ప్రాగా టూల్స్ లిమిటెడ్ 1943 మేలో ప్రాగా టూల్స్ కార్పోరేషన్ లిమిటెడ్‌గా ప్రారంభమైంది. సికింద్రాబాదులోని కవాడీగూడ ప్రాంతంలో ప్రధానకార్యాలయం ఉన్న ఈ పరిశ్రమ యాంత్రిక పరికరాలు తయారుచేసేందుకు స్థాపించబడింది. 

ప్రాగా టూల్స్ లిమిటెడ్
प्रागा टूल्स लिमिटेड
తరహాప్రభుత్వరంగ పరిశ్రమ
స్థాపన1943
ప్రధానకేంద్రముసికింద్రాబాదు
పరిశ్రమఇంజనీరింగు
ఉత్పత్తులుయాంత్రిక పరికరాలు
వెబ్ సైటు[1]

1963లో ఈ పరిశ్రమ పేరును ప్రాగాటూల్స్ లిమిటెడ్ గా పేరు మార్చి రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీచేశారు. ముఖ్యంగా సి.ఎన్.సి యంత్రాల వంటి యాంత్రిక పరికరాలు రూపొందించటం ఈ కంపెనీ ఉద్దేశం. 1986లో హెచ్.ఎం.టి సంస్థ ప్రాగా టూల్స్ ను ఒక సామంత పరిశ్రమగా తనతో కలుపుకున్నది. కానీ కొంతకాలం తర్వాత తిరిగి పరిశ్రమల మంత్రిత్వ శాఖ క్రిందికి బదిలీ అయ్యింది. 2015 సెప్టెంబరులో భారత ప్రభుత్వం ప్రాగా టూల్స్ ను మూసివేయటానికి నిశ్చయించింది. ప్రస్తుతం ఇది మూసివేత ప్రక్రియలో ఉన్నది. 

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
  • ప్రాగా టూల్స్ లిమిటెడ్ వెబ్‌సైటు