ఫతేహాబాద్

హర్యానా రాష్ట్రం లోని పట్టణం

ఫతేహాబాద్ హర్యానా రాష్ట్రంలోని పట్టణం. ఇది ఫతేహాబాద్ జిల్లా ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంస్థ నిర్వహిస్తుంది.

ఫతేహాబాద్
పట్టణం
ఫతేహాబాద్ is located in Haryana
ఫతేహాబాద్
ఫతేహాబాద్
హర్యానాలో పట్టణ స్థానం
Coordinates: 29°31′N 75°27′E / 29.52°N 75.45°E / 29.52; 75.45
దేశం India
రాష్ట్రంహర్యాణా
జిల్లాఫతేహాబాద్
Elevation
208 మీ (682 అ.)
జనాభా
 (2011)
 • Total70,777
భాషలు
 • అధికారికహర్యాన్వీ, హిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
125050
టెలిఫోన్ కోడ్1667
ISO 3166 codeIN-HR
Vehicle registrationHR-22

చరిత్ర

మార్చు

పట్టణంలో హుమాయున్ మసీదు అనే పేరున్న మసీదు ఒకటి ఉంది. ఇందులో ఫిరోజ్ షా కి లాట్ అనే అశోక స్తంభం యొక్క దిగువ భాగం ఉంది. బహుశా ఇది అగ్రోహా దిబ్బ నుండి తీసినది కావచ్చు. ఈ దిబ్బ లోని దిగువ భాగం హిసార్ వద్ద ఉన్న లాట్ కి మసీదులో ఉంది. [1]

భౌగోళికం

మార్చు

ఫతేహాబాద్ 29°31′N 75°27′E / 29.52°N 75.45°E / 29.52; 75.45 నిర్దేశాంకాల వద్ద ఉంది [2] సముద్ర మట్టం నుండి దీని ఎత్తు 208 మీటర్లు. ఇది హర్యానా రాష్ట్రంలో నైరుతి భాగంలో ఉంది. జిల్లా చుట్టూ ఉత్తరాన పంజాబ్, దక్షిణాన హిసార్ జిల్లా, తూర్పున జింద్, రాజస్థాన్లు, పశ్చిమాన సిర్సా జిల్లా ఉన్నాయి.

జనాభా వివరాలు

మార్చు

2001 జనగణన ప్రకారం, [3] ఫతేహాబాద్ జనాభా 59,863. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. అక్షరాస్యత 66%, జాతీయ సగటు 59.5% కంటే కొద్దిగా ఎక్కువ. ఇందులో పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీల అక్షరాస్యత 60%. ఫతేహాబాద్‌ జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఫతేహాబాద్ పట్టణ జనాభా 70,777. ఇందులో 37,320 మంది పురుషులు, 33,457 మంది మహిళలు ఉన్నారు.

జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 8263 మంది. ఇది మొత్తం జనాభాలో 11.67 %. పట్టణ జనాభాలో లింగ నిష్పత్తి 896. పిల్లల లింగ నిష్పత్తి 858. పట్టణ అక్షరాస్యత 81.96%. అక్షరాస్యత పురుషుల్లో 86.86% కాగా, స్త్రీలలో 76.53%. [4]

మూలాలు

మార్చు
  1. Lat of Feroz Shah
  2. Falling Rain Genomics, Inc - Fatehabad
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  4. http://www.census2011.co.in/data/town/800398-fatehabad-haryana.html