ప్రేమలేఖలు (1953 సినిమా)
తెలుగు సినిమా
ప్రేమలేఖలు 1953లో విడుదలైన తెలుగు చలనచిత్రం. హిందీలో "ఆహ్" అనె ప్రేమకథా చిత్రం. తెలుగు డబ్బింగ్తో విడుదల చేయబడింది. రాజ్ కపూర్, నర్గీస్ నటించారు. ఇది తమిళంలోకి కూడా "అవన్" అనే పేరుతో డబ్బింగు చేయబడింది.
ప్రేమలేఖలు (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజా నవథే |
---|---|
తారాగణం | రాజ్ కపూర్, నర్గీస్, ప్రాణ్ |
సంగీతం | శంకర్ జైకిషన్ |
నిర్మాణ సంస్థ | ఆర్.కె.ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చుఈ పాటలన్నీ ఆరుద్ర రాశారు,శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు.
- 1. ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల
- ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను
- చిగురాకుల సడి విన్నను ఎదో సెగ రేగేను
- ఏదారి ద్వారా నీరాకయో
- ఆ దారి జాడే కనరాదయో
- పేరాశలై నా కోర్కెలే ఈ మంచుగ కరిగేను
- ఇన్నాళ్ళ ప్రేమ కన్నీరుగ
- కన్నీరు మారే మున్నీరుగా
- నన్నీ గతి విడనాడితే నా హృదయము పగిలేను--జిక్కి
- 2.ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం
- 3. నీవెవ్వరవో చిరునవ్వులతొ నీరూపు నను మంత్రిచె - ఎ. ఎం.రాజా, జిక్కి
- 4. నీకు పూర్తిగా తెలుసునుగా ఈ మదిలో ఎంత ప్రేముందో - జిక్కి
- 5. నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మది సై సై - జిక్కి
- 6.పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది నటనమే ఆడెదను
- పందిట్లో పెళ్ళౌతున్నదీ కనువిందౌతున్నదీ
- నటనమే ఆడెదనూ
- పెళ్ళికుమార్తెకు పూజాఫలమూ చేతికందేనూ
- గోరింటాకూ కోయగబోతే గోళ్ళుకందేనూ
- కోరికలూ తీరుచున్నవీ అవి తీరూచున్నవీ
- నటనమే ఆడెదనూ
- వధువూ వరుడూ పల్లకిలోనా పరదేశమేగెదరూ
- వారిని తలచి బంధువులంతా సతతము వగచెదరూ
- కన్నీరే కురియుచున్నదీ మది కరుగుచున్నదీ
- ఒంటరిగా ఆడెదనూ --ఆరుద్ర,జిక్కి,శంకర్ జైకిషన్, ప్రేమలేఖలు
- 7. పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
- పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
- అయ్యయ్యో నీదు పరుగులెచ్చటకోయి
- చీకటి దారి,చుట్టూ ఎడారి చేయునదేమి
- నీ చెలి ఇల్లు చేరి,ప్రేయసి ఇల్లు చేరి
- దారిలో మూఢ తడబడకోయి,తడబడకోయి
- కంటికి రెప్ప మన పుట్టిల్లు
- కానిదానికి నీ రుణమే చెల్లు,నీ రుణమే చెల్లు
- ఎడబాటంటే ఎదలో ముల్లు,ఎదలో ముల్లు ()
-ఆరుద్ర, ఎ.ఎం. రాజా,శంకర్ జైకిషన్,ప్రేమలేఖలు
- 8.రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి
- 9.విధి రాకాసి కత్తులుదూసి - ఎ. ఎం. రాజా
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)