ఫతేహాబాద్ జిల్లా

హర్యానా లోని జిల్లా

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో ఫతేహాబాద్ జిల్లా (ఉర్దు|ضِلع فتح آباد) ఒకటి.

ఫతేహాబాద్ జిల్లా
फ़तेहाबाद ज़िला
జిల్లా
ఫతేహాబాద్ జిల్లా is located in Haryana
ఫతేహాబాద్ జిల్లా
ఫతేహాబాద్ జిల్లా
హర్యానాలో జిల్లా స్థానం
Coordinates: 29°19′N 75°16′E / 29.31°N 75.27°E / 29.31; 75.27
దేశం India
రాష్ట్రంహర్యానా
Elevation
162 మీ (531 అ.)
జనాభా
 (2001)
 • Total8,06,158
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
125 050
టెలిఫోన్ కోడ్91 1667
Vehicle registrationHR22
Websitehttp://fatehabad.nic.in/

పేరు వెనుక చరిత్ర

మార్చు

జిల్లాకేంద్రం ఫతేహాబాద్ పేరునే జిల్లాకు పెట్టారు. ఫతేహాబాద్ పట్టణాన్ని 14వ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించాడు. ఆయన ఈ నగరానికి తన కుమారుడు ఫతేహ్ ఖాన్ పేరును నిర్ణయించాడు. 1997 జూలై 15న రూపొందించబడింది.

చరిత్ర

మార్చు

ఆర్యులు ముందుగా సరస్వతి, ద్రిషద్వతి నదీతీరాలలో నివసిస్తూ తరువాత హిస్సార్, ఫతేహాబాద్ వరకు విస్తరించారు. ఈ ప్రాంతం పాండవుల పాలనలో ఉండేదని భావిస్తున్నారు. తరువాత వారి వారసులు పాలించారని విశ్వసిస్తున్నారు. పినిని రచనలలో హిస్సార్‌లోని అయిసుకారి, తౌషయానా (తొహానా), రోరి కొన్ని ప్రాంతాలు ప్రస్తావించబడ్డాయి. పురాణాలు అనుసరించి ఫతేహాబాద్ జిల్లా నందా సాంరాజ్యంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు. ఫతేహాబాద్, హిస్సార్‌లో ఉన్న ది డిస్కవరీ ఆఫ్ అశోకన్ పిల్లర్స్ ఈ ప్రాంతం మౌర్య సాంరాజ్యంలో భాగంగా ఉండేదని తెలియజేస్తుంది. చంద్రగుప్త మౌర్యుడు గ్రీకువారిని ఎదిరించి యుద్ధం చేసిన సమయంలో ఈ ప్రాంత ప్రజలు చంద్రగుప్తునికి యుద్ధంలో సహకరించారని భావిస్తున్నారు.

ఆగ్రాలు

మార్చు

మౌర్యులు, సుంగాలు పతనం తరువాత ఆగ్రాలు యౌధేయాలు ఈ ప్రాంతాన్ని స్వతంత్రం ప్రకటించారు. అగ్రాలు స్థిరపడిన ప్రాంతాలు ప్రస్తుతం అగ్రోహ, బర్వాలా ప్రాంతాలుగా గుర్తించారు. వారు అగ్రోహా నుండి నాణ్యాలు ముద్రించారు. ఎ.ఎస్ అల్టేకర్ రచనలు అనుసరించి 2వ శతాబ్దం చివరినాటికి యౌధేయాలు రెండవసారి స్వతంత్రం ప్రకటించారు. తరువాత కుషానులను తరిమి వేసి విజయవంతంగా స్వాతంత్ర్య స్థాపన చేసారు.

సుల్తాన్ దండయాత్ర

మార్చు

11వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ముస్లిం దండయాత్రదారులు ప్రవేశించారు. సుల్తాన్ మౌసద్ అగ్రోహా మీద దండయాత్ర సాగించాడు. చౌహానులు ఈ ప్రాంతంలో ముస్లిం దండయాత్రలను ఎదుర్కోవడానికి ప్రత్యేక విధానాలు అనుసరించారు. 1192లో రెండవ ట్రియన్ యుద్ధంలో మూడవ పృధ్విరాజ్ అపజయం తరువాత ఈ ప్రాంతంలో ముస్లిముల పాలన ఆరంభం అయింది.

ముహమ్మద్ గౌరి

మార్చు

తరైన్ యుద్ధం తరువాత సుల్తాన్ - ఉద్ - ద్దీన్ ముహమ్మద్ గౌరి తన సైనికాధికారుల లోని శక్తిసంపన్నులలో ఒకరిని భారత్‌లో యుద్ధాల కొరకు నియమించాడు. అయినా అది ప్రత్యేకగా ఫలితం చూపలేదు. అయినప్పటికీ జాతూ రాజపుత్రులతో జరిగిన సంఘర్షణల తరువాత వారి శక్తిని ఫతేహాబాద్ ప్రాంతం అగ్రోహా వరకూ విస్తరించాడు. ఫీరుజ్ (1351-88) ఈ ప్రాంతాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయనకు హిస్సార్ అంటే అసాధారణమైన ఆసక్తి కలిగింది. అందువలన ఆయన ఇక్కడ హిస్సార్, ఫతేహాబాద్ నగరాలను, రెండు కాలువలను నిర్మించాడు. 1388లో ఫిరుజ్ మరణించిన తరువాత రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నెలకొన్నది. 1398లో తైమూర్ ఈ ప్రాంతం మీద దండయాత్ర సాగించిన తరువాత పరిస్థితి మరింత విషమించింది.ఈ ప్రాంతం మీద తైమూర్ సాగించిన దండయాత్రలో ఈ ప్రాంతప్రజలు తైమూరును ఎదుర్కొనడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. తైమూర్ తొహనా వరకు దండయాత్ర సాగించాడు. అయినప్పటికీ తైమూర్ ఈ ప్రాంతంలో సుస్థిర పాలన స్థాపించడానికి ప్రయత్నించలేదు. తైమూర్ ఫతేబాదును దోచుకున్న తరువాత సమానాకు వెళ్ళాడు. బాబర్, హుమాయూన్ కాలంలో ఈ ప్రాంతం మొఘల్ సాంరాజ్యంలో భాగంగా మారింది.

హుమాయూన్ మసీద్

మార్చు
 
పటియాలా మహారాజా అమర్ సింగ్

ఫతేహాబాద్‌లో హుమాయూన్ మసీదు పేరిట ఒక చిన్న మసీదు ఉంది. షేర్‌ షా సూరీతో పోరాడి అపజయం పొందిన తరువాత హుమాయూన్ తప్పించుకుని పారిపోయే సమయంలో ఫతేహాబాద్ మీదుగా పారిపోయాడు. అక్బర్ పాలనా కాలంలో ఫతేహాబాద్ ప్రాముఖ్యత కలిగిన మహల్స్‌లో ఒకటిగా ఉండేది. 1760 నాటికి ఈ ప్రాంతం మీద సిక్కులు, భట్టీలు, ముస్లిం సంస్థానాధీశులు మారిమారి ఆధిక్యత సాధించినప్పటికీ భట్టీలు తప్ప తక్కిన వారు ఎవరూ స్థిరమైన పాలన సాగించలేదు. భట్టీలు ఈ ప్రాంత పరగణా అధికారులుగా కొంత ఆధిక్యత కలిగి ఉన్నారు. 1744 లో పాటియాల మహారాజా అమర్ సింగ్ తన మంత్రి, దివాన్ నానుమల్ ఫతేహాబాద్ సమీపంలోని బిఘర్‌ను ఆక్రమించుకున్నాడు. కాని త్వరలోని వారు దాని మీద ఆధిక్యత కోల్పోయారు.

పాటియాలా

మార్చు

పాటియాలా ప్రధాని తొహానాను కూడా స్వాధీనపరచుకున్నాడు. 1781లో జిండ్ ఒప్పందం తరువాత ఫతేహాబాద్, సిర్సా భట్టీలకు ఆధీనం అయ్యాయి. మిగిలిన భూభాగాలు సిక్కుల ఆధీనంలో ఉన్నాయి. 1798లో అగ్రొహా, తొహనా భూభాగాలు జార్జ్ తోమస్ ఆధీనంలో ఉన్న ప్రధాన పరగణాలుగా అయ్యాయి. జార్జ్ తోమస్ సిక్కు - మారాఠీ - ఫ్రెంచ్ ఈ ప్రాంతం నుండి వెలుపలికి పంపబడ్డాడు. ఫ్రెంచ్ అధికారి బౌర్క్వియన్ మరాఠీల తతఫున ఈ ప్రాంతం మీద అధీనత పొందాడు. ఆయన తొహానా, హిస్సార్‌లను పునర్నిర్మిచాడాని భావిస్తున్నారు., తరువాత ఈ ప్రాంతాలు మొఘల్ ప్రముఖుడు హంసి ఆధీనంలో ఉన్నాయి.

నిర్వహణ

మార్చు
ఉపవిభాగం తాలూకా ఉప తాలూకా మండలాలు
ఫతేహాబాద్ ఫతేహాబాద్ భునా ఫతేహాబాద్
రతియా రతియా జఖల్ మండి రతియా
తొహనా తొహనా భట్టు తొహన
భునా
భట్టు కలన్
జఖల్

[1]

వాతావరణం

మార్చు

జిల్లాలో ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. వేసవి అధికంగా వేడిగానూ శీకాలం చల్లగానూ ఉంటుంది. జూన్ ఉష్ణోగ్రత 47డిగ్రలు, డిసెంబరు ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడుల వరకు చేరుతుంది.

వర్షపాతం

మార్చు

సరాసరి వర్షపాతం 395 మి.మీ. సాధారణంగా వర్షపాతం పశ్చిమదిశ నుండి తూర్పు దిశకు సాగుతూ ఉంటుంది. ఫతేహాబాద్- హిస్సార్ ప్రాంతాలలో వర్షపాతం సరాసరి 339- 428 మి.మీ వ్యత్యాసంతో కురుస్తుంది. నైరుతీ ఋతుపవనాలు జిల్లాలో 71 % వర్షాన్ని (జూలై- సెప్టెంబరు) అందిస్తుంది. జూలై- ఆగస్టు మాసాలలో వర్షపాతం అత్యధికంగా కురుస్తుంది.

ప్రయాణ సౌకర్యాలు

మార్చు

ఫతేహాబాద్ జిల్లా రహదారి మార్గం ద్వారా పంజాబు రాష్ట్రంతో చక్కగా అనుసంధానితమై ఉంది. ఫతేహాబాద్ నగరంలో రైలు మార్గం లేదు. మెటల్ రోడ్డు మార్గాలు జిల్లాలోని పట్టణాలను, గ్రామాలను అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 10 ఫతేహాబాద్ జిల్లాను ఢిల్లీ, పంజాబు రాష్ట్రంతో అనుస్ంధానిస్తుంది.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 941,522,[2]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 461 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 371 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.79%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 903:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 69.1%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

మార్చు

జిల్లా ప్రజలలో హర్యాంవి పంజాబీ, బగ్రి మాండలికాలు వాడుకలో ఉన్నాయి. జండ్లి కలాన్, గోరఖ్పూర్‌లలో హర్యాంవి పంజాబీ వాడుకలో ఉంది.

సమీపగ్రామాలు

మార్చు
  • అహర్వన్
  • అహిల్సదార్
  • అయాల్కలి
  • బదొపాల్ (ప్రదీప్ దేహ్రు)
  • బంవాలి
  • భొదై ( ఫతేహాబాద్ నుండి 3కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో 1660 ఆవులతో ఉన్న పెద్ద గోశాల ఉంది. గ్రామంలో అనాథశరణాలయం ఉంది.
  • జంద్లి కలాన్ (జాట్ అత్యంత)
  • జంద్లి కుర్ద్
  • జహ్లానియా
  • చంద్రవాల్
  • భీర్దానా
  • రాట్టా ఖేరా
  • బిఘర్
  • దరియాపూర్
  • ధంఘర్
  • ధాని మియాన్ ఖాన్
  • జాంద్ వాలా సొత్తార్
  • సలాంఖెరా
  • మతానా
  • కిర్దాన్
  • భట్టు
  • తుయియా
  • ధాని చనాన్ వాలీ

ఫతేహాబాద్ జిల్లాలోని పెద్ద గ్రామాలలో అహిల్సదార్ గ్రామం ఒకటి. జాతీయరహదారి -10 నుండి 6 కి.మీ దూరంలో ఉన్న ఇది జిల్లాలో అత్యంత సారవంతమైన భూమిని కలిగి ఉంది. ఈ గ్రామంలో విదేశాలలో నివసిస్తున్న భారతీయులు అధికంగా ఉన్నారు. గ్రామంలో విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ప్రతికుటుంబంలో ఉన్నారు.

బిఘార్

మార్చు

బిఘార్ ఫతేహాబాద్ నుండి 7కి.మీ దూరంలో ఉంది. ఫతేహాబాద్ జిల్లాలోని పెద్ద గ్రామాలలో బిఘార్ ఒకటి. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ (గురు టెక్ బహదూర్ ఇంటర్నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ) ఉంది. బిఘార్ గ్రామం నుండి రహదారి మార్గం ద్వారా 12 గ్రామాలకు (భోదియారా, మటానా, ధంఘర్, సలంఖేరా, ధనిమియాన్ ఖాన్, చబ్లమొరి, ధండ్, బంవాలి, కిర్ధాన్) చేరుకోవచ్చు.

బిర్దానా - హరప్పన్ టౌన్ షిప్

మార్చు

భిర్దానాలో 5000 సంవత్సరాలనాటి హరప్పన్ పట్టణం కనుగొనబడింది. ఇది సింధూనాగరికత కాలం (హరప్పన్ శకం) నాటిదని భావిస్తున్నారు. బిఒర్ధాన్‌లో లభించిన పలు నిర్మాణాలు (కోటగోడలు, మట్టి పాత్రలు, పురాతన వస్తువులు) మట్టి, ఇటుకలతో నిర్మించబడినవని భావిస్తున్నారు. ఇవి ప్రత్యేకంగా హరప్పన్ శకానికి సంబంధించినవని భావిస్తున్నారు.

తుయియా

మార్చు

తుయియా ఫతేహాబాద్ నుండి 28కి.మీ దూరంలో ఉంది. భట్టు కాలా నుండి 7 కి.మీ దూరంలో ఉంది. రహదారి మార్గంతో ఇతర గ్రామాలతో అనుసంధానితమై ఉన్న తుయియా గ్రామం ఆర్థికంగా, సాంఘికంగా చక్కగా అభివృద్ధిచెంది ఉంది.ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి, ఉన్నత పాఠశాల ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. http://fatehabad.nic.in/
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware 897,934

బయటి లింకులు

మార్చు