ప్రేమాయనమః 2003 లో శివరాం ఆప్టే దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో సాందీప్, కౌష ముఖ్యపాత్రలు పోషించారు.[2] ఒక చిన్న పల్లెటూరిలో నివసించే పూజారి కుర్రాడు తన ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా వెళ్ళి తన ప్రేమను ఎలా నెగ్గించుకున్నాడన్నది ఈ చిత్ర కథ.

ప్రేమాయనమః
దర్శకత్వంశివరాం ఆప్టే
నిర్మాతటి. దయానంద్, విద్యాశంకర్
రచనవిజయభాస్కర్ (మాటలు)
నటులుసాందీప్, కౌష
సంగీతంరమేష్ ఎర్రా
ఛాయాగ్రహణంశ్యాందత్
కూర్పువి. అంకిరెడ్డి
నిర్మాణ సంస్థ
21 సెంచురీ లయన్స్
విడుదల
2003 డిసెంబరు 12 (2003-12-12)[1]
నిడివి
130 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

అమెరికాలో నివసించే స్వప్న సెలవుల్లో తన స్వగ్రామానికి వస్తుంది. అక్కడి గుడిలో పూజారి కొడుకు కిరణ్. కిరణ్ ఆమె గురించి వివరాలు తెలియకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు. స్వప్న తిరిగి అమెరికా వెళ్ళిపోతుంది. అమెరికాలోని గుడిలో పౌరోహిత్యం పేరుతో కిరణ్ ఆమెను వెతుక్కుంటూ అమెరికా వెళతాడు. చివరికి కిరణ్ ఆమెను ఎలా కలుసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారన్నది మిగతా కథ.

తారాగణంసవరించు

గాయకుడు సాందీప్ ఈ సినిమాతో కథానాయకుడిగా, కౌష కథానాయికగా పరిచయం అయ్యారు.[3]

నిర్మాణంసవరించు

ఈ సినిమాను నలుగురు ప్రవాసాంధ్రులు కలిసి నిర్మించారు. కలకత్తా మెయిల్ అనే సినిమాకు సహాయ దర్శకుడిగా వ్యవహరించిన శివరాం ఆప్టే ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[3]

పాటలుసవరించు

రమేష్ ఎర్రా సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొత్తం 9 పాటలున్నాయి. చంద్రబోస్, భాషశ్రీ పాటలు రాయగా హరిహరన్, శంకర్ మహదేవన్, రఘు కుంచె, సాందీప్, సునీత మల్లికార్జున్, లెనినా చౌదరి తదితరులు పాటలు పాడారు.

మూలాలుసవరించు

  1. "Premayanamaha (2003) - Full Length Telugu Film - Saandip - Kausha". idreammedia.com. Archived from the original on 9 జూలై 2017. Retrieved 26 December 2017.
  2. "Premayanamaha (2003) (Telugu)". nowrunning.com. Archived from the original on 6 ఏప్రిల్ 2017. Retrieved 26 December 2017.
  3. 3.0 3.1 "Audio release - Premayanamaha". idlebrain.com. Retrieved 26 December 2017.