ప్రేమికుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు.భారత్‌తో పాటు అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు.

వాలెంటైన్‌ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. క్రీస్తుపూర్వం 270లో రోమ్‌ దేశంలో జీవించిన వాలెంటైన్‌ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్‌ కుమార్తె వాలెంటైన్‌ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్‌ గెలాసియన్స్‌ వాలెంటైన్‌ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది.[1][2][3]

మూలాలుసవరించు

  1. "నేడు ప్రేమికుల దినోత్సవం". www.andhrajyothy.com. Retrieved 2020-02-28.
  2. "ప్రేమికుల రోజు మాత్రమే కాదు..అంతకుమించి". www.eenadu.net. Archived from the original on 2020-02-28. Retrieved 2020-02-28.
  3. "ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!". www.10tv.in (in ఆంగ్లం). Retrieved 2020-02-28.