ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

ప్ర‌స‌న్న‌వ‌ద‌నం 2024లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై జె.ఎస్. మణికంఠ, టి. ఆర్. ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అర్జున్ వై కె దర్శకత్వం వహించాడు. సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 7న[1], ట్రైలర్‌ను ఏప్రిల్ 26న విడుదల చేసి[2], సినిమాను మే 3న విడుదల చేశారు.[3][4]

ప్ర‌స‌న్న‌వ‌ద‌నం
దర్శకత్వంఅర్జున్ వై.కె
రచనఅర్జున్ వై.కె
నిర్మాతజె.ఎస్. మణికంఠ
టి. ఆర్. ప్రసాద్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంఎస్.చంద్రశేఖరన్
కూర్పుకార్తీక శ్రీనివాస్. ఆర్
సంగీతంవిజయ్‌ బుల్గానిన్‌
నిర్మాణ
సంస్థ
లిటిల్ థాట్స్ సినిమాస్
విడుదల తేదీs
3 మే 2024 (2024-05-03)(థియేటర్)
24 మే 2024 (2024-05-24)( ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా మే 24 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]

సూర్య (సుహాస్‌) ప్ర‌ముఖ రేడియో కంపెనీలో ఆర్‌జేగా పని చేస్తుంటాడు. సూర్య జీవితంలో ఒక ప్ర‌మాదం జరగడం వ‌ల‌న సూర్య అమ్మానాన్న‌ల్ని కోల్పోవ‌డంతోపాటు ఫేస్ బ్లైండ్‌నెస్‌ (ప్రోసోపాగ్నోసియా) స‌మ‌స్య బారిన ప‌డతాడు. ప్రోసోపాగ్నోసియా వ్యాధి వ‌చ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి మొహం తప్ప అన్ని గుర్తుప‌డ‌తారు. ఈ వ్యాధి ఉన్న సూర్య క‌ళ్ల ముందే అమృత ( సాయి శ్వేతా)ని హ‌త్య‌కు గురువుతుంది. త‌న‌కున్న స‌మ‌స్య‌తో ఆ హ‌త్య ఎవ‌రు చేశారో తెలుసుకోలేడు, కానీ హ‌త్య‌కు గురైన అమృత‌కు న్యాయం జరగాలని భావించి పోలీసుల‌కి ఈ విష‌యం తెలిపేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఈ కేసులో ఏసీపీ వైదేహి( రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) కేసులోని నిజాల‌ను ఎలా వెలికితీశారు ? ఈ క్ర‌మంలో సూర్యకు ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడు ? చివరికి హత్య చేసిన వ్య‌క్తిని గుర్తుప‌ట్టాడా లేదా అనేదే మిగతా సినిమా కథ.[6]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: లిటిల్ థాట్స్ సినిమాస్
 • నిర్మాత: జె.ఎస్. మణికంఠ[9], టి. ఆర్. ప్రసాద్ రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అర్జున్ వై.కె
 • సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
 • సినిమాటోగ్రఫీ:ఎస్.చంద్రశేఖరన్
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పేరేజి, కందాల నితీష్
 • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
 • ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం

మూలాలు

మార్చు
 1. "వింత రోగంతో హీరో సుహాస్.. 'ప్రసన్నవదనం' టీజర్ రిలీజ్!". 7 March 2024. Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
 2. 10TV Telugu (26 April 2024). "సుహాస్ 'ప్రసన్న వదనం' ట్రైలర్ రిలీజ్.. బాబోయ్ సస్పెన్స్ థ్రిల్లర్ మాములుగా లేదుగా." (in Telugu). Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 3. Chitrajyothy (30 April 2024). "ఈవారం నాలుగు సినిమాలు, ప్రేక్షకులు వస్తారా..." Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
 4. Prajasakthi (20 March 2024). "మే 3న 'ప్రసన్న వదనం'". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
 5. EENADU (18 May 2024). "'ప్రసన్నవదనం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
 6. NTV Telugu, ntv (3 May 2024). "ప్రసన్నవదనం మూవీ రివ్యూ…". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
 7. Chitrajyothy (1 May 2024). "థౌజండ్ పర్సెంట్ బ్లాక్‌బస్టర్ అంటోన్న సుహాస్.. | Prasanna Vadanam Movie Ready to Release KBK". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
 8. "'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న" (in ఇంగ్లీష్). 29 April 2024. Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
 9. Chitrajyothy (29 April 2024). "ఇండియన్ సినిమాలో.. ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు! చివరి వరకూ సర్ ప్రైజ్ చేస్తుంది". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.

బయటి లింకులు

మార్చు