ప్రాణ్
ప్రాణ్ ఒక ప్రముఖ భారతీయ నటుడు. తనదైన విలక్షణ శైలితో దాదాపు 400 చిత్రాలలో నటించాడు. దాదాపు ఆరు శతాబ్దాలపాటు ఇతని నట జీవితం సాగింది. కొన్ని తెలుగు చిత్రాలలో కూడా ప్రతినాయక పాత్రలను పోషించాడు.
ప్రాణ్ | |
---|---|
![]() 2010 న తన 90వ జన్మదిన వేడుకలలో ప్రాణ్ | |
జననం | ప్రాణ్ క్రిషన్ సికంద్ 1920 ఫిబ్రవరి 12 కొత్త ఢిల్లీ, బ్రిటీష్ ఇండియా |
మరణం | 2013 జూలై 12 ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | (వయస్సు 93)
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1940–2007 |
జీవిత భాగస్వామి | శుక్లా సికంద్ |
పిల్లలు | 3 |
బాల్యం, విద్యాభ్యాసంసవరించు
ప్రాణ్ ఫిబ్రవరి 12, 1920న పాతఢిల్లీలోని బల్లిమరన్ అనే ప్రాంతంలో ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేవల్ క్రిషన్ సికంద్ సివిల్ ఇంజనీరుగా ప్రభుత్వ కాంట్రాక్టరుగా పని చేసేవాడు. ఆయన తల్లి రామేశ్వరి. వారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు.
ప్రాణ్ చిన్నతనంలో చదువులో ముఖ్యంగా గణితంలో మంచి ప్రతిభ కనబరిచాడు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివసించాల్సి రావడంతో ఆయన డెహ్రాడూన్, కపుర్తలా, మీరట్ లాంటి అనేక ప్రదేశాల్లో చదివాడు. చివరగా మెట్రిక్యులేషన్ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో పూర్తిచేశాడు.
పురస్కారములు, గౌరవాలుసవరించు
భారత ప్రభుత్వ పురస్కారములుసవరించు
జాతీయ చలనచిత్ర పురస్కారములుసవరించు
- 2012 – దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం [2]
ఫిలింఫేర్ పురస్కారములుసవరించు
- 1967 – ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు, ఉప్కార్[3] చిత్రం కోసం
- 1969 – ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు, ఆంసూ బన్గయే ఫూల్ చిత్రం కోసం
- 1972 – ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు , బేఇమాన్ చిత్రం కోసం
- 1997 – ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారము
మూలాలుసవరించు
- ↑ Lata, Bismillah Khan get Bharat Ratnas రీడిఫ్.కాం, 25 జనవరి 2001. "The Padma Bhushan...veteran actor Pran,".
- ↑ "Actor Pran to receive this year's Dadasaheb Phalke Award". Times of India. Archived from the original on 2013-06-15. Retrieved 2013-04-12.
- ↑ "PRAN – Awards". Retrieved 2013-04-12.
బయటి లంకెలుసవరించు
Wikimedia Commons has media related to ప్రాణ్.