ఫరూఖాబాద్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
(ఫరూఖాబాద్ నుండి దారిమార్పు చెందింది)

ఫరూఖాబాద్ జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. ఫతేగఢ్ ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఫరూఖాబాద్ జిల్లా కాన్పూర్ డివిజన్‌లో భాగంగా ఉంది.

ఫరూఖాబాద్ జిల్లా
फ़र्रुख़ाबाद ज़िला

فرّخ آباد ضلع
ఉత్తర ప్రదేశ్ పటంలో ఫరూఖాబాద్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో ఫరూఖాబాద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుకాన్పూర్
ముఖ్య పట్టణంఫతేగఢ్
మండలాలు3
విస్తీర్ణం
 • మొత్తం2,279 కి.మీ2 (880 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం15,77,239
 • జనసాంద్రత690/కి.మీ2 (1,800/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72%
ప్రధాన రహదార్లు3
Websiteఅధికారిక జాలస్థలి
కైమ్‌గంజ్‌లోని నవాబ్ రషీద్ ఖాన్ సమాధి

గతంలో ఫరూఖాబాద్ జిల్లా ప్రాంతం కన్నౌజ్ జిల్లాలో భాగంగా ఉండేది. 1997 సెప్టెంబరు 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 తాలూకాలు (ఫరూఖాబాద్, కైంగంజ్, అమృత్పూర్ (ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. 1997లో రాజేపూర్ మండలం నుండి అమృత్పూర్ తాలూకా రూపొందించబడింది..

భౌగోళికం

మార్చు

జిల్లా చదరంగా ఉంటుంది. కొంత భూభాగం మాత్రమే ఎగుడుదిగుడుగా ఉంటుంది. కొంతభూభాగంలో నదీలోయల ప్రాంతంలో కొంత దిగుడుగా ఉంటుంది. జిల్లాలో ఎత్తైన భూభాగం మొహమ్మదాబాద్ వద్ద సముద్రమట్టానికి 167 మీ ఎత్తున ఉంది. లోతైన మౌ రసూల్‌పూర్ వద్ద భూభాగం 145.69 మీ లోతు ఉంటుంది. ఫరూఖాబాద్ వద్ద గంగామైదానం ఉంటుంది.

సరిహద్దులు

మార్చు
సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు బదాయూన్, షాజహాన్‌పూర్ జిల్లాలు
తూర్పు సరిహద్దు హర్దోయీ జిల్లా, గంగానది, రాంగంగ నది
దక్షిణ సరిహద్దు కన్నౌజ్, కాళి నది.
పశ్చిమ సరిహద్దు ఎటావా, మైన్‌పురి
అక్షాంశం 26° 46' నుండి 27° 43' ఉత్తర
రేఖాంశం 79° 7' నుండి 80° 2' తూర్పు

వాతావరణం

మార్చు

జిల్లాలో వేడి- పొడి వేసవి వాతావరణం, ఆహ్లాదకరమైన శీతాకాలం ఉంటుంది.

ఫరూఖాబాద్ నగరం

మార్చు

జిల్లా కేంద్రం ఫతేగఢ్ వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 2,28,830 చ.కి.మీ.జిల్లాలో 3 తాలూకాలు, 7 మండలాలు, 511 గ్రామపంచాయితీలు, 1010 గ్రామాలు, 13 పోలీస్ స్టేషన్లు, 2 నగర పాలితాలు, 4నగర పంచాయితీలు, ఒక కంటోన్మెంట్ బోర్డు ఉన్నాయి. 1714లో ఫరూఖాబాద్ నగరాన్ని నవాబ్ మొహమ్మద్ ఖాన్ బంగాష్ స్థాపించాడు. నగరానికి ముగల్ చక్రవర్తి ఫరీఖ్‌సియర్ పేరును నిర్ణయించాడు.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 18,87,577, [1]
ఇది దాదాపు. లెసొతొ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 250 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 865 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.2%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 874:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 70.57%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

పర్యాటక ఆకర్షణలు

మార్చు
 
All Souls Memorial Church

ఫతేఘర్ కంటోన్మెంటు

మార్చు

ఫతేగర్ కంటోన్మెంట్ గంగానదీ తీరంలో ఉంది. ఇందులో 3 రెజిమెంట్లు ( రాజ్పుత్ రెజిమెంటు, సిఖ్ లైట్ ఇంఫాంటరి, టెర్రిటోరియల్ ఆర్మీ) ఉన్నాయి. జిల్లా సివిల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం ఫతేగర్‌లో ఉంది. ఫతేగర్‌లో అత్యధికభాగాన్ని కంటోన్మెంటు ఆక్రమించి ఉంది. .

స్వర్గ్‌ద్వారి

మార్చు

రాధోర్ రాజవంశానికి చెందిన 5 రాజవంశాలలో ఒకరైన గర్వార్లకు స్వర్గ్‌ద్వారి రాజధానిగా ఉంది. ఇది కైంగంజ్ తాలూకాలో ఉంది. ఈ నగరాన్ని చివరగా కుంవర్ రాయ్ సింగ్ (ఖోరా) పాలించాడు. 12-13 చారిత్రక సాహిత్యంలో ఆయన పేరు ఖొరాగా ప్రస్తావించబడింది. కుంవర్ రాయ్ సింగ్ బదౌన్ గవర్నర్ షాంస్- ఉద్- దిన్ ఇల్తుమిష్ సా.శ. 1212 దాడి చేసేవరకు ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఈ దాడి తరువాత ఈ నగరం పేరు దాడి దారుని పేరు (షంసాబాద్) నిర్ణయించబడింది.

కంపిల్

మార్చు

ఫరూఖాబాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం. ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు. 13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్, దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.

మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన పవిత్రప్రదేశం ఉంది. రామాయణ కాలంలో శత్రుఙడు పూజించిన " రామేశ్వరనాథ్ మహాదేవ్ " ఆకయం ఉంది. శత్రుఙడు లంకలో రావణాసురుని చెరలో సీతమ్మ పూజించిన శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించాడని విశ్వసిస్తున్నారు.

సంకిస

మార్చు

సంకిస ఫరూఖాబాద్‌కు 47 కి.మీ దూరంలో ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ తన శిష్యులతో ప్రసంగించాడని విశ్వసిస్తున్నారు. ఇక్కడ బుద్ధుడు వాడుకున్న పక్కి ఇటుకలతో నిర్మించిన పెద్ద ఆసనం ఉంది. ప్రజలు ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించారు. అందులో బిసరి దేవి ఆలయం ఉంది. ఇక్కడ త్రవాకాలలో లభించిన అశోక స్తంభం ఉంది. ఇక్కడ శివలింగం కూడా ఉంది. బుద్ధుని వైశాఖ పౌర్ణమి నాడు జన్మదినం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించబడుతుంది. శ్రీలంక, వియత్నాం, మాయన్మార్ మొదలైన దేశాలనుండి బౌద్ధమతస్థులు ఇక్కడకు వద్తుంటారు. ఇక్కడ బుద్ధుని విశాలమైన ఆలయం నిర్మిస్తే ఇది ప్రాముఖ్యత సంతరించుకుంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

నీబ్కరోరి

మార్చు

ఇది పురాతన షంకిస సమీపంలో ఉన్న చిన్న గ్రామం. ఇది 20వ శతాబ్ధపు ఋషి " లక్ష్మణ బాబా " (బాబా నీం కరోలి) స్వస్థలం.

పంచల్ ఘాట్

మార్చు

పంచల్ ఘాట్ ప్రధాన నగరానికి 4 కి.మీ దూరంలో గంగా నది తీరంలో నిర్మించబడింది. ఇక్కడ అధికంగా చిన్న ఆలయాలు, షాపులు, నివాసాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో " రామనగరియా " ఉత్సవం నిర్వహించబడుతుంది.

పాండవేశ్వర్ మహాదేవ్

మార్చు

పాండవేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని పాండవులు తమ అఙాతవాస సమయంలో నిర్మించారని విశ్వసిస్తున్నారు.

ఫరూకాబాద్ యువ మహోత్సవ్ సమితి

మార్చు

ఫరూఖాబాద్ జిల్లాలో 2005లో ప్రారంభించిన ఫరూకాబాద్ యువ మహోత్సవ్" మిస్ ఫరూఖాబాద్, మిస్టర్ ఫరూఖాబాద్, మిస్ ఉత్తరప్రదేశ్, ప్రెటీ ఇండియా పోటీ, మిస్టర్ వంటి పోటీలను నిర్వహించింది. శ్రీ సురేంద్ర సింగ్ సోంవంశి-అడ్వొకేట్ (కన్వీనర్), డాక్టర్ సందీప్ శర్మ (ఛైర్మన్), Srichandra మిశ్రా (ఆర్గనైజింగ్ కార్యదర్శి) ఫరూకాబాద్ యువ మహోత్సవ్ ప్రధాన సభ్యులుగా ఉన్నారు.

జిల్లా పరిపాలన

మార్చు

ప్రస్తుతం,

  • శ్రీ ఎన్.కె.ఎస్ చౌహాన్, ఐ.ఏ.యస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉంది.
  • శ్రీ విజయ్ యాదవ్, ఐ.పి.ఎస్, పోలీస్ సూపరింటెండెంట్ ఉంది.
  • శ్రీ రాజేంద్ర చౌదరి, హెచ్.జె.ఎస్. జిల్లా న్యాయాధిపతి.
  • మనోజ్ కుమార్ సింఘాల్, పి.సి.ఎస్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉంది.
  • మెహ్ముద్ ఆలం అన్సారీ, పి.సి.ఎస్. సిటీ మెజిస్ట్రేట్ ఉంది.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

వ్యవసాయం

మార్చు

ఫరూఖాబాద్ జిల్లా ఉర్లగడ్డలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు అధికంగా పండించబడుతున్నాయి. జిల్లా వ్యవసాయ భూముల నీటిసరఫరాకు గంగానది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధిక భాగం వ్యవసాయ భూములు వార్షికంగా మూడు పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వ్యయసాయ ఉత్పత్తి శాతం అధికంగా ఉంటుంది. కైంగజ్ తాలూకాలో మామిడి, జామ అధికంగా పండించబడుతుంది.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lesotho 1,924,886
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. West Virginia 1,852,994
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.