ప్రేమకు రెయిన్ చెక్

ప్రేమకు రెయిన్ చెక్ 2018లో విడుదలైన తెలుగు సినిమా. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పై ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించాడు. అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తమనం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 23, 2018న విడుదల చేసి,[1] సినిమాను 7 సెప్టెంబర్ 2018న విడుదలైంది.[2]

ప్రేమకు రెయిన్ చెక్
దర్శకత్వంఆకెళ్ల శ్రీనివాస్‌
నిర్మాతఆకెళ్ల శ్రీనివాస్‌
తారాగణంఅభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని , మౌనికా తమనం
ఛాయాగ్రహణంశరత్‌ గురువుగారి
కూర్పుఎస్.ఎస్. సుంకర
సంగీతందీపక్‌ కిరణ్
నిర్మాణ
సంస్థ
స్టోన్‌ మీడియా ఫిలింస్‌
పంపిణీదార్లునార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దేశం భారతదేశం
భాషతెలుగు

రమ్య (ప్రియా వడ్లమాని) ఓ కంపెనీలో పనిచేస్తుంటుంది, నష్టాల్లో ఉన్న ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా వికీ (అభిలాష్) వస్తాడు. కంపెనీలో పని చేస్తున్న రమ్య పని తీరు నచ్చి ఇద్దరు ప్రేమలో పడతాడు.ఈ క్రమంలో రమ్య, వికీ మధ్య తాన్య (మోనికా) ప్రవేశిస్తుంది. వికీ, రమ్య మధ్య తాన్య రావడంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? చివరికి రమ్య, వికీల ప్రేమ గెలిచిందా అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

మార్చు
  • అభిలాష్ వడాడ - వికీ
  • ప్రియా వడ్లమాని - రమ్య
  • మౌనికా తమనం - తాన్యా
  • సుమన్‌ - మిత్ర
  • రఘు కారుమంచి - మోమో
  • కిరీటీ దామరాజు - నరేష్
  • చంద్రకాంత్ - ఛటర్జీ
  • సువర్ణ - అన్నపూర్ణ

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , స్టోన్‌ మీడియా ఫిలింస్‌
  • నిర్మాతలు: ఆకెళ్ల శ్రీనివాస్‌ [4]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆకెళ్ల శ్రీనివాస్‌
  • సంగీతం: దీపక్‌ కిరణ్
  • సినిమాటోగ్రఫీ: శరత్‌ గురువుగారి

మూలాలు

మార్చు
  1. Andrajyothy (23 July 2018). "'ప్రేమకు రెయిన్ చెక్' కొత్తగా ఉంటుంది: శరత్ మరార్". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  2. Sakshi (22 August 2018). "సెప్టెంబర్ 7న 'ప్రేమకు రెయిన్ చెక్'". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  3. The Times of India (7 September 2018). "Premaku Raincheck Movie Review {3.0/5}: Critic Review of Premaku Raincheck by Times of India". Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
  4. Deccan Chronicle (12 August 2018). "It was my wish to direct a film and I did it: Akella Peri Srinivas". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.