షాజహాన్‌పూర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో షాజహాన్‌పూర్ జిల్లా ఒకటి. షాజహాన్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. షాజహాన్‌పూర్ జిల్లా రోహిల్‌ఖండ్ డివిజన్లో భాగం. 1813లో బ్రిటిష్ ప్రభుత్వం, బరేలీ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను ఏర్పరచింది. జిల్లాలో పొవయాన్, తీహార్, జలాలబాద్, సాదర్.
షాజహాన్‌పూర్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | బరేలీ |
ముఖ్య పట్టణం | షాజహాన్‌పూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | షాజహాన్‌పూర్ |
• శాసనసభ నియోజకవర్గాలు | కాట్రా, జలాలాబాద్, తిల్హర్, పోవాయన్, షాజహాన్‌పూర్, దద్రౌల్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,575 కి.మీ2 (1,766 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 30,02,376 |
• జనసాంద్రత | 660/కి.మీ2 (1,700/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 61.61% (Male) 70.09% (Female) |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
మార్చుషాజహాన్పూర్ దిలెర్ ఖాన్, బహదూర్ ఖాన్ [1] దరియా ఖాన్ కుమారులు మొగల్ చక్రవర్తి షాజహాన్ సైన్యంలో ఒక సైకులుగా ఉండేవారు. షాజహాన్ పాలనలో సోదరులిద్దరూ (దిలర్ ఖాన్, బహదూర్ ఖాన్) అధికారహోదా కలిగి ఉండేవారు. దిలర్ ఖాన్ సేవలకు సంతృప్తి చెందిన షాజహాన్ చక్రవర్తి 14 గ్రామాలను బహుమానంగా ఇస్తూ కోట నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు. దిలర్ ఖాన్ నైనార్ ఖెరా వద్ద కోటను నిర్మించాడు. కోట గంగా, ఖన్నౌత్ నదీసంగమంలో నిర్మించబడింది.
జిల్లా కేంద్రం
మార్చుజిల్లాకేంద్రం షాజహాన్ పూర్ ఇప్పటికీ షాజహాన్ పూర్ షహ్ర్ అని పిలువబడుతుంది. ఇది ప్రత్యేక ముంసిపాలిటీగా ఉంది.
భౌగోళికం
మార్చుషాజహాన్పూర్ బరెలీ డివిజన్ ఆగ్నేయ భూభాగంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో షాజహాన్‌పూర్ వ్యవసాయ ఆధారిత జిల్లా. ప్రభుత్వ రికార్డుల ఆధారంగా ఈ జిల్లా 1813లో స్థాపించబడిందని భావిస్తున్నారు. జిల్లా రూపొందించక ముందు ఇది బరేలీ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా 27.35 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.37 డిగ్రీల రేల్హాంశంలో ఉంది. జిల్లా సరిహద్దులలో లఖింపూర్ ఖేరి, హర్దోయీ, ఫరూఖాబాద్, బారెల్లీ, బదౌన్, పిలిభిత్. జిల్లా వైశాల్యం 4575 చ.కి.మీ.
జిల్లాలో ప్రధానంగా రామగంగ, గర్రాహ్, గోమతి నదులు ప్రవహిస్తున్నాయి.జిల్లాలో అదనంగా కథన, ఝుక్మా, మెంసీ నదులు ప్రవహించి గోమతి నదిలో సంగమిస్తున్నాయి. కన్నౌట్, సుకేత, కాళి నదులు గర్రాహ్ నదిలో సంగమిస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా గోధుమలు, పప్పుధాన్యాలు, సజ్జలు, ఉర్లగడ్డలు పండించబడుతున్నాయి.
జిల్లాలో ఆర్మీకంటోన్మెంటు, డిఫెంస్ ఫోర్స్ కొరకు పెద్ద క్లోతింగ్ ఫ్యాక్టరీ ఉంది. షాజహాన్ పూర్ క్లబ్బుకు జిల్లాలో ప్రాముఖ్యత ఉంది. ఈ క్లబ్ సభ్యత్వం ఒకప్పుడు అంతస్తు చిహ్నంగా ఉండేది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,002,376, [2] |
ఇది దాదాపు. | అల్బేనియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | మిసిసపి నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 123వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 673 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.84%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 865:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 61.61%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ప్రముఖ వ్యక్తులు
మార్చు- రామ్ ప్రసాద్ బిస్మిల్ (స్వాతంత్ర్య సమరయోధుడు)
- అష్ఫాఖుల్లా ఖాన్ (స్వాతంత్ర్య సమరయోధుడు)
- ఠాకూర్ రోషన్ సింగ్ (స్వాతంత్ర్య సమరయోధుడు)
- ప్రేమ్ కృష్ణ ఖన్నా (స్వాతంత్ర్య సమరయోధుడు)
- శ్యాం బిహారీ బాజ్‌పాయీ (స్వాతంత్ర్య సమరయోధుడు)
- హ్రిదయేష్ (నవలా రచయిత)
- క్రాంత్ ఎం.ఎల్. వర్మ (కవి, రచయిత & చరిత్రకారుడు)
- రాజ్‌పాల్ యాదవ్ (బాలీవుడ్ నటుడు)
- జితిన్ ప్రసాద్ (భారత రాజకీయనాయకుడు, కుమారుడు జితేంద్ర ప్రసాద్)
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Dr. Mehrotra N.C. Shahjahanpur Etihasik Evam Sanskritik Dharohar 1999 Pratiman Prakashan 30 Kucha Ray Ganga Prasad Allahabad 211003 భారత దేశము page 114
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Albania 2,994,667 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U.S.Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Mississippi 2,967,297