ప్రేరణ శ్రీమాలి

భారతీయ నర్తకి

ప్రేరణా శ్రీమాలి జైపూర్ ఘరానా ఆఫ్ కథక్ సీనియర్ నర్తకి.[1] రాజస్థాన్‌లోని బన్స్వారాలో జన్మించిన ఆమె జైపూర్‌లో గురు కుందన్ లాల్ గంగాని వద్ద కథక్ నృత్యం శిక్షణ పొందింది. తరువాత, ఆమె జైపూర్ ఘరానాకు చెందిన అదే గురువు ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కథక్ కేంద్రంలో కళలో తీర్చిదిద్దబడింది.[2] ఆమె అనేక కథక్ నృత్యాలకు కొరియోగ్రఫీ చేసింది. ఆమె దేశంలోనే కాక అనేక అంతర్జాతీయ నృత్య సెమినార్లు, సమావేశాలలో పాల్గొంది. ఆమె గంధర్వ మహావిద్యాలయం, శ్రీరామ్ భారతీయ కళా కేంద్రంలో యువ నృత్యకారులకు శిక్షణ కూడా ఇచ్చింది.

ప్రేరణ శ్రీమాలి
జననం
బన్స్వారా, రాజస్థాన్‌
జాతీయతభారతీయురాలు
వృత్తికథక్ నర్తకి, ఉపధ్యాయురాలు

ఆమె 2007 నుండి 2009 వరకు ఢిల్లీలోని కథక్ కేంద్రానికి రిపర్టరీ చీఫ్‌గా పనిచేసింది. ఆ తరువాత 2012 నుండి 2017 వరకు అక్కడే ఆమె సీనియర్ గురువుగా పనిచేసింది.

ఆమెకి రాజస్థాన్ సంగీత నాటక అకాడమీ అవార్డు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రాష్ట్రీయ ఏక్తా అవార్డు లభించాయి. బిబిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ది ఫార్ పెవిలియన్స్ చిత్రంలో ఆమె నృత్యం ప్రదర్శించబడింది. కథక్ నృత్యానికి ఆమె చేసిన కృషికి గాను 2009 సంవత్సరానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును భారత రాష్ట్రపతి ప్రదానం చేశారు.[3]

ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో నివసిస్తున్న ఆమె 2021లో కళావర్ట్(KALAAVART) అనే నృత్యపాఠశాలను ప్రారంభించింది.

అవార్డులు

మార్చు
  • 1981 శృంగారమణి సుర్ సింగర్ సంసద్, బొంబాయి
  • 1986 కలాశ్రీ శ్రీ సంగీత భారతి, బికనీర్
  • 1988 యువరత్న జైపూర్ జేసీస్, జైపూర్
  • 1989 రాజస్థాన్ యువ రత్న రాజస్థాన్ యువజన్ ప్రవర్తి సమాజ్, జైపూర్
  • 1989 శ్రీకాంత్ వర్మ రాష్ట్రీయ పురస్కారం భారతీయ కళ్యాణ్ పరిషత్, న్యూఢిల్లీ
  • 1990 ప్రశస్తి తామ్రపత్ర రాజస్థాన్ సమరోహ, జైపూర్
  • 1993 రాజస్థాన్ సంగీత నాటక అకాడమీ అవార్డు
  • 1996 జర్నలిస్ట్స్, రైటర్స్ & ఆర్టిస్టుల ఆధార్శిల పురస్కార్ గ్రూప్, ఢిల్లీ
  • 2001 రాష్ట్రీయ ఏక్తా అవార్డు రాజీవ్ గాంధీ 57వ జన్మదినోత్సవం
  • 2004 రజా పురస్కార్ రజా ఫౌండేషన్, ఢిల్లీ
  • 2008 కేశవ స్మృతి అవార్డు కళాధర్మి, ఢిల్లీ
  • 2010 10వ విమ్లా దేవి సమ్మాన్ విమ్లా దేవి ఫౌండేషన్, అయోధ్య

మూలాలు

మార్చు
  1. Anjana Rajan (2010-11-04). "The story so far…". The Hindu. Retrieved 2014-06-27.
  2. "Short Introduction". Sangeet Natak Akademi. Retrieved 2020-03-29.
  3. "List of Awardees". Sangeet Natak Akademi. Retrieved 2017-12-29.