింకులు పెట్టవద్దు. మరీ ముఖ్యంగా శీర్షికలో కొంత భాగానికి లింకు అసలే పెట్టవద్దు.
 • మరీ ఎక్కువగా ఉప శీర్షికలు పెట్టవద్దు.
 • శీర్షికలో బొమ్మలు పెట్టవద్దు.
 • <math> మార్కప్ పెట్టవద్దు.
 • శీర్షికలో మూలాలను చేర్చవద్దు.
 • శీర్షికలో మూసలను చేర్చవద్దు.
 • శీర్షికను సృష్టించడానికి వివరణల జాబితాను సృష్టించేందుకు వాడే (";") ను వాడవద్దు.

సాంకేతిక సమస్యలు తెలెత్తకుండా ఉండేందుకు ఈ సాంకేతిక పరిమితులు అవసరం. స్థానిక ఏకాభిప్రాయం ద్వారా వీటిని అతిక్రమించే వీలు లేదు.

ఒక ఏకరూప శైలి కోసం, విభాగాల శీర్షికలు ఇలా ఉండాలి:

 • శీర్షికలో పేజీ విషయాన్ని ప్రస్తావించరాదు. ఉదాహరణకు "తొలి జీవితం" అనాలి, "అల్లూరి సీతారామరాజు తొలి జీవితం" అనో "అతని తొలి జీవితం" అనో అనకూడదు.
 • మాతృశీర్షికను పేర్కొనకూడదు - అలా చేస్తే మరింత స్పష్టత ఏర్పడితే తప్ప.
 • శీర్షికలకు సంఖ్యలు ఇవ్వరాదు.
 • ఒక ప్రశ్నలా గా ఉండకూడదు. ఉదాహరణకు "భాషలు" అని ఉండాలి గానీ, "భారతదేశంలో ఏయే భాషలు మాట్లాడతారు?" అని ఉండకూడదు.
 • రంగులు వాడరాదు. సాధారణంగా వాడని ఫాంట్లను వాడరాదు. వాటివలన యాక్సెసిబిలిటీ ఇబ్బందులు కలగవచ్చు.
 • మార్కప్‌లో శీర్షికలను ర్యాప్ చెయ్యరాదు. దానివలన అవి కనబడే విధానం చెడిపోతుంది, యాక్సెసిబిలిటీ ఇబ్బందులు కలగవచ్చు.

శీర్షిక ఉన్న పంక్తి లోనే కనబడని వ్యాఖ్యను చేర్చాలంటే దాన్ని == == మార్కప్‌కు లోపలే చేర్చాలి: శీర్షిక ఉన్న పంక్తి లోనే ఉంటూ, [a]

==పర్యవసానాలు<!--ఈ వ్యాఖ్యతో ఇబ్బంది లేదు.-->==

==<!--ఈ వ్యాఖ్యతో ఇబ్బంది లేదు.-->పర్యవసానాలు==
==పర్యవసానాలు==<!--ఈ వ్యాఖ్యతో సమస్య ఎదురౌతుంది.-->

<!--ఈ వ్యాఖ్యతో శీర్షిక పూర్తిగా దెబ్బతింటుంది.-->==పర్యవసానాలు==

సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను శీర్షికకు దిగువన పెడతారు.

విభాగ శీర్షికను మార్చేముందు, దానికి ఈసరికే ఉన్న లింకులను చెడగొడుతున్నారేమో పరిశీలించండి. పాత పేరుకు చాలా లింకులు ఉన్నట్లైతే, ఆ పేరుతో ఒక యాంకరును సృష్టించండి. తద్వారా, పేరు మార్చాక కూడా ఆ లింకులు పనిచేస్తాయి. అలాగే, ఏదైనా విభాగానికి లింకు ఇచ్చేటపుడు, లక్షిత విభాగపు శీర్షికలో, అక్కడికి లింకు ఇచ్చిన వ్యాసాలను పేర్కొంటూ, ఒక కనబడని వ్యాఖ్యను చేర్చండి. దానివలన, ఆ తరువాత శీర్షిక పేరును మార్చినా, ఆ లింకులను సరిచేయవచ్చు. ఈ రెంటినీ చూపించే ఉదాహరణ:

==పర్యవసానాలు{{subst:Anchor|Consequences|reason=పాత పేరు.}}==
<!-- ఈ విభాగానికి [[అల్లూరి సీతారామరాజు]], [[మహాత్మా గాంధీ]] పేజీల నుండి లింకులు ఉన్నాయి. -->

వ్యాసంలో ఇది, ఇలా భద్రపరచబడుతుంది:

==పర్యవసానాలు<span class="anchor" id="Consequences"></span>==
<!-- ఈ విభాగానికి [[అల్లూరి సీతారామరాజు]], [[మహాత్మా గాంధీ]] పేజీల నుండి లింకులు ఉన్నాయి. -->

మూలాలు - విరామ చిహ్నాలు మార్చు

ఇన్‌లైనులో మూలాలను ఉల్లేఖించేందుకు, గమనికలను చేర్చేందుకూ Ref ట్యాగులు (‎<ref>...‎</ref>) వాడతారు. ref ట్యాగులన్నీ పాఠ్యానికి వెనువెంటనే ఆనుకుని, స్పేసు లేకుండా ఉండాలి.[b] పాఠ్యంలో మూలాన్ని చేర్చే దగ్గర విరామ చిహ్నమేమైనా ఉంటే Ref లను ఆ విరామ చిహ్నం తరువాత చేర్చాలి తప్ప, ముందు చేర్చకూడదు (కింద చూపిన కొన్ని మినహాయింపులున్నాయి). పక్కపక్కనే ఉన్న ref ట్యాగుల మధ్య స్పేసు ఉండరాదు. అలాగే ref ట్యాగుకు, ఏవైనా శుద్ధి మూసలకూ మధ్య కూడా స్పేసు ఉండకూడదు.

ref ట్యాగులను వాడినపుడు, తప్పనిసరిగా మూలాల జాబితా మూసను చేర్చాలి. సాధారణంగా దీన్ని, వ్యాసానికి దిగువన ఉండే మూలాలు విభాగంలో చేర్చుతారు.

 • ఉదాహరణ: ఎగరలేని పక్షులకు ఛాతీ చిన్నగాను,[10] రెక్కల ఎముకలు, అంతే పరిమాణంలో ఉండే ఎగిరే పక్షుల ఎముకల కంటే చిన్నవిగాను ఉంటాయి. [11][12]

మినహాయింపులు: Ref ట్యాగులను డ్యాష్‌ల తరువాత పెట్టాలి, ముందు కాదు. మూలం బ్రాకెట్లలోని సమాచారానికి సంబంధించినదైతే, ref ట్యాగును మూసే బ్రాకెట్టు కంటే ముందు పెట్టాలి.

 • ఉదాహరణ: పారిస్, ఇంగ్లాండుకు రాజధాని కాదు – దాని రాజధాని లండన్[10] – అది ఫ్రాన్సు రాజధాని.[11] అది అందమైన నగరంగా ప్రసిద్ధి చెందింది.[12]మూస:Primary source inline
 • ఉదాహరణ: కిం జోంగ్ ఉన్ (కొరియా భాష: 김정은;[10] హంజా: 金正恩[11]) ఉత్తర కొరియా నేత. అతను కొరియా కార్మిక పార్టీకి నేత కూడా.[a]

ఇటాలిక్స్‌ మార్చు

ఈ విధంగా రాయాలి: ''. ఉదాహరణ:

''ఇది ఇటాలిక్‌.''

ఇది ఇలా కనిపిస్తుంది

ఇది ఇటాలిక్‌.

కొన్ని పదాలను నొక్కి చెప్పేందుకు ఇటాలిక్స్‌ ను వాడతాము. ఈ కింది సందర్భాలలో కూడా వీటిని వాడవచ్చు.

శీర్షిక పేరు మార్చు

కింది వాటి పేర్లకు ఇటాలిక్స్‌ ను వాడాలి:

 • బాక్టీరియా, జెనస్‌-స్పీసీస్‌ గా రాసినపుడు. ఉదాహరణకు: బాసిల్లస్‌ సబ్టైలిస్‌
 • పుస్తకాలు
 • కంప్యూటరు, వీడియో గేములు
 • కోర్టు కేసులు
 • సినిమాలు
 • పద్యాలు
 • సంగీత అల్బములు
 • రైలు బళ్ళు
 • సంగీత పదాలు
 • వార్తా పత్రికలు, ఇతర పత్రికలు
 • నాటకాలు
 • ఓడలు
 • టెలివిజను ధారావాహికలు
 • కళా రూపాలు

సాధారణంగా పెద్ద వాటికి ఇటాలిక్స్‌ ను వాడతారు. చిన్న వాటికి డబల్‌ కొటేషను గుర్తులు వాడాలి. ఉదాహరణకు:

 • వ్యాసాలు
 • పుస్తకం లోని అధ్యాయాలు
 • టెలివిజను ధారావాహికలోని ఒక భాగం
 • చిన్న పద్యాలు
 • చిన్న కథలు
 • పాటలు

కొన్ని సందర్భాలలో పేర్లు ఇటాలిక్స్‌ లో గాని, డబల్‌ కొటేషను గుర్తుల్లో గాని ఉండకూడదు. అవి:

 • పురాతన శాసనాలు
 • చట్టపరమైన, రాజ్యాంగ పరమైన దస్తావేజులు

పదాల్లాగా పదాలు మార్చు

పదాల గురించి పదాల లాగా, అక్షరాల గురించి అక్షరాల లాగా రాస్తున్నపుడు ఇటాలిక్స్‌ వాడండి. ఉదాహరణకు:

 • స్నానం చేసి అనే రెండు పదాలతో కూడిన క్రియను ఒకే పదంగా - స్నానించి అని ప్రయోగించాడు, వడ్డెర చండీదాస్‌.
 • అక్షరం యొక్క ఉపయోగం క్రమేణా తగ్గిపోతుంది.

అరువు పదాలు మార్చు

ఇతర భాషల నుండి తెలుగులోకి తెచ్చిన పదాలను ఇటాలిక్స్‌ లో రాయాలి. అయితే తెలుగులో ఒదిగిపోయిన రైలు వంటి పదాలకు ఇటాలిక్స్‌ వాడరాదు. ఇటాలిక్స్‌ అనే పదాన్ని గమనించండి, ఇది ప్రతిచోటా ఇటాలిక్స్‌ లోనే ఉంది. ఆది అరువు పదం కనుక అలా ఉంది. గొప్ప వ్యాసం రాయడం ఎలా ప్రకారం, ఇతర భాషా పదాలు అరుదుగా, వేరే పదం లేనప్పుడు మాత్రమే వాడాలి.

సూక్తులు, సుభాషితాలు, ఉటంకింపులు, ఉదహరింపులు మార్చు

వ్యాఖ్యలను ఉదహరించేటపుడు ఇటాలిక్స్‌ వాడవలసిన పని లేదు, ఆ వాక్యాలకు ప్రత్యేకంగా అవసరమైతే తప్ప.

వ్యాకరణ చిహ్నాలు మార్చు

మామూలుగా వ్యాకరణ చిహ్నాలను ఎలా వాడుతామో అలాగే వాడండి.

కొటేషను గుర్తులు మార్చు

సాధారణంగా డబల్‌ కొటేషను గుర్తులను వాడండి—చదివేటపుడు సులభంగా ఉంటుంది. — కొటేషన్ల లోపల కొటేషన్లు అవసరమైనపుడు సింగిలు కొటేషను గుర్తులను వాడండి.

గమనిక: ఏదైనా పదం 'ఇలా' సింగిలు కొటేషను గుర్తుల్లో ఉంటే, అన్వేషణ జరిపేటపుడు సింగిలు కొటేషను గుర్తులను కూడా ఆ పదంలో భాగంగానే గుర్తిస్తుంది. అన్వేషణలో పదంతో పాటు కొటేషన్లను కూడా ఇస్తేనే, ఆ పదాన్ని పట్టుకుంటుంది. డబల్‌ కోట్లను వాడటానికి ఇది మరో కారణం, ఎందుకంటే, దాని విషయంలో ఈ ఇబ్బంది రాదు.

ఇతరత్రా.. మార్చు

ఈ పేజీలో మీకు అవసరమైనది దొరక్కపోతే మార్చు

ఈ పేజీలో శైలికి సంబంధించి మీకు అవసరమైన సమాచారం దొరక్కపోతే, మీకు నచ్చిన వ్యాసం ఒకదానికి వెళ్ళి, దాని మార్చు పేజీకి వెళ్ళండి. అక్కడ రచయితల శైలి ఎలా ఉందో చూడండి. తరువాత పేజీని భద్రపరచకుండా వదిలేయండి. దాదాపు ప్రతీ వ్యాసాన్ని కూడా మెరుగుపరచవచ్చు.

అతిగా అలంకరణ కూడదు మార్చు

మీ వ్యాసంలో మరీ ఎక్కువ మార్కప్‌ లను వాడకుండా ఉంటే మీకు, వ్యాసం చదివేవారికి కూడా సులభంగా ఉంటుంది. మీరు వ్యాసంలో పెట్టిన మార్కప్‌ అంతా వ్యాసంలో కనపడుతుందని అనుకోకండి. మార్కప్‌ లను అవసరమైన మేరకే - వ్యాసాన్ని సులభంగా చదవటానికి అవసరమైనంత వరకే - వాడండి. అతిగా వాడి, క్లిష్టతరం చెయ్యవద్దు. HTML, CSS మార్కప్‌ లను తక్కువగా వాడండి. విజ్ఞాన సర్వస్వం ఉపయోగకరంగా ఉండాలనేది మొదటి లక్ష్యమైతే, దానిలో దిద్దుబాట్లు చెయ్యడం సులభంగా ఉండటమనేది మరో ముఖ్య లక్ష్యం.


మరీ నిర్దుష్టంగా, float లేదా line-height లను వాడితే కొన్ని బ్రౌజర్లు సరిగా చూపించవు.


వ్యాఖ్యానాలను కనపడనీయకండి మార్చు

వ్యాసం అసంపూర్తిగా ఉందనీ, మరింత పని జరగాల్సి ఉందనీ ఎత్తి చూపకండి. అసలు విషయం లేకుండా, ఉత్త శీర్షికలతో పాఠకుడికి ఉపయోగమేమీ ఉండదు.

మామూలు పాఠకుడికి కాకుండా, దిద్దుబాట్లు చేసే సభ్యులకు ఏమైనా సందేశం ఇవ్వదలిస్తే, ఆ సందేశాన్ని కింది గుర్తుల మధ్య పెడితే సరిపోతుంది. <!-- మరియు -->.

ఉదాహరణకు:

హలో <!-- ఇదొక వ్యాఖ్య. --> లోకం

ఇలా కనిపిస్తుంది:

హలో లోకం

వ్యాఖ్య, దిద్దుబాటు చేసే వారికి మాత్రమే కనిపిస్తుంది.

సంబోధన కూడదు మార్చు

విజ్ఞాన సర్వస్వంలోని వ్యాసాల్లో మిమ్మల్ని గాని, పాఠకుడిని గాని మీరు సంబోధించరాదు. అంటే - నేను, మేము, మీరు, మనం వంటి పదాలు రాకూడదు. ఉదాహరణకు నేను అనుకునేదాని ప్రకారం.., దాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు.. వంటి వాక్యాలు రాయకూడదు.

ఇంకా చూడండి మార్చు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు