ప్రేమ్‌చంద్

హిందీ రచయిత
(ప్రేంచంద్‌ నుండి దారిమార్పు చెందింది)

మున్షి ప్రేమ్ చంద్ (Hindi: प्रेमचंद, Urdu: پریمچںد) (జూలై 31, 1880 - అక్టోబర్ 8, 1936) భారతదేశపు ప్రముఖ హిందీ, ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. ఈయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు.

మున్షి ప్రేం చంద్
పుట్టిన తేదీ, స్థలం(1880-07-31)1880 జూలై 31
లంహీ, వాయువ్య రాష్ట్రాలు, బ్రిటిష్ ఇండియా
మరణం1936 అక్టోబరు 8(1936-10-08) (వయసు 56)
వారణాసి, బ్రిటిష్ ఇండియా సంయుక్త రాష్ట్రాలు, బ్రిటిష్ ఇండియా
కలం పేరునవాబ్ రాయ్
వృత్తిరచయిత, నవలాకారుడు
భాషహిందుస్తానీ (హిందీ - ఉర్దూ
జాతీయతబ్రిటిష్ ఇండియా
గుర్తింపునిచ్చిన రచనలుగోదాన్, బాజార్ ఎ హుస్న్, కర్మభూమి, షత్రంజ్ కే ఖిలాడి
జీవిత భాగస్వామిశివానీదేవి
సంతానంశ్రీపత్ రాయ్, అంరిత్ రాయ్, కమలాదేవి

సంతకం

బాల్యం

మార్చు

ప్రేమ్‌చంద్ 1880, జూలై 31ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి దగ్గర లమ్హీ గ్రామంలో ఒక తపాలా గుమాస్తా అజైబ్ లాల్, ఆయన భార్య ఆనందికి జన్మించాడు. ఆయన తల్లితండ్రులు ఈయనకు ధన్‌పత్ రాయ్ అని పేరుపెట్టారు. ఈయన మామ మహాబీర్, నవాబ్ అని పిలిచేవాడు. నవాబ్ రాయ్ అనే ఈ పేరుతోనే ప్రేమ్‌చంద్ కొన్ని తొలి రచనలు చేశాడు.[1] ప్రేమ్‌చంద్ తల్లితండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో సవతి తల్లి, ఆమె పిల్లల బాధ్యత ప్రేమ్‌చంద్ పై పడింది.

జీవిత విశేషాలు

మార్చు
 
తపాలా బిళ్ళపై ప్రేమ్‌చంద్

సాంఘిక జీవనంలో మనిషి తనాన్ని, మంచి తనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహారచయిత ఉర్దూలో హిందీలో కథలు, నవలలు, సంపాదకీయాలు రాసిన మహానీయుడు, పిల్లల మానసిక ప్రవర్తన గురించి కూడా గొప్ప కథలు రాశాడు. కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేం. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తరువాత కూడా కథలాగా కొనసాగుతుంది. కథలు ఏం చేస్తాయి. కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని కథలు మన కళ్లు తెరిపిస్తాయి. కొన్ని కథలు మన కళ్లల్లో గడ్డకట్టిన కన్నీళ్లని ప్రవహింప చేస్తాయి. మనసు కరిగిపోతుంది. కథల్లో మనకు తెలియని మహాత్తు ఉంది. అది ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకడైన మున్సీ ప్రేంచంద్‌ కథ ‘ఈద్‌ పండుగ’. ఈ కథ చదివిన వ్యక్తుల కళ్లు కూడా ఆ కథలోని హమీద్‌ నానమ్మ అమీనాతో పాటు వర్షిస్తాయి. మనిషిగా ఎలా వుండాలో ఆలోచింప చేస్తాయి. ఈ కథలో ప్రేమా, మానవత్వం అనుబంధం ఎన్నో కలగలిపి ఉంటాయి. అలాంటి కథే ‘ఈద్‌ పండుగ’ మనస్సులని కదిలించే కథ. ప్రేంచంద్‌ రాసిన కథ ల్లో చాలా గొప్ప కథ ‘ఈద్‌ పండుగ’ ఈ కథ ఈద్గా (మసీదు) పేరుతో అనువాదం అయ్యింది.

ప్రేమ్‌చంద్ 1880, జూలై 31వారణాసి దగ్గర కాశికి నాలుగు మైళ్ళ దూరములో ఉన్న లమ్హీ గ్రామంలో ఒక తపాలా గుమాస్తా మున్షీ అజైబ్ లాల్, ఆయన భార్య ఆనందికి జన్మించాడు. ఆయన తల్లితండ్రులు ఈయనకు ధన్‌పత్ రాయ్ అని పేరుపెట్టారు. ఈయన మామ మహాబీర్, ఇతనిని 'నవాబ్' అని పిలిచేవాడు. ఈ పేరుతోనే ప్రేమ్‌చంద్ కొన్ని తొలి రచనలు చేశాడు. ప్రేమ్‌చంద్ తల్లిదండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో సవతి తల్లి, ఆమె పిల్లల బాధ్యత ప్రేమ్ చంద్ పై పడింది. వారి కుటుంబములో ఆరోగ్యము అంతంతమాత్రమే . అనారోగ్యము వారసత్వమూగా అందుకున్నాడు ప్రేమంచంద్ . ఆరోగ్యము సహకరించక, ఉద్యోగములో వస్తున్న తరచూ బదిలీలు భరించలేక ఉద్యోగము మానేసి పూర్తికాలం రచయితగా స్థిరపడ్డాడు .

ప్రేంచంద్ కి బాల్యములోనే వివాహమైంది. కాని అది బలవంతపు వివాహము, అయిష్ట వివాహము అనేవారు. పెద్దలు చేసిన పెళ్ళిని ఆయన అంగీకరించలేదు. ఆమెతో సంసారము చెయ్యలేదు. ఈ లోగా పేపర్లో ఒక ప్రకటన చూశారు . బాల్యములోనే వివాహవైధవ్యము సంభవించిన 11 యేళ్ళ బాలికను వివాహమాడేందుకు అభ్యుదయభావావు కలిగిన యువకుడు కావాలి అనేది ఆ ప్రకటన . అది చూసి ప్రేమ్‌చంద్ స్పందించాడు . తాను చేసుకుంటానని ముందుకు వెళ్ళాడు .. ఆ విధముగా " శివరాణీదేవి "ని ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాడు . తనకు ఇంతకుముందు పెళ్ళి అయిన విషయము చెప్పలేదు. సమాజపు కట్టుబాట్లు తెంచే ప్రయత్నము చేశాడు.

సాహితీ జీవనం

మార్చు

విద్యాశాఖలో ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తూ రచనలు చేస్తూ ఉండేవారు. రచయితగా మంచి గుర్తింపు వచ్చింది . 1920 లో వచ్చిన సహాయనిరాకరణ ఉద్యమంలో గోరఖ్ పూర్ లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై ప్రభుత్వ ఉద్యోగము వదిలేసి పూర్తిస్థాయి రచయితగా ప్రెస్ పెట్టుకొని, పత్రికలు నడుపుతూ జీవితం గడిపేవారు. 250 కథలు, 12 నవలలు రచించాడు .

సమాజములోని లోటుపాట్లను, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను, మూఢనమ్మకాలను నిరసిస్తూ రచనలు చేశాడు . మంచి పేరు ప్రతిస్టలు సంపాదించాడు . రెండవ భార్యకు తన మొదటి వివాహము గురించి తెలిసింది. ఆ విషయము మీద ఇద్దరూ వాదులాడుకున్నారు . వారి సంసారములో వాదులాటలు సామాన్యము అయినా వారిద్దరి మధ్యా ప్రేమ, అనురాగము అధికము . ప్రేంచందను వదిలి శివరాణీదేవి దూరంగా ఉండేందుకు ఒక్క క్షణము ఇష్టపడేదికాదు . ప్రేంచంద్ కూడా అంతే. ఏ మాత్రము నలతగా అనిపించినా ఆమెను పక్కన కూర్చోపెట్టుకొని తన జీవితంలోని విషయాలు ఆమెకు చెపుతుండేవారు. భర్తకున్న అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఆమెకు ఆందోళన కలిగిస్తూఉండేవి . ఎంతో శ్రద్ధ తీసుకొని చూసుకుంటూ తన సాహిత్యసేవా, పత్రిక సేవా నడపడములో సహకరిస్తూ ఉండేవారు.

ప్రేమ్‌చంద్ 1935 లో జ్వరము బాధపడుతూ పత్రికకు సంపాదకీయము రాయడము మొదలు పెట్టగానే భార్య అభ్యంతరము పెట్టింది. అందుకు ఆయన " రాణీ నువ్వు పొరపడుతున్నావు . నేను నాకు నచ్చిన పని చేయుచున్నాను . ఇందులో నాకు ఆనందము దొరుకుతుంది. ఇది ఒకరకమైన మత్తును కలిగిస్తుంది. కాని ఇది చెడుపని కాదు. నేను దీపం వంటి వాడిని ... వెలుతురును ఇస్తాను, ఆ వెలుతురు ఇతరులు లాభానికి వాడుకుంటారో, నష్టపోతారో నాకు సంబంధము లేదు . " అన్న తర్వాత ఇక ఆమె అడ్డు చెప్పలేదు . నాటి నుండి ఆయన ఆరోగ్యము తగ్గడము మొదలు పెట్టింది.

మున్షీ అనే పేరు తడబాటు

మార్చు

అసలు పేరు ధనపత్ రాయ్ శ్రీవాస్తవ అయినప్పటికీ, హిందీ సాహిత్యంలో అతనికి పేరు ప్రేమ్‌చంద్ అనే పేరుతో వచ్చింది. తొలినాళ్ళలో ఉర్దూ రచన చేస్తునప్పుడు నవాబ్ రాయ్ అనే పేరు వాడారు. అతని తండ్రి అజైబ్ రాయ్ ఇంకా తాత గురు సహాయ్ రాయ్. వీటిలో మున్షీ అనే పేరు ఆయన జీవితంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు.

ఆయనకు ఈ పేరు 'హన్స్'(హంస) పత్రికలో పనిచేయడం వల్ల వచ్చింది. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రేమ్‌చంద్‌ ప్రముఖ పండితుడు, రాజకీయ నాయకుడు అయిన కన్హయ్యలాల్ మాణిక్‌లాల్ మున్షీ(కె.ఎం.మున్షీ) తో కలిసి హిందీలో 'హన్స్' అనే ఒక పత్రికను తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ దీనికి సంపాదకులు. కె.ఎం.మున్షీ గారు ప్రేమ్ చంద్ కంటే పేరులో, విషయాల పరిజ్ఞానంలో, వయసులో పెద్ద అవ్వడంతో, పత్రికలో సంపాదకులుగా ప్రేమ్‌చంద్‌ కంటే ముందుగా కె.ఎం.మున్షీ గారి పేరు రాయాలని నిర్ణయించుకున్నారు. అందుకు పత్రిక ముఖచిత్రంలో మున్షీ-ప్రేమ్‌చంద్ అని పడేది.

పత్రిక కొన్నాళ్ళ తరువాత మూతపడినా, హన్స్ పేరు, దాని సంపాదకులు 'మున్షీ-ప్రేమ్‌చంద్' ప్రజలకు బాగానే గుర్తు ఉండారు. తరువాత ప్రేమ్‌చంద్ సొంత రచనల గుండా పెద్ద పేరు తెచ్చుకున్నారు. అటే కె.ఎం.మున్షీ తన సొంత గుజరాతీకి మప్పితం అవ్వడంతో హిందీ సాహిత్య సంఘంలో ఆయన పేరు తగ్గింది. దీని వల్ల 'మున్షీ-ప్రేమ్‌చంద్' అనేది ప్రేమ్చంద్ అనే ఒక్క వ్యక్తి పేరనే అపోహ వచ్చింది.

ఈ అపార్థామే నేటికీ వార్తాపత్రికలలో, పుస్తకాలలో, రకరకాల మాధ్యమాలలో వచ్చేసింది. దీనికి బ్రిటిష్ వారి ఆంక్షల కారణంగా, హన్స్ కాపీలు తేలికగా అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం. కాలక్రమేణా, ప్రేమ్ చంద్ కె.ఎం.మున్షీ కంటే ఎక్కువ ప్రజాదరణ పొంది వారి మున్షీ పేరును గ్రహించాడు. ఇది ప్రేమ్‌చంద్ విజయానికి నిదర్శనంగా కూడా భావించవచ్చు.[2]

అనారోగ్యము, మరణము

మార్చు

1936 లో ' గోదాన్‌ ' అచ్చు అయింది. మంగళసూత్రమనే మరో నవలను ఆలోచిస్తున్నారు. కాని ఆరోగ్యము సహకరించలేదు . తన ఆరోగ్యము వలన భార్య బాధపడుతుందని ఆయనకు దిగులు. రక్తపు వాంతులు అయ్యాయి . ఆమె సుభ్రము చేసింది. పక్కన వచ్చికూర్చుని నుదుటిమీద చెయ్యివేసి ఉంచమని భార్యను కోరాడు . ఆమె కంటనీరుతో అలాగే కూర్చుంది. నీకు తెలియకుండా దాచిన రహస్యాలను చెబుతాను విను. " నా మొదటి వివాహం తర్వాత మరో స్త్రీ నా జీవితం లోకి ప్రవేశించింది. నిన్ను పెళ్ళిచేసుకున్నాక కూడా ఆమెతో నా సంబంధం కొనసాగింది. అలాగే నీకు చెప్పకుండా కొందరికి డబ్బులు ఇచ్చి, ఆ అప్పును తీర్చేందుకు కథలు రాసేవాడిని " ఇలా తాను చేసిన తప్పులను ఒప్పుకోవడము మొదలు పెట్టాడు . నిజానికి అవన్నీ భార్యకు తెలుసు . అయినా ఆయన కోసము వాటిని తెలియనట్టుగానే ఉంది. ఆ విషయము ప్రేంచంద్ కి అర్ధమయ్యేసరికి భార్య శివరాణీదేవి మీద గౌరవం, ప్రేమ పెరిగిపోయింది.

అన్నీ తెలిసి నన్ను నిలదీయని నీ హృదయం ఎంత ఉన్నతమైనదో ఈ రోజు గ్రహించాను . నాకిప్పుడు ఎక్కువ కాలము బ్రతకాలని ఉంది నాకోసము కాదు ... నా భార్యకోసము ... ఆమె మహాత్యాగి . ఆమెతో కలిసి మరికొంతకాలము ఉండాలనివుంది. నన్ను బ్రతికించు . వచ్చే జన్మలో కూడా ఈమెనే నా అర్ధాంగిగా చెయ్యి ... కనీసము నా ఈ చివరి ప్రార్థనన్నా ఆలకించు ... అని తనలోతాను సణుగుతున్నారు. మనము ఎవరికీ ఏ అపకారము చెయ్యలేదు . భగవంతుడు మన మొర తప్పక ఆలకిస్తాడు . రాణీ,, నువ్వు నాపక్కనే ఉండు . ఎక్కడికీ వెళ్ళకు . నువ్వు ఉంటే నాకు ధైర్యముగా ఉంటుంది . నీకు చెప్పాలకున్న విషయాలు పూర్తిగా చెప్పగలుగుతాను. ఇది జరిగిన రెండవరోజూ అంటే 1936, అక్టోబర్ 8 న విరోచనమైంది. రాణి శుభ్రం చేద్దామనుకుంటుండగానే ఆయన శరీరము చల్లబడింది. ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 56 సంవత్సరాలకే ఆ మహా రచయిత జీవితం అంతమైంది.

నవలలు

మార్చు
  • పంచ్ పరమేశ్వర్
  • ఈద్‌గాహ్
  • నషా
  • షత్రంజ్ కే ఖిలాడి
  • పూస్ కి రాత్
  • ఆత్మారామ్
  • బూఢి కాకి
  • బడే భాయిసాహెబ్
  • బడే ఘర్ కి బేటి
  • ఠిక్రి కే రుపై
  • నమక్ కా దారోగా

సినిమాలు , టి.వి.సీరియళ్ళు

మార్చు
  • సద్గతి (1981) టి.వి.
  • షత్రంజ్ కే ఖిలాడి (1977)
  • గోధూళి (1977)
  • ఒక ఊరి కథ ( 1977)
  • గబన్ (1966)
  • సేవాసదన్ (1938) (బాజారే హుస్న్, నవలాధారంగా)
  • మజ్దూర్
  • నిర్మల (టి.వి. 1980)

మూలాలు

మార్చు
  1. Premchand: A Life, Amrit Rai (Harish Tirvedi, translator), People's Publishing House, New Delhi, 1982.
  2. शर्मा, चंदन. "वह गलतफहमी जिसके चलते प्रेमचंद के नाम के आगे मुंशी लग गया". Satyagrah (in హిందీ). Archived from the original on 2022-10-08. Retrieved 2022-10-08.