ప్రొజెక్షను వెల్డింగు

ప్రొజెక్షను వెల్డింగు అనునది లోహంలను అతుకు ప్రక్రియ.ఈ విధానం కూడా స్పాట్ వెల్డింగు, బట్ వెల్డింగు, సిమ్‌ వెల్డింగులవలనే ఒక రకమైన రెసిస్టన్సు వెల్డింగు.లోహంల విద్యుత్తు ప్రవాహ నిరోధకత్వలక్షణాన్ని ఆధారం చేసుకొని/ఉపయోగించుకొని లోహంలను అతికే యాంత్రిక విధానం.projection అను ఇంగ్లీసు పదంనకు తెలుగు అర్థం లంబాకృతి, ముందుకు పొడుచుకొనివచ్చు అని.ఇందులో వెల్ల్డింగు అతుకువద్ద ఒకవైపు లోహ పలకను ముందుకు చొచ్చుకువచ్చిన (ఉబికిన) ఆకారంలో వత్తిడిద్వారా నొక్కి అతికెదరు.దీనిని లంబాకృతి లేదా ప్రలంబితం అనికూడా అనవచ్చును. ఇది స్పాట్ వెల్డింగు వంటిదే.స్పాట్ వెల్డింగులో లోహంలను అతుకు రెండు ఎలక్ట్రోడుల కొనలు శంకువు ఆకారంలో, పైభాగం స్తుపాకారంగా వుండును. ప్రొజెక్షను వెల్డింగులో క్రీంది, స్థిరంగా వుండు ఎలక్ట్రోడు ఉపరితలం సమతలంగా వుండగా, మీద నుండు కదిలే ఎలక్ట్రోడు యొక ఉపరితలం సమతలంగా వుండి, దానిపై ఒకటి లేదా రెండు ముందుకు చొచ్చుకువచ్చిన ప్రలంబితములు (ఉబ్బులు) వుండును. ప్రొజెక్షను వెల్డింగు నిర్వచనం:ప్రొజెక్షను వెల్డింగు అనునది ఒక విద్యుత్తునిరోధకాన్ని ఉపయోగించి లోహంలను అతుకు విధానం, ఈవిధానంలో అతుకు ఒక ఉబ్బు/లంబాకృతిగా ఏర్పడునట్లు యంతంయొక్క ఒక ఎలక్ట్రోడులో ఉపరితలం ముందుకు చొచ్చుక వచ్చివుండును.ఈ వెల్డింగు ఒవర్ లాప్ విధాన లేదా బట్ విధానం కావచ్చును[1]

లంబాకృతి వెల్డింగు

వెల్డింగు యంత్రం/ఉపకరణం

మార్చు

ప్రొజెక్షను వెల్డింగు ఉపకరణం నిర్మాణంలో స్పాట్ వెల్డింగు ఉపకరణాన్ని పోలివుండును.కాని దాని కన్న ఎక్కువ బలిష్టంగా దృఢంగా వుండును.ఎందుకనగా స్పాట్ వెల్డింగులో ఒక పర్యాయం ఒక చిన్న అతుకు బిందువు (spot) ఏర్పరచబడుతుంది.ప్రొజెక్షను వెల్డింగులో ఒకేపర్యాయం ఒకటికన్న ఎక్కువ అతుకుబిందువులు/వెల్డింగు జాయింటులు అతికించబడును.అందుచే ఎక్కువ ప్రమాణంలో విద్యుచ్ఛక్తి (అంఫియర్లు), ఎక్కువ బాహ్యా వత్తీడిని అతుకు సమయంలో లోహ పలకలపై కల్గించాలి, అందువలన ప్రొజెక్షను వెల్దింగు యంత్రం బలిష్టంగా వుండును.నిలువుగా పైకి క్రిందకు కదలు పై ఎలక్ట్రోడు దిమ్మ T ఆకారపు స్లాటుల ద్వారా కదలును.పై భాగపు ఎలక్ట్రోడును గట్టిగా వత్తిడి కల్గించి లోహపలకలపై నొక్కుటకై సంకోచింపచేసిన గాలి (compressed air) లేదా స్ప్రింగు లేదా హైడ్రాలిక్ శక్తిని ఉపయోగిస్తారు. అతుకబడు వస్తువుల మందాన్ని బట్టి విద్యుత్తుశక్తి బలాన్ని పెంచుట లేదా తక్కించడం, జరుగుతుంది.అలాగే, విద్యుత్తు చాలన సమయంలో కూడా మార్పులుంటాయి.[2]

ప్రొజెక్షను వెల్డింగు చేయుటకు అనుకూలమైన లోహంలు[3]

మార్చు
  1. అతితక్కువ కార్బను (0.20%గరిష్ఠం) కలిగిన ఉక్కు.
  2. మలాం ఫూసిన ఉక్కు పలకలు, తగరం లేదా సత్తు పలకలు.
  3. ఓడలు/నౌకలలో ఉపయోగించు ఇత్తళి/ఇత్తడి వస్తువులు, మొనెల్ (monel:నికెల్, కాపర్ మిశ్రమ ధాతువు) మిశ్రమధాతువులోహాలు.
  4. తుప్పుపట్టని ఉక్కు (stainless steel).
  5. టిటానియము మిశ్రమధాతువు.
  6. అల్యూమినియం
  • ప్రొజెక్షను వెల్డింగును వాహనాలను నిర్మించు/తయారుచేయు పరిశ్రమలలో, కర్మాగారాలలో ఎక్కువగా వాడెదరు.
  • అలాగే స్టడులను, నట్టులను బోల్టులను అతుకుటకు ఉపయోగిస్తారు.[4]
  • స్పాట్ వెల్డింగులో ఒకసారి ఒకచోట మాత్రమే అతుకవచ్చును.ప్రొజెక్షను వెల్డింగులో ఒకే పర్యాయం అనేక చోట్ల అతుకవలసిన లోవాన్ని అతుకవచ్చును.
  • ప్రొజెక్షను వెల్డింగులో స్పాట్ వెల్డింగు విధానం కన్న ఎక్కువ మందమున్న లోహాలను అతుక వచ్చును.

ఇవికూడా చూడండి

మార్చు
  1. వెల్డింగు

బాహ్యా లింకులు

మార్చు
  1. [1] ప్రొజెక్షను వెల్డింగునకుచెందిన బొమ్మలు.
  2. [2] ప్రొజెక్షను వెల్దింగు

సూచికలు

మార్చు
  1. "Projection Welding". www.esab.com. Archived from the original on 2006-11-10. Retrieved 2014-03-02.
  2. Welding Technology by O.P.khanna,pafe No:168
  3. "What Is Projection Welding?". www.wisegeek.com. Retrieved 2014-03-02.
  4. "Projection welding for nut and bolt attachment". www.thefabricator.com. Retrieved 2014-03-02.