హర్ష చెముడు

తెలుగు సినిమా నటుడు, యూట్యూబ్ స్టార్, క‌మెడియ‌న్‌
(వైవా హర్ష నుండి దారిమార్పు చెందింది)

హర్ష చెముడు (వైవా హర్ష) తెలుగు సినిమా నటుడు, యూట్యూబ్ స్టార్, క‌మెడియ‌న్‌, టీవీ వ్యాఖ్యాత.[2][3] హర్ష యూట్యూబ్ లో "వైవా" వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని "వైవా హర్ష"గా సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[4]

హర్ష
2022 లో కార్తికేయ-2 సినిమా ప్రమోషన్లో హర్ష
జననం
హర్ష చెముడు

(1990-08-31) 1990 ఆగస్టు 31 (వయసు 34)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లువైవా హర్ష
విద్యబి.టెక్
వృత్తినటుడు, యూట్యూబ్ స్టార్, క‌మెడియ‌న్‌, టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅక్షర [1]

బాల్యం

మార్చు

హ‌ర్ష విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. తండ్రి సత్యనారాయణ విశ్రాంత బ్యాంకు మేనేజ‌రు. తల్లి రమాదేవి గృహిణి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంకు చెందిన హర్ష కుటుంబం, విశాఖ‌ప‌ట్నంలో స్థిర‌పడింది. అతని చదువంతా విశాఖపట్నం లోనే గడిచింది. నగరం లోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదివాడు.

చిన్నప్పుడు అతనికి ఆస్థమా ఉండేది. దాని కోసం వాడిన స్టెరాయిడ్ల వలన అతని బరువు పెరిగిపోయింది. నల్లటి తన శరీరపు రంగు, లావు పట్ల ఆత్మ న్యూనత కలిగినట్లు చెబుతూ, ఆ తరువాత దాని పట్ల తన ఆలోచనలు మారాయనీ, ప్రజలను నవ్వించేందుకు కమెడియన్‌గా మారాననీ చెప్పాడు.[5]

2013 జూలై 11 న అతని తొలి వీడియో వైవా విడుదలై మంచి విజయం సాధించింది. 2024 అక్టోబరు నాటికి దానికి 2 కోట్ల 40 లక్షల వ్యూలు వచ్చాయి. ఆ వీడియో విడుదలైన వెంటనే అతనికి సినిమా అవకాశాలు వచ్చాయి.

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2014 మైనే ప్యార్ కియా తొలి చిత్రం
పవర్ (సినిమా)
గోవిందుడు అందరివాడేలే బంగారి మిత్రుడిగా
చక్కిలిగింత
2015 రెడ్ అలెర్ట్
రామ్ లీలా
డైనమైట్ (సినిమా)
సింగం123 జూనియర్ లింగం
జతకలిసే హ్యాకర్ శ్రీను
సూర్య వర్సెస్ సూర్య ఐస్ గోలా విక్రేత
సైజ్ జీరొ
యవ్వనం ఒక ఫాంటసీ గూగుల్
దోచేయ్ మాణిక్యంను గుడ్డిగా నమ్మే సహచరుడు
శంకరాభరణం హ్యాపీ తమ్ముడిగా
2016 ఛల్ ఛల్ గుర్రం
కృష్ణాష్టమి
రాజా చెయ్యివేస్తే రాజా రామ్ మిత్రుడిగా
జక్కన్న
ఎక్కడికి పోతావు చిన్నవాడా అర్జున్ మిత్రుడిగా
2017 నేనోరకం
తొలి పరిచయం
రాజా ది గ్రేట్ కబడ్డీ వ్యాఖ్యాత
ఒక్క క్షణం
నక్షత్రం డాన్స్ మాస్టర్
జై లవకుశ
2018 ఛలో [6]
తొలిప్రేమ ఆదిత్య చిన్ననాటి మిత్రుడిగా
అమీర్‌పేట్ 2 అమెరికా
వాడు నేను కాదు
తేజ్ ఐ లవ్ యు హర్ష
విజేత
నీవెవరో కళ్యాణ్ స్నేహితుడిగా
నన్ను దోచుకుందువటే హర్ష
2019 ఏబీసీడీ (అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి) సంతోష్
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు
2020 కృష్ణ అండ్ హిజ్ లీలా హర్ష
భానుమతి & రామకృష్ణ బంటీ
కలర్ ఫోటో బాల యేసు ఆహా (ఓటిటి)
మా వింత గాధ వినుమా
2021 సూపర్ ఓవర్ బంగారు రాజు
30 రోజుల్లో ప్రేమించటం ఎలా నాగార్జున
థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చీకు
తెల్లవారితే గురువారం
తిమ్మ‌రుసు
వివాహ భోజనంబు గవర్నమెంట్ ఆఫీసర్
గల్లీ రౌడీ డేవిడ్ రాజ్
మహాసముద్రం
మంచి రోజులు వ‌చ్చాయి బండ బాబు
పుష్పక విమానం
2022 హీరో
మిషన్ ఇంపాజిబుల్ బుకింగ్ క్లర్క్
పక్కా కమర్షియల్ బాలరాజు
కార్తికేయ 2 సులేమాన్
2022 బింబిసారా
2023 ప్రేమదేశం అర్జున్ స్నేహితుడు
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు విజయ్ స్నేహితుడు
బేబీ హర్ష
నిరీక్షణ గౌతమ్ స్నేహితుడు
మిస్టర్ ప్రెగ్నెంట్ గౌతమ్ స్నేహితుడు
ప్రేమ్ కుమార్ అతనే అతిధి పాత్ర
మెన్‌టూ
భాగ్ సాలే
మంత్ ఆఫ్ మధు మధుసూధన్ స్నేహితుడు
రూల్స్ రంజన్ రంజన్ స్నేహితుడు
బబుల్‌గమ్ హీరో స్నేహితుడు
2024 సుందరం మాస్టర్ సుందరం మాస్టారు
ఊరు పేరు భైరవకోన జాన్‌
పారిజాత పర్వం
ఆ ఒక్కటి అడక్కు
ప్ర‌స‌న్న‌వ‌ద‌నం
భరతనాట్యం
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
మెకానిక్ రాకీ
బచ్చల మల్లి
సారంగపాణి జాతకం

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2019 ది గ్రిల్ గణేష్ వియూ వెబ్ సిరీస్
2019 హాస్టల్ డేజ్ రవి తేజ అమెజాన్ ప్రైమ్ వీడియో
2020 షిట్ హప్పెన్స్ [7] హర్ష ఆహా
2023 డెడ్ పిక్సెల్స్ డిస్నీ+ హాట్‌స్టార్

టాక్ షోలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2020 - ప్రభుత్వం తమాషా విత్ హర్ష[8][9] వ్యాఖ్యాత ఆహా
2020 - ప్రస్తుతం సామ్ జామ్[10] సహా వ్యాఖ్యాత ఆహ

యు ట్యూబ్ వీడియోలు

మార్చు
సంవత్సరం పేరు ఇతర వివరాలు
2013 వైవా[11] [12]
2014 ఫేస్బుక్ బాబా [13]
2016 ది రిజల్ట్స్ [14]
2016 దడ్మింటన్ థియరీ[15][16]
2016 ది బిగ్ ఫాట్ ప్రపోసల్[17]
2016 ది ఇంటర్వ్యూ[18]
2017 ది టూరిస్ట్ గైడ్
2017 డ్రింక్ అండ్ డ్రైవ్[19]
2017 ది ఎగ్జామ్స్ ట్రిలోజి
2017 మోడరన్ స్వయంవరం[20]
2018 ది వీసా ఇంటర్వ్యూ' '

మూలాలు

మార్చు
  1. Sakshi (21 October 2021). "ఘనంగా వైవా హర్ష వివాహం". Archived from the original on 21 అక్టోబరు 2021. Retrieved 21 October 2021.
  2. "Viva Harsha". IMDb. Retrieved 16 April 2021.
  3. "Viva Harsha Biography , Filmography & Movie List - BookMyShow". BookMyShow. Retrieved 16 April 2021.
  4. "Funny, relatable comedy". www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2016-11-19. Retrieved 16 April 2021.
  5. "#YouTubeStars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారారు?". BBC News తెలుగు. 2018-07-01. Archived from the original on 2021-04-17. Retrieved 2024-10-22.
  6. "'Chalo' movie review: Just for a few laughs".
  7. "Shit Happens review - Where the title says it all". Shit Happens review - Where the title says it all (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-01-09. Retrieved 2020-11-02.
  8. admin. "Tamasha with Harsha Comedy Talk Show Streaming Online Watch on AHA Video". Binged (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-13.
  9. "Viva Harsha impresses with his witty humor on Tamasha with Harsha". 123telugu.com (in ఇంగ్లీష్). 2020-11-14. Retrieved 2020-12-15.
  10. "From being ridiculed to being celebrated; Viva Harsha on his journey to success". The new Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-04.
  11. https://m.youtube.com/watch?v=Ojy_UgBZbxo
  12. "VIVA: A remarkable journey of a couple of youngsters from Vizag".
  13. https://m.youtube.com/watch?v=C0eKhACuTuk
  14. https://m.youtube.com/watch?v=eNJC-VX-IN8
  15. "VIVA Harsha Is BACK. Hilarious Short Film on PV Sindhu | The Dadminton Theory -". backbenz.in. Archived from the original on 2017-01-16. Retrieved 2017-01-15.
  16. https://m.youtube.com/watch?v=xPTGcMYwAIM
  17. "viva harsha Archives - Tollywood Cinema News - Filmyflow". Tollywood Cinema News - Filmyflow (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-01-16. Retrieved 2017-01-15.
  18. https://www.youtube.com/watch?v=n6-ef_YHeJU
  19. "Viva Harsha is back: Telugu YouTube Sensation takes hilarious potshots at drunk drivers".
  20. "This 'Modern Swayamvaram' with a twist is sure to crack you up".