ప్లవకాలు
ప్లవకాలు లేదా ప్లవకజీవులు (ఆంగ్లం Planktons)[1] నీటిలో తేలుతూ కదిలే జీవులు. ఇవి జంతు, వృక్ష, బాక్టీరియా లకు చెందినవిగా విభజించారు. ఇవి సముద్రాలు, మంచినీటి యొక్క పెలాగిక్ జోన్ లో నివసిస్తాయి. ఇవి చేపలు మొదలైన జలచరాలకు ముఖ్యమైన ఆహారము.

Photomontage of plankton organisms
క్రియాశీలక విభాగాలుసవరించు
An amphipod (Hyperia macrocephala)
ప్లవకాలను అవి నివసించే ప్రాంతాన్ని, క్రియాశీలక లక్షణాల ఆధారంగా విభజించారు:
- వృక్ష ప్లవకాలు (Phytoplankton) (గ్రీకు phyton, లేదా వృక్ష అనే పదం నుండి), స్వయంపోషకాలు, ప్రోకారియోటిక్ లేదా యూకారియోటిక్ శైవలాలు ఇవి నీటి ఉపరితలంలో కాంతి ప్రసరించే ప్రాంతంలో నివసించి జీవనానికి కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) జరుపుకుంటాయి. వీనిలో డయాటమ్ (diatoms), సయనోబాక్టీరియా (cyanobacteria), డైనోఫ్లెజెల్లేట్ లు (dinoflagellates) ప్రధానమైనవి.
- జంతు ప్లవకాలు (Zooplankton) (గ్రీకు zoon, లేదా జంతు అనే పదం నుండి), చిన్న ప్రోటోజోవా లేదా మెటాజోవా (ఉదా: క్రస్టేషియా, ఇతర జంతువులు). ఇవి ఇతర ప్లవకాలను, టెలోనిమియా లను తింటాయి. కొన్ని గుడ్లు, చేపల, క్రస్టేషియా, అనెలిడా జీవుల లార్వాలను కూడా ఇందులో చేర్చారు.
- బాక్టీరియా ప్లవకాలు (Bacterioplankton), బాక్టీరియా, ఆర్కియాలు సేంద్రియ పదార్ధాలను విచ్ఛిన్నం చేసి వాటిని నీటిలో క్రిందిభాగానికి చేరవేస్తాయి.
మూలాలుసవరించు
- ↑ Planktons; ప్లవకాలు, ప్లవకజీవులు. పారిభాషిక పదకోశం: జంతుశాస్త్రం, తెలుగు అకాడమీ, పేజీ.102
బయటి లింకులుసవరించు
- COPEPOD: The global plankton database, global coverage database of zooplankton biomass and abundance data
- Plankton*Net, taxonomic database of images of plankton species
- Guide to the marine zooplankton of south eastern Australia, Tasmanian Aquaculture and Fisheries Institute
- Australian Continuous Plankton Recorder Project, Integrated Marine Observing System