ప్రాకృతం

ప్రాకృతం అనేది మధ్య యుగాల నాటి ఒక భాష

ప్రాకృతం (సంస్కృతం: [prākṛta] Error: {{Lang}}: text has italic markup (help)) అనేది అనేక ఇండో-ఆర్యన్ భాషలలో ఏదైనా ఒకటి కావచ్చును.[1][2]

జైన శాసనాలలో విరివిగా వాడబడిన 'అర్ధమాగధీ' ప్రాకృతాన్ని., ప్రాకృతభాషకి ప్రమాణంగా భావించి., తక్కివాటినన్నిటినీ., దానినుండి వచ్చినవాటిగా పరిగణిస్తారు. ప్రాకృత వ్యాకరణవేత్తలు., అర్ధమాగధీ వ్యాకరణాన్ని నేర్పి., తక్కిన వ్యాకరణలని మొదటిదానితో పోల్చుతారు. [3] థేరవాద బౌద్ధంలో వాడబడిన పాళీ ప్రాకృతాన్ని సంస్కృత వ్యాకరణాలు ప్రాకృతంగా గుర్తించలేదు. చరిత్రలో కనబడే పైశాచీ, వంటి ప్రాకృతాల స్వభావాలు గురించి వనరులు అందుబాటులో లేవు.

భారతదేశాన్ని క్షత్రియులు పాలించినపుడు ప్రాకృతం ఆదరించబడింది, విద్యావంతులభాషగా చెలామణీ అయింది. అయితే, సనాతనులకు మాత్రం అంటరాని భాషగా ఉండింది. అశోకుని శాసనాలే ప్రాకృతానికి సంబంధించిన తొలి ప్రస్తావనలు. థేరవాద బౌద్ధానికి చెందిన పాళీ రచనలు, జైనుల ప్రాకృత గ్రంథాలు, ఆనాటి ప్రాకృత వ్యాకరణాలు, గీతాలు, ఇతిహాసాలు అన్నిటిలోనూ ప్రాకృతం కనిపిస్తుంది.[4] వివిధ ప్రాకృతాలు., వివిధ రాజవంశాలకి., వివిధ మతాలకి., వివిధ సాహితీసంప్రదాయాలకి చెంది ఉన్నాయి. అంతేగాక., ప్రదేశాన్ని బట్టి కూడా ప్రాకృతాలు మారిపోయాయి. ప్రతీ ప్రాకృతానికీ., తనదైన ఒక చరిత్ర ఉంది.

నామశాస్త్రం

మార్చు
 
సా.శ. 3-4 శతాబ్దానికి చెందిన సూర్యప్రజ్ఞాప్తిసూత్ర, జైన ప్రాకృత భాషలో వ్రాయబడింది

మోనియర్ విలియంస్ నిఘంటువు ప్రకారం., ప్రాకృతం అనేది., ప్రకృతి అనే పదం నుండి వచ్చింది. అంటే, 'సహజమైన, సాధారణమైన' అనే అర్థం వచ్చే, ఈ భాష 'సంస్కరింపబడిన' అనే అర్థం వచ్చే సంస్కృతం కన్నా ప్రాచీనమైనదై ఉండాలి. సంప్రదాయికంగా, ఎందరో పరిశోధకులు ఈ విధంగా భావించేవారు. అయితే, తులనాత్మక పరిశీలన ద్వారా చూచినపుడు., పునర్నిర్మించబడిన ఆదిమ-భారత-ఐరోపా భాష కి, ప్రాకృతాలకన్నా సంస్కృతం (ముఖ్యంగా వేద సంస్కృతం) దగ్గరదని నిరూపించబడింది.

గాంధారీ ప్రాకృతం, పైశాచీ ప్రాకృతం వంటివి కేవలం వ్యాకరణవేత్తల ప్రస్తావనల ద్వారా మాత్రమే మనకు తెలుస్తున్నాయి.[ఆధారం చూపాలి] ఉత్తరభారతదేశానికి చెందిన ఆధునిక భాషలన్నీ ప్రాకృతాలనుండి పుట్టినవే.

ప్రాకృత రచనలు

మార్చు

ప్రాకృతములు పలురకములు. షడ్విధములని ఆర్యుల అనుశాసనము. ప్రధానంగా శౌరసేనీ, మాగధి, పైశాచీ, అపభ్రంశములేఅని ప్రాకృత వ్యాకర్తలు పేర్కొన్నారు. కాలక్రమేణ ప్రాంత, జాతీయ విభజన ప్రాకృతములో ఏర్పడి, ప్రాకృత భేదములు ఇరవై ఏడుగా ప్రాకృత చంద్రికా పేర్కొనినది.ఇంత విరివి వైవిధ్యముగల ప్రాకృత వాజ్మయమున ఎంతో విస్తారమయిన రచనలు ఉండుట సుగ్రహమైన మాట. కాని నేడు మన పాలిటికి మిగిలిన సారస్వతము మిక్కిలి తక్కువ. ముద్రిత సారస్వము ఇంకనూ తక్కువ. ముద్రితమైన ప్రాకృత వాజ్మయము లోని వైవిధ్యము సంస్కృతమునకు ఏ మాత్రమూ తీసిపోదు. ప్రాకృత సాహిత్యంలో బాణభట్టు చేత భూషించబడిన మహోన్నత కథాప్రబంధము "బృహత్కధ" బహుళప్రాచుర్యము పొందిన గ్రంథము.ఇందులో ఉదయన మహారాజు తనయుడు నరవాహనదత్తుడు, మదన మంజూషా అను లోకోత్తర సౌందర్యరాశిని వివాహమాడుట, ఆపిదప 26 కన్యలను పెండ్లి చేసుకొనుట ఈ బృహత్కథ ఇతి వృత్తాంతము.ఇది లక్షగాధలతో నిర్మించబడింది.పూర్తిరచన నష్టమయినను, ఈ బృహత్కథ మంగళగాధ మాత్రమే ఇప్పుడు లభ్యమవుచున్నది. ఇది పైశాచీ ప్రాకృతములో రచించడం జరిగింది. దీనినే 6 వ శాతాబ్దములో జైనపత ప్రచారముకొరకు మార్పులు చేర్పులు చేసి వసుదేవ హిండి అను పేరుతో శౌరసేనీ భాషలో వ్రాశాడు.ఇందు భారత, రామాయణ, హరివంస కథలు, జైనతీర్ధంకరుల వృత్తాంతములు చోటుచేసుకున్నవి.ఇది నేడు కొంత అసమగ్రముగ లభ్యమైనది.

విమలసూరి ప్రణీత 'పఉమ చరిత' విక్రమ శకం 100సం. నాటి చక్కని రచన.శారసేనీ ప్రాకృతములో రచించబడింది.రామాయణ కథ ఇందలి ఇతి వృత్తాంతము.చక్కని సూక్తులు, చక్కని వర్ణనలు గలరచన. శ్రీపాద లిప్తాచార్య సహకారంతో ఆంధ్రరాజు రచించిన గాధాకోసం ప్రముఖ ప్రాకృత భాషా శృంగారభరిత ధ్వని రచన.సాహితీ సమరాంగణ సార్వభూముడు భోజదేవుడు తన శృంగార ప్రకాశములో గాథాకోసాన్ని ఉదహరించాడు. కుతూహులుని 'లీలాపది' 1360 గాథల సమాహార ప్రాకృత మహాకావ్యం. విభజన పద్ధతిలేకుండా కులక పద్ధతిలో సాగుతుంది.

హరిభద్రసూరి 'సమరాఇచ్చకహ' గొప్ప ప్రాకృత కథాకావ్యము. అలానే ఈతని శిష్యుడు దాక్షిణ్యచిహ్న బిరుదాంకితుడు ఉద్ద్యోతన సూరి రచించిన చమత్కార కావ్యము 'కువలయ మాలా'. గురువుగారి రచనకు దీటుగా శౌరసేనీ, అక్కడక్కడ సంస్కృతము, అపభ్రంశము, పైశాచినీ వాడెను.

రూపకములు కూడా ప్రాకృతములో ఉన్నాయి. రాజశేఖర మహాకవి 'కర్పూర మంజరీ' తొలి ప్రాకృత భాషా నిబద్ధ నాటిక. పిదప నయచంద్రుని 'రంభానుజ్ఱరి', రుద్రదాసుని 'చంద్రలేఖా' విశ్వేశ్వరుని 'శృంగార మంజరి', ఘన శ్యాముని 'ఆనంద మంజరి' మరికొన్ని ప్రఖ్యాత ప్రాకృత రూపకములు.

నాటక ప్రాకృతాలు

మార్చు
 
ఖరోస్ఠి లిపిలో ఉన్న ప్రాకృత చెక్కడాలు ఉన్న జంట సింహాలు, బ్రిటీషు మ్యూజియంలోని బొమ్మ

నాటకాలు, ఇతర సాహిత్యం కోసం ప్రత్యేకంగా సృష్టించబడినవి, నాటక ప్రాకృతాలు. ప్రాకృతంలో సంభాషణ రాసిన అనంతరమే., పాఠకుని కోసం సంస్కృత అనువాదం ఇవ్వబడుతుంది. ఈ ప్రాకృతాల్లో ఏది., జనాభాష కాలేదు. కానీ., సంస్కృత భాష వినియోగం తగ్గిపోయినపుడు., దాని స్థానంలో వీటిలో కొన్ని చేరి ఉండవచ్చు.[5]

నాటక ప్రాకృతం అనేది., సాధారణంగా మూడు ప్రాకృతాలని సూచిస్తాయి.

అయితే., నాటక ప్రాకృతాలలోనికి పైని భాషలే కాక., మరికొన్ని., ప్రాచ్య, బాహ్లీకీ, దక్షిణాత్య, శకరీ, ఛండాలీ, శబరీ, అభీరీ, ద్రమిలీ, ఓఢ్రీ మున్నగునవి. ఈ ప్రాకృతాలు వాడేందుకు కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటివాటి నేపథ్యాన్ని బట్టి., పాత్రలు వివిధ ప్రాకృతాలు మాట్లాడుతాయి. ఉదాహరణకి, ద్రమిలి అనేది ఆటవికుల భాష; నాయిక, ఆమె స్నేహితురాళ్లది శౌరసేని భాష; పోకిరీలు., మొసగాళ్లు మాట్లాడేది, అవంతీ భాష [6]

ఆధారాలు

మార్చు
 • జాతీయ ప్రాకృత ప్రొరిశోధనలు, అధ్యయన సంస్థ, శ్రావణబెళగొళ కర్నాటక
 • Banerjee, Satya Ranjan. The Eastern School of Prakrit Grammarians : a linguistic study. Calcutta: Vidyasagar Pustak Mandir, 1977.
 • Daniels, Peter T., The World's Writing Systems. USA: Oxford University Press, 1996.
 • Deshpande, Madhav, Sanskrit & Prakrit, sociolinguistic issues. Delhi: Motilal Banarsidass, 1993.
 • Pischel, R. Grammar of the Prakrit Languages. New York: Motilal Books, 1999.
 • Woolner, Alfred C. Introduction to Prakrit, 2nd Edition. Lahore: Punjab University, 1928. Reprint Delhi: Motilal Banarsidass, India, 1999.

మూలాలు

మార్చు
 1. Daniels, p. 377
 2. Woolner, Alfred C. (1928). Introduction to Prakrit. Delhi: Motilal Banarsidass Publ.,. pp. 235. ISBN 9788120801899.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
 3. Woolner, pg. 6
 4. Woolner, Alfred C. (1928). Introduction to Prakrit (2 (reprint) ed.). Delhi: Motilal Banarsidass. pp. 1–2. ISBN 978-81-208-0189-9. Retrieved 17 March 2011.
 5. Woolner, pg. v.
 6. Banerjee, pg. 19-21

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాకృతం&oldid=3506058" నుండి వెలికితీశారు