ప్రాణ్ కిశోర్ కౌల్

కశ్మీరీ నటుడు, నాటక దర్శకుడు, రచయిత

ప్రాణ్ కిషోర్ కౌల్ కాశ్మీరీ రంగస్థల కళాకారుడు. నటనతో పాటు, ఆయన దర్శకత్వం వహించి, స్క్రీన్ ప్లే రాశారు. ఆయన రాసిన షీన్ తు వాతు పోడ్ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.[1] కాశ్మీరీ, భారతీయ కళలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో విస్తృతంగా ప్రయాణించే మిల్త్‌సర్ కాశ్మీర్ మ్యూజిక్ & డాన్స్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు.

ప్రాణ్ కిషోర్ కౌల్ 1991 దూరదర్శన్ టెలివిజన్ సీరియల్ గుల్ గుల్షన్ గుల్ఫామ్ సృష్టికర్తగా ప్రసిద్ధి చెందారు.[2] ఆయన మాంజిరత్ అనే చలన చిత్రం కోసం సిల్వర్ పీకాక్ పురస్కార గ్రహీత కూడా. అతను గత ఐదు దశాబ్దాలుగా కాశ్మీర్ లోయలో జరిగిన ప్రధాన సాంస్కృతిక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించారు, తద్వారా ఈ రంగంలో ప్రత్యేకమైన సహకారం, స్థానం సంపాదించారు. 2018లో కౌల్ కు పద్మశ్రీ పౌర పురస్కారం లభించింది.[3]

మూలాలు

మార్చు
  1. "Pran Kishore Kaul". Radio Kashmir. Archived from the original on 26 October 2008.
  2. "Pran Kishore Kaul".
  3. "Padma awards 2018 announced, MS Dhoni, Sharda Sinha among 85 recipients: Here's complete list". India TV. 25 January 2018. Retrieved 26 January 2018.